KMM: మధిర మార్కెట్ యార్డులో శనివారం పీఏసీఎస్ ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ కమిటీ ఛైర్మన్ బండారు నరసింహారావు, మధిర మున్సిపల్ ఛైర్పర్సన్ సామినేని సుజాత ప్రారంభించారు. రైతులు పండించిన ప్రతి గింజకు మద్దతు ధర కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మున్సిపల్ ఛైర్పర్సన్ తెలిపారు.