ADB: అసాంఘిక కార్యకలాపాలపై 8712659973 నెంబర్కు వాట్సాప్ ద్వారా సమాచారం అందించాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. పోలీస్ ముఖ్య కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల కార్యక్రమంలో SP అఖిల్ మహాజన్ పాల్గొన్నారు. బాధితుల సమస్యలను పరిష్కరించినప్పుడు, సత్వర న్యాయం చేసినప్పుడు పోలీసు వ్యవస్థపై మరింత నమ్మకం పెరుగుతుందని సూచించారు.