KMM: నేలకొండపల్లి మండల పరిధిలోని గువ్వలగూడెం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ముప్పాళ్ల ప్రసన్న(27) బుధవారం రాత్రి తన ఇంట్లో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను నేలకొండపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.