VKB: తెలంగాణ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో వికారాబాద్ అడ్వకేట్ ఆకుల మహేశ్ కుమార్ ఘన విజయం సాధించారు. తెలంగాణ హైకోర్టు పరిధిలో జరిగిన ఈ ఎన్నికల్లో మొత్తం 203 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఆయన మూడో స్థానంలో నిలిచి గెలుపొందడం విశేషం. న్యాయవాదుల మధ్య మంచి పేరు సంపాదించిన మహేశ్ కుమార్ సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ అందరి అభిమానాన్ని పొందారు.