• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘ధరలను అదుపు చేయడంలో కేంద్రం విఫలం’

HNK: దేశంలో పెరిగిన గ్యాస్‌, నిత్యావసరాల ధరలను అదుపు చేయటంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి తోట బిక్షపతి అన్నారు. గుండ్ల సింగారంలో ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చి ఆచరణలో అరకొర అమలు చేసి గొప్పలు చెప్పుకుంటున్నాయన్నారు.

March 13, 2026 / 08:20 PM IST

సీపీఐ వినూత్న నిరసన

VZM: గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ సీపీఐ ఆధ్వర్యంలో విజయనగరంలో శుక్రవారం వినూత్న నిరసన చేపట్టారు. కన్యాకాపరమేశ్వరి ఆలయం జంక్షన్ వద్ద గ్యాస్ బండను తలపై పెట్టుకుని ఆందోళన నిర్వహించారు. జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్ మాట్లాడుతూ.. గ్యాస్ ధరలు పెంచి సామాన్య ప్రజలపై భారం మోపారని కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు.

March 13, 2026 / 08:19 PM IST

ప్రయాణికులకు BIG SHOCK

విమాన ప్రయాణికులకు ఇండిగో విమానయాన సంస్థ షాక్ ఇచ్చింది. పెరిగిన జెట్ ఇంధన ధరల ప్రభావంతో ఫ్యూయల్ సర్‌ఛార్జీని పెంచుతున్నట్లు ప్రకటించింది. రేపటి నుంచి అన్ని దేశీయ, అంతర్జాతీయ సర్వీసులపై ఈ అదనపు భారం పడనుంది. ఇప్పటికే ఎయిరిండియా సర్‌ఛార్జీ విధించగా, తాజాగా ఇండిగో కూడా అదే బాటలో పయనిస్తోంది. దీంతో విమాన ప్రయాణం మరింత భారం కానుంది.

March 13, 2026 / 08:18 PM IST

కృత్రిమ కొరతను సృష్టిస్తే కఠిన చర్యలు: కలెక్టర్

NZB: ఎవరైనా కృత్రిమ కొరతను సృష్టించి బ్లాక్ మార్కెట్లో గ్యాస్ సిలిండర్లను విక్రయిస్తే నిత్యావసర సరకుల చట్టం-1955 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని NZB కలెక్టర్ ఇలా త్రిపాఠి శుక్రవారం హెచ్చరించారు. జిల్లాలో 5,81,769 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయని, 33 గ్యాస్ ఏజెన్సీల ద్వారా సరఫరా జరుగుతోందని, 10,850 సిలిండర్లు జిల్లాలో గృహావసరాల కోసం అందుబాటులో ఉన్నాయన్నారు.

March 13, 2026 / 08:16 PM IST

‘విద్యార్థులు ఒత్తిడికి లోను కాకుండా పరీక్షలు రాయాలి’

KNR: విద్యార్థులు ఒత్తిడికి లోనవకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని, 10వ తరగతి విద్యార్థులకు చొప్పదండి మండల విద్యాధికారి పి. మోహన్ సూచించారు. ఈనెల 14 నుంచి ఏప్రిల్ 16 వరకు జరగబోయే పదవ తరగతి వార్షిక పరీక్షలకు మండలంలో 3 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని, పరీక్షలకు సర్వం సిద్ధం చేసినట్లు, 237 మంది బాలురు, 296 మంది బాలికలు మొత్తం, 533 రాస్తున్నారని తెలిపారు.

March 13, 2026 / 08:16 PM IST

‘కమ్యూనికేషన్ స్కిల్స్ తోనే కేరీర్ వృద్ధి’

ASR: ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకుంటే ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని అరకులోయ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ చలపతిరావు తెలిపారు. శుక్రవారం కళాశాలలో నిర్వహించిన “30 రోజుల ఇంగ్లీష్ కమ్యునికేషన్ స్కిల్స్” శిక్షణ ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ శిక్షణలో తెలిపిన చిట్కాలను ప్రతిరోజు పాటిస్తే ఇంగ్లీష్ కమ్యునికేషన్ మెరుగుపడుతుందని అన్నారు.

