NLG: చిట్యాలలో ఎట్టకేలకు ఫ్లైఓవర్ నిర్మాణ పనులు వేగం పుంజుకున్నాయి. రెండేళ్లుగా నత్తనడకన సాగుతున్న ఈ పనుల వల్ల ప్రయాణికులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా పోలీస్ స్టేషన్ కూడలి వద్ద భారీ క్రేన్ల సహాయంతో పిల్లర్లపై నిలువు దిమ్మెలను అమర్చుతున్నారు. సర్వీస్ రోడ్లపై ట్రాఫిక్ మళ్లింపుతో దుమ్ము, రద్దీతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు.