ADB: ఆదివాసీల హక్కులు, సమస్యల పరిష్కారానికి కలిసికట్టుగా ఉద్యమించాలని ఆదివాసుల పోరాట హక్కుల తుడుందెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గణేష్ అన్నారు. ఆదివారం ఇంద్రవెల్లి మండలంలో ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. కమిటీ ఛైర్మన్ నాగ్ నాథ్, గౌరవాధ్యక్షుడు నాగోరావ్, ప్రధాన కార్యదర్శి తులసిరామ్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు పేర్కొన్నారు.