E.G: నల్లజర్ల మండలం అనంతపల్లి సీతారామ పేటలోని వరసిద్ధి వినాయకుడికి భక్తులు వెండి కిరీటం సమర్పించారు. కంఠమణి విష్ణు ప్రియా, బోయపాటి ప్రమీల దేవి, ఝాన్సీ రాణి ఈ కానుకను అందజేశారు. ఆదివారం అర్చకులు స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి, సుమారు రూ.1.50 లక్షల విలువైన 700 గ్రాముల వెండి కిరీటాన్ని అలంకరించారు. భక్తుల చొరవను ఆలయ అర్చకులు, స్థానికులు అభినందించారు.