»Wrestlers Protest Wrestlers To Throw Medals In Haridwars Ganga River After Sit On Hunger Strike
Wrestlers Protest సంచలన నిర్ణయం.. పతకాలు గంగా నదిలో కలిపేందుకు సిద్ధం
మహిళా క్రీడాకారులు తమకు న్యాయం చేయాలని కోరడం సబబా? దేశం తరఫున మేం పతకాలు ఎందుకు సాధించామా? అనే భావన వస్తోంది. ఇప్పుడు వాటికి (పతకాలు) ఎటువంటి అర్థం లేకుండా పోయింది. వాటిని తిరిగి ఇవ్వడం మరణంతో సమానం.
భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ (Brij Bhushan Sharan Singh)ను అరెస్ట్ చేయాలనే డిమాండ్ పై భారత దిగ్గజ రెజ్లర్లు పోరాటాన్ని మరింత తీవ్రం చేయనున్నారు. ఈ క్రమంలోనే ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోకపోతే తాము సాధించిన పతకాలను (Medals) గంగా నదిలో కలిపేస్తామని ప్రకటించారు.
ఈ మేరకు రెజ్లర్లు (Wrestlers) కీలక ప్రకటన చేశారు. మంగళవారం గంగానదిలో (Ganga River) నిమజ్జనం చేస్తామని ప్రకటించారు. గంగానదిలో కలిపేందుకు ఇప్పటికే రెజ్లర్లు ఢిల్లీ (Delhi) నుంచి ఉత్తరాఖండ్ (Uttarakhand) లోని హరిద్వార్ (Haridwar)కు బయల్దేరారు. ‘మా మెడలో అలంకరించిన ఈ పతకాలకు ఇక అర్థం లేదు అనిపిస్తోంది. మావాటిని తిరిగి ఇవ్వాలనే ఆలోచనలో నన్ను చంపేసింది. కానీ మీ ఆత్మగౌరవంతో రాజీపడి జీవించడం వల్ల ఉపయోగం ఏమిటి? అని రెజ్లర్ సాక్షి మాలిక్ (Sakshee Malikkh) ట్వీట్ చేసింది.
గంగానదిలో పతకాలను నిమజ్జనం చేసిన అనంతరం మళ్లీ ఢిల్లీకి వచ్చి బుధవారం నుంచి నిరాహార దీక్ష (Hunger Strike) కొనసాగించాలని రెజ్లర్లు నిర్ణయించారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాటాన్ని వదిలిపెట్టమని స్పష్టం చేశారు. నెల రోజులకు పైగా పోరాటం చేస్తున్నా తమ గురించి ప్రధాని అడగకపోవడంపై తాము విస్తుపోయినట్లు రెజ్లర్లు పేర్కొన్నారు. ‘మే 28వ తేదీన జరిగిన పరిణామాలు అందరూ చూశారు. శాంతిపూర్వకంగా ఆందోళన (Protest) చేపడుతున్న మాపై పోలీసులు (Delhi Police) దారుణంగా ప్రవర్తించారు. పైగా మాపైనే కేసు నమోదు చేశారు. మహిళా క్రీడాకారులు తమకు న్యాయం చేయాలని కోరడం సబబా? దేశం తరఫున మేం పతకాలు ఎందుకు సాధించామా? అనే భావన వస్తోంది. ఇప్పుడు వాటికి (పతకాలు) ఎటువంటి అర్థం లేకుండా పోయింది. వాటిని తిరిగి ఇవ్వడం మరణంతో సమానం. కానీ ఆత్మాభిమానాన్ని (Self Respect) చంపుకుని బతకడం కష్టం. రాష్ట్రపతి (President of India), ప్రధానికి పతకాలను తిరిగి ఇచ్చేద్దామనుకున్నా మనసు అంగీకరించడం లేదు. వారిద్దరూ మా సమస్యలను పట్టించుకోవడం లేదు. ఈ సందర్భంగా సాయంత్రం హరిద్వార్ వద్ద గంగానదిలో పతకాలను కలిపేయనున్నాం. ఈ పతకాలే మా ప్రాణం (Life).. ఆత్మ. అందుకే వాటిని గంగలో కలిపేశాక ఇండియా గేట్ (India Gate) వద్ద ఆమరణ నిరాహార దీక్షకు దిగుతాం’ అని రెజ్లర్ భజరంగ్ పునియా (Bajrang Punia) ప్రకటించారు.