IPL 2026లో ఇవాళ చెన్నై, కోల్‌కతా తలపడనున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో ఆడిన 4 మ్యాచ్‌ల్లో CSK ఒక్కటే గెలవగా.. అన్నే మ్యాచ్‌లాడిన KKR ఇంకా గెలుపు ఖాతా తెరవాల్సి ఉంది. ఇక గణాంకాల ప్రకారం ఇరుజట్ల మధ్య జరిగిన 32 మ్యాచ్‌ల్లో చెన్నై 20, కోల్‌కతా 11 గెలిచాయి. మరి చివరి మ్యాచ్ గెలిచిన చెన్నై ఇందులోనూ గెలుస్తుందా? లేక KKR తొలి విజయం అందుకుంటుందా? చూడాలి.