WGL: వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో లోకల్ బాడీ అడిషనల్ కలెక్టర్ వై.వి. గణేష్ నేడు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఉపాధి హామీ పనులు, నర్సరీ, డంపింగ్ యార్డ్‌ను పరిశీలించి రికార్డులు తనిఖీ చేశారు. గ్రామంలో నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని, పారిశుద్ధ్య పనులు క్రమం తప్పకుండా చేయాలని అధికారులను ఆదేశించారు. అభివృద్ధి పనుల వేగవంతంపై దిశానిర్దేశం చేశారు.