• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ప్రస్తుత కాలువ స్థితిగతులను పరిశీలించిన అధికారులు

KMM: పెరుగుతున్న సాగు, తాగునీటి అవసరాల దృష్ట్యా చెరువును నింపేందుకు ఉన్న సాంకేతిక అవకాశాలను, కాలువల ప్రస్తుత స్థితిగతులను అధికారులు నిశితంగా పరిశీలించారు. ముదిగొండ మండలంలోని ముత్తారం పల్లె చెరువుకు ఎన్ఎస్పీ జలాలను మళ్లించేందుకు ఇరిగేషన్, మిషన్ భగీరథ అధికారులు శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టారు.

March 14, 2026 / 07:41 AM IST

మార్చి 17న క్రీడా పాఠశాల ఎంపిక పోటీలు

SRD: ప్రభుత్వ క్రీడా పాఠశాలల్లో ప్రవేశాల కోసం ఈ నెల 17న ఉదయం 9 గంటలకు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు ఎంఈవో బండారి మనీలా తెలిపారు. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్న క్రీడాకారులు తమ ఒరిజినల్ బోనఫైడ్, జనన ధృవీకరణ పత్రం, ప్రోగ్రెస్ కార్డు, ఆధార్, కుల ధృవీకరణ పత్రాలతో హాజరుకావాలని సూచించారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

March 14, 2026 / 07:40 AM IST

‘ప్రభుత్వ ఆసుపత్రి సేవలను సద్వినియోగం చేసుకోవాలి’

PDPL: జిల్లా ప్రధాన ఆసుపత్రిలో అధునాతన వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూపరింటెండెంట్ డా.శ్రీధర్ కోరారు. ఆసుపత్రిలో నవజాత శిశు సంరక్షణతో పాటు 2డీ ఎకో, లాప్రోస్కోపిక్, యూరాలజీ, రూట్ కెనాల్ చికిత్సలు ఉచితంగా అందిస్తున్నట్లు పేర్కొన్నారు. సేవలకు సంబంధించి ఎవరికీ డబ్బులు ఇవ్వవద్దని, ఇబ్బందులు ఎదురైతే తనకు ఫిర్యాదు చేయాలన్నారు.

March 14, 2026 / 07:40 AM IST

డ్రైవర్లకు నిద్రమత్తు వదిలిస్తున్న పోలీసులు

కోనసీమ జిల్లాలో పోలీసులు స్టాప్ వాష్ అండ్ గో కార్యక్రమం ముమ్మరంగా చేస్తున్నారు. అర్ధరాత్రి, తెల్లవారుజామున జరిగే ప్రమాదాలను అడ్డుకునేందుకు ఈ కార్యక్రమాన్ని వినూత్నంగా చేపట్టారు. శనివారం తెల్లవారుజామున జాతీయ, రాష్ట్ర రహదారులపై ప్రయాణిస్తున్న వాహనాలను నిలిపి డ్రైవర్‌తో ముఖం కడిగించి, నిద్రమత్తు వల్ల కలిగే ముప్పును తప్పిస్తున్నారు.

March 14, 2026 / 07:39 AM IST

సోమవారం ప్రజావాణి రద్దు: కలెక్టర్

BHNG: జిల్లాలో 2027 జనగణన మొదటి దశ-హౌస్ లిస్టింగ్ & హౌసింగ్ సెన్సెస్‌కు సంబంధించి జిల్లా ఛార్జ్ స్థాయి అధికారులకు శిక్షణ కార్యక్రమం ఉన్నందున ఈ నెల 16న నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు శుక్రవారం జిల్లా కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు దరఖాస్తులు ఇచ్చేందుకు కలెక్టరేట్‌కు రావొద్దని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.

March 14, 2026 / 07:39 AM IST

టెన్త్ విద్యార్థులకు శుభాకాంక్షలు: కలెక్టర్

NDL: రేపు జరిగే పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే నంద్యాల జిల్లాలోని సుమారు 25,035 మంది విద్యార్థులకు కలెక్టర్ జి. రాజకుమారి శనివారం శుభాకాంక్షలు తెలిపారు. విద్య మనిషిని ఎక్కడైనా గౌరవనీయుడిగా నిలబెడుతుందన్నారు. విద్యార్థులు మంచి మార్కులు సాధించి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు గర్వకారణంగా నిలవాలని, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆమె ఆకాంక్షించారు.

March 14, 2026 / 07:38 AM IST

ఉపాధి దిశగా ‘టాస్క్’ సెంటర్ ఏర్పాటుకు అడుగులు

NGKL: కల్వకుర్తి నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ అందించి ఉపాధి పెంచేందుకు తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (TASK) సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నారు. టాస్క్ సీఓఓ ఛైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి బృందం శుక్రవారం పట్టణంలోని పలు ప్రభుత్వ భవనాలను పరిశీలించింది. యువతకు ఆధునిక సాంకేతికతపై శిక్షణ ఇచ్చి, వారిని ఉద్యోగాలకు సిద్ధం చేయడమే ఈ కేంద్రం లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

March 14, 2026 / 07:37 AM IST

నిర్లక్ష్యానికి నిదర్శనం ఈ చిత్రం..!

