NLG: తుర్కపల్లిలో ఐద్వా ఆధ్వర్యంలో మహిళా డిక్లరేషన్ అమలు, మహిళల సమస్యలపై సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రభావతి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ములుగు మహిళా డిక్లరేషన్లో ఇచ్చిన హామీలను ఇప్పటికీ పూర్తిగా అమలు చేయలేదని విమర్శించారు. మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం, వడ్డీ లేని రుణాల హామీలను వెంటనే చేయాలన్నారు.