ASF: సిర్పూర్ (U) మండల కేంద్రంలో SI రామకృష్ణ ఆధ్వర్యంలో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా వాహనదారులకు అవగాహన కల్పించారు. బైక్ నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, లైసెన్స్, బీమా పత్రాలు వెంట ఉంచుకోవాలని సూచించారు. మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని, ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలన్నారు.