సత్యసాయి: పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి ఉన్నత విద్యాసంస్థ ప్రశాంతి నిలయం క్యాంపస్ విద్యార్థులు ఆదివారం ‘ధాగే ప్యార్ కే’ పేరుతో ఘనంగా కృతజ్ఞతా కార్యక్రమం నిర్వహించారు. సాయి కుల్వంత్ హాల్లో జరిగిన ఈ వేడుకలో విద్యార్థులు తమ విద్యాభ్యాస అనుభవాలను, భగవాన్ బాబాతో ఉన్న అనుబంధాన్ని ప్రదర్శనల ద్వారా చాటిచెప్పారు. విద్యార్థుల ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి.