కన్నడ బ్యూటీ రష్మిక మందన్న క్రేజ్ ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్లో ఉంది. అందుకే అమ్మడికి బడా బడా ఆఫర్లొస్తున్నాయి. నేషనల్ క్రష్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ హాట్ బ్యూటీ.. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ డమ్ అందుకుంది. దాంతో ప్రస్తుతం రష్మిక చేతిలో పలు భారీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇక ఇప్పుడు అమ్మడికి మరో బంపర్ ఆఫర్ తలుపు తట్టినట్టు తెలుస్తోంది. అదే నిజమైతే రష్మికలోని మరో యాంగిల్‌ను చూడడం పక్కా అని చెప్పొచ్చు.
రియాల్టీకి దగ్గరగా సినిమాలు తీసే దర్శకుడు శేఖర్ కమ్ముల.. నెక్ట్స్ ఫిల్మ్‌లో రష్మికను తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. శేఖర్ కమ్ముల హీరోయిన్లంటేనే గ్లామర్‌కు దూరంగా.. ఎంతో స్పెషల్‌గా.. సహజంగా ఉంటారు. చివరగా ఈ దర్శకుడు తెరకెక్కించిన ఫిదా, లవ్ స్టోరీ సినిమాల్లో సాయి పల్లవికి మంచి పేరొచ్చింది. అయితే ఇప్పుడు ఖేఖర్ నెక్ట్స్ ఛాయిస్ రష్మిక అని తెలుస్తోంది. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ ధనుష్‌తో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడు శేఖర్ కమ్ముల.
ఇటీవలె ఈ సినిమా స్క్రిప్టును లాక్ చేశాడని.. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుందని వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో రష్మికను హీరోయిన్గా తీసుకునే ఆలోచనలో ఉన్నాడట శేఖర్ కమ్ముల. ఇదే నిజమైతే రష్మిక లక్కీ ఛాన్స్ కొట్టేసినట్టేనని చెప్పొచ్చు. త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ రానుందని టాక్. ప్రస్తుతం రష్మిక చేతిలో అన్ని పెద్ద సినిమాలే ఉన్నాయి. తెలుగులో పుష్ప2, వారసుడు.. బాలీవుడ్లో మిషన్ మజ్ను, యానిమల్ వంటి చిత్రాలు చేస్తోంది. ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో వరుస ఫోటో షూట్స్‌తో హాట్ హాట్‌గా రెచ్చిపోతోంది అమ్మడు.