SRCL: ముస్తాబద్ మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన 101 సీసీ కెమెరాలను శనివారం జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ప్రారంభించారు. నేరాల నియంత్రణ, నిందితుల గుర్తింపు, శాంతిభద్రతల పరిరక్షణలో సీసీ కెమెరాలు కీలకమని ఆయన తెలిపారు. ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానంగా పనిచేస్తుందన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు రావాలన్నారు.