»Lucknow Super Giants Beat Punjab Kings By 56 Runs Rise To 2nd Spot In Table
IPL 2023: పంజాబ్ ని చిత్తుగా ఓడించిన లక్నో
మొహాలీలో జరిగిన రన్-ఫెస్ట్‌లో లక్నో సూపర్ జెయింట్(Lucknow Super Giants) పంజాబ్ కింగ్స్(Punjab Kings)ను 56 పరుగుల తేడాతో ఓడించింది. 258 పరుగుల ఛేదనలో, PBKS 201 పరుగులకు ఆలౌటైంది. మొదటి ఇన్నింగ్స్‌లో, LSG బ్యాటర్లు విజృంభించారు. ఆ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్లకు 257 పరుగులు చేసింది, IPL చరిత్రలో ఇది రెండవ అత్యధిక స్కోర్ కావడం గమనార్హం.
మార్కస్ స్టోయినిస్ 40 బంతుల్లో 72 పరుగులతో అత్యధిక స్కోరు చేయగా, కైల్ మేయర్స్ 24 బంతుల్లో 54 పరుగులు చేశాడు. నికోలస్ పూరన్ 19 బంతుల్లో 45, ఆయుష్ బడోని 24 బంతుల్లో 43 పరుగులు చేశాడు. కగిసో రబడ రెండు వికెట్లు తీశాడు. అయితే అతని నాలుగు ఓవర్లలో 52 పరుగులు లీక్ చేశాడు. ఈ నెల 15న లక్నోని 2 వికెట్ల తేడాతో పంజాబ్ ఓడించగా.. ఈ విజయంతో లక్నో(Lucknow Super Giants) ప్రతీకారం తీర్చుకుంది.
మ్యాచ్‌లో టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన లక్నో టీమ్ 5 వికెట్ల నష్టానికి 257 పరుగుల స్కోరు నమోదు చేసింది. టీమ్‌లో స్టాయినిస్ (72: 40 బంతుల్లో 6×4, 5×6), కైల్ మేయర్స్ (54: 24 బంతుల్లో 7×4, 4×6), పూరన్ (45: 19 బంతుల్లో 7×4, 1×6), బదోని (43: 24 బంతుల్లో 3×4, 3×6) చెలరేగిపోయారు. ఒక వైపు వికెట్లు పడుతున్నా ఈ నలుగురూ ఏ దశలోనూ హిట్టింగ్ ఆపలేదు. దాంతో ఐపీఎల్(IPL) చరిత్రలోనే రెండో అత్యధిక స్కోరుని లక్నో నమోదు చేయగలిగింది.
258 పరుగుల భారీ లక్ష్యఛేదనలో పంజాబ్ కింగ్స్(Punjab Kings)కి ఆరంభం నుంచే వరుస ఎదురుదెబ్బలు తగిలాయి. కెప్టెన్ శిఖర్ ధావన్ (1), ప్రభసిమ్రాన్ సింగ్ (9) సింగిల్ డిజిట్ స్కోరుకే ఔటైపోగా.. అనంతరం వచ్చిన అథర్వ (66: 36 బంతుల్లో 8×4, 2×6) హిట్టింగ్తో అదరగొట్టేశాడు. అతనికి సికిందర్ రజా (36: 22 బంతుల్లో 4×4, 1×6) నుంచి కాస్త సపోర్ట్ లభించింది. కానీ.. అప్పటికే బంతులు, పరుగుల మధ్య అంతరం భారీగా పెరిగిపోయింది.
దాంతో ఇద్దరూ ప్రతి బంతికీ హిట్టింగ్‌కి వెళ్లక తప్పలేదు. ఆ తర్వాత మిడిల్ ఓవర్లలో లివింగ్‌స్టోన్ (23: 14 బంతుల్లో 2×4, 1×6) మెరుపులు ఒక ఓవర్‌కే పరిమితం అయ్యాయి. చివర్లో శామ్ కరన్ (21: 11 బంతుల్లో 2×4, 1×6), జితేశ్ శర్మ (24: 10 బంతుల్లో 3×6) దూకుడుగా ఆడి ఓటమి అంతరాన్ని తగ్గించే ప్రయత్నం చేశారు. షారూక్ ఖాన్ (6), రాహుల్ చాహర్ (0), కగిసో రబాడ (0) లాస్ట్‌లో ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. దాంతో ఒక బంతి మిగిలి ఉండగానే పంజాబ్ 201 పరుగులకి ఆలౌటైంది. లక్నో బౌలర్లలో యశ్ ఠాకూర్ నాలుగు వికెట్లు, నవీన్ ఉల్ హక్ మూడు వికెట్లు, రవి బిష్ణోయ్ రెండు వికెట్లు తీశారు.