NLG: చిట్యాల పట్టణంలోని హైస్కూల్ పక్కన, వనిపాకల మూల మలుపు వద్ద గేట్ వాల్‌పై మూత లేకపోవడం ప్రమాదకరంగా మారింది. ఈ చిత్రం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలిచింది. వాహనాల రాకపోకలతో నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో తెరిచి ఉన్న గేట్ వాల్ వల్ల వాహనదారులు, ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

March 14, 2026 / 07:34 AM IST

ఓబీసీ మోర్చా మండల అధ్యక్షుడిగా తిరుపతయ్య

MBNR: హన్వాడ బీజేపీ ఓబీసీ మోర్చా మండల అధ్యక్షుడిగా తిరుపతయ్య నియమితులయ్యారు. ఈ మేరకు మండల అధ్యక్షుడు కొండ లింగన్న వివరాలు వెల్లడించారు. బీజేపీ బలోపేతానికి, కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని తిరుపతయ్య హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, ఇతర బీజేపీ నాయకులు పాల్గొని ఆయనకు అభినందనలు తెలిపారు.

March 14, 2026 / 07:34 AM IST

నూతన బస్ స్టాప్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే

కృష్ణా: పెడపారుపూడి మండలం జువ్వనపూడి గ్రామంలో పాగోలు రాజ్ సౌమిత్ (మున్నా) సహకారంతో నిర్మించిన నూతన బస్ స్టాప్‌ను ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా నిన్న ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి మౌలిక సదుపాయాలు ఎంతో అవసరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

March 14, 2026 / 07:34 AM IST

పోగొట్టుకున్న ఫోన్ బాధితుడికి అందజేత

MLG: గోవిందరావుపేట మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన రవీందర్ ఇటీవల తన మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నారు. వెంటనే బాధితుడు పస్రా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు CEIR పోర్టల్ ద్వారా ఫోన్ IMEI నంబర్ ఆధారంగా సాంకేతిక విశ్లేషణ చేసి ఫోన్ ఆచూకీ కనిపెట్టారు. శుక్రవారం సాయంత్రం పస్రా పోలీస్ స్టేషన్లో రెండో SI ఎర్రయ్య బాధితుడికి ఫోన్‌ను అందజేశారు.

March 14, 2026 / 07:33 AM IST

నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు: ఏసీపీ

KMM: ఇసుక అక్రమ రవాణాను అరికట్టడమే లక్ష్యంగా సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని వైరా ఏసీపీ సారంగపాణి ఆదేశించారు. మధిర మండలం చిలుకూరు వద్ద గల అంతర్రాష్ట్ర పోలీస్ చెక్పోస్ట్ను శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీ రికార్డులను పరిశీలించి, వాహన సోదాల్లో వేగం పెంచాలని సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

March 14, 2026 / 07:33 AM IST

బ్లింకిట్ రిఫండ్ పేరుతో సైబర్ మోసం

GNTR: కృష్ణనగర్‌కు చెందిన పగడాల ప్రసాద్ బ్లింకిట్ యాప్ ఆర్డర్ రిటర్న్ చేసే క్రమంలో సైబర్ మోసగాళ్ల బారిన పడ్డారు. గూగుల్‌లో దొరికిన నంబర్‌కు కాల్ చేయగా, రిఫండ్ వస్తుందని నమ్మించి యూపీఐ ద్వారా ఆయన నుంచి రూ.84 వేలు కాజేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు శుక్రవారం పట్టాభిపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

March 14, 2026 / 07:32 AM IST

యూరియా యాప్ తొలగించాలని డిమాండ్

SDPT: సిద్దిపేట ప్రెస్ క్లబ్‌లో రైతు సంఘాలు, ప్రజా సంఘాల ప్రతినిధులు కలిసి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రెండు పంటలకు మాత్రమే రైతు భరోసా ఇచ్చి, మిగిలిన మూడు పంటలకు ఇవ్వకపోవడంతో రైతు సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం రైతులను చిన్నచూపు చూస్తోందని మండిపడ్డారు. రైతు భరోసా అమలు చేసి యూరియా ఆప్ తొలగించాలని డిమాండ్ చేశారు.

March 14, 2026 / 07:31 AM IST

లాడ్జిలో డిప్యూటీ MPDO మృతి

CTR: కుప్పం ప్యాలెస్ రోడ్డులోని లాడ్జిలో అనంతపురం జిల్లా గుమ్మకట్ట డిప్యూటీ MPDO చంద్రశేఖర్ మృతి చెందాడు. నిన్న రాత్రి 7:30 గంటల ప్రాంతంలో చంద్రశేఖర్ లాడ్జిలో రూమ్ తీసుకుని కొంతమందితో కలిసి మద్యం తాగినట్టు సమాచారం. లాడ్జ్ గది ముందు ఉన్న కారిడార్లో జీవచ్చవంలా పడి ఉన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు గుండెపోటుతో చంద్రశేఖర్ మృతి చెంది ఉంటాడని  భావిస్తున్నారు.

March 14, 2026 / 07:30 AM IST