NRML: సోన్ మండలం జాఫ్రాపూర్ గ్రామంలో రూ.52 లక్షలతో పలు అభివృద్ధి పనులకు శుక్రవారం రాత్రి MLA మహేశ్వర్ రెడ్డి భూమి పూజ చేశారు. రూ.20 లక్షలతో భవనాలు, రూ. 20 లక్షలతో రెండు S.H.G వర్కింగ్ షెడ్ నిర్మాణానికి, రూ.12 లక్షలతో అంగన్వాడీ భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బర్ల రాజారెడ్డి, మండల నాయకులు పాల్గొన్నారు.