NRPT: జిల్లాలో రైస్ మిల్లర్లు సీఎంఆర్ బియ్యాన్ని నిర్ణీత గడువులోగా ప్రభుత్వానికి అందించాలని అదనపు కలెక్టర్ శ్రీను ఆదేశించారు. కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలో సీఎంఆర్ డెలివరీలను వేగవంతం చేయాలని సూచించారు. రబీ ధాన్యం కేటాయింపుల కోసం బ్యాంక్ గ్యారెంటీలు, ఒప్పంద పత్రాలు సమర్పించాలని తెలిపారు. నాణ్యమైన బియ్యాన్ని సరఫరా చేయాలని స్పష్టం చేశారు.