చిన్నస్వామి పిచ్ బ్యాటర్లకు అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ బౌండరీలు చిన్నగా ఉండటంతో భారీ స్కోర్లు నమోదవుతాయి. ఈ సీజన్లో జరిగిన రెండు మ్యాచుల్లోనూ ఇరుజట్లు కూడా 200 కంటే ఎక్కువ పరుగులు సాధించాయి. దీంతో ఇవాళ్టి మ్యాచ్లో కూడా 200-220 మధ్య స్కోరు నమోదయ్యే అవకాశం ఉంది. కాగా, ఈ స్డేడియంలో జరిగిన 102 IPL మ్యాచుల్లో ఛేజింగ్ జట్లు 54 సార్లు విజయం సాధించాయి.