March 13, 2026 / 08:16 PM IST

శాంతి భద్రతల పరిరక్షణలో సాయిధ దళ పాత్ర కీలకం: ఎస్పీ

WNP: పోలీసు సిబ్బంది సంక్షేమం, ఆరోగ్యం, పిల్లల విద్య పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపడం ద్వారా మాత్రమే పోలీస్ శాఖ మరింత బలపడుతుందని జిల్లా ఎస్పీ సునీత రెడ్డి తెలిపారు. శుక్రవారం వనపర్తి జిల్లా పోలీస్ కార్యాలయంలో సాయిధ దళ పోలీసు సిబ్బందితో సమీక్షించారు. ఆమె మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో, ఎన్నికల సమయంలో సాయిధ దళ పోలీసు సేవలు అత్యంత కీలకమని తెలిపారు.

March 13, 2026 / 08:15 PM IST

‘అవకాశం దొరికితే మళ్లీ మళ్లీ ఇందూరు తిరుమలకు వస్తా’

NZB: అవకాశం దొరికితే మళ్లీ మళ్లీ ఇందూరు తిరుమలకు వస్తానని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. శుక్రవారం ఆమె మోపాల్ మండలం నర్సింగ్ పల్లిలోని ఇందూరు తిరుమల క్షేత్రంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో పాల్గొని మాట్లాడారు. ఆలయం నేపథ్యం తెలుసుకొని తాను సంభ్రమాశ్చర్యాలకు గురి అయ్యానన్నారు. స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు.

March 13, 2026 / 08:14 PM IST

‘హక్కులపై వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలి’

GDWL: ప్రపంచ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా శుక్రవారం మదనపల్లిలో జిల్లా న్యాయ సేవా సంస్థ అవగాహన కార్యక్రమం నిర్వహించింది. ప్రతి వినియోగదారుడు వస్తువులు, సేవల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ప్రతినిధులు సూచించారు. ఏ వస్తువు కొన్నా ఖచ్చితంగా బిల్ తీసుకోవాలని, మోసపోతే న్యాయపరంగా పోరాడాలని పిలుపునిచ్చారు.

March 13, 2026 / 08:13 PM IST

హోటల్స్ తనిఖీ.. 19 సిలిండర్స్ సీజ్

PDPL: పౌరసరఫరాల శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ఇవాళ గోదావరిఖని పట్టణంలోని 7 హోటల్స్‌ను తనిఖీ చేసినట్లు అదనపు కలెక్టర్ వేణు ఒక ప్రకటనలో తెలిపారు. గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు ఉపయోగిస్తుండడంతో 19 సిలిండర్స్ సీజ్ చేసి, 7 హోటల్స్‌పై కేసులు నమోదు చేశామని తెలిపారు.

March 13, 2026 / 08:12 PM IST

మళ్లీ పెరగనున్న బెంజ్ కార్ల ధరలు

మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఏప్రిల్ 1 నుంచి తన కార్ల ధరలను 2% వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. రూపాయి విలువ పడిపోవడం, ఇన్‌పుట్ ఖర్చులు పెరగడమే దీనికి కారణమని కంపెనీ తెలిపింది. ఈ ఏడాది ధరలు పెరగడం ఇది రెండోసారి. ఈ పెంపుతో మోడల్‌ను బట్టి ధర రూ.89,000 నుంచి రూ. 7.33L వరకు పెరగనుంది. లగ్జరీ కార్ల ప్రియులకు ఇది షాకింగ్ న్యూస్.

March 13, 2026 / 08:11 PM IST

‘సీఎంకు రైతులంటే చాలా ఇష్టం’

W.G: ఉండి AMC నగదు పంపిణీ కార్యక్రమంలో శుక్రవారం అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణం రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది సీఎం చంద్రబాబుకు రైతులంటే చాలా ఇష్టమని, మన జిల్లా చూస్తే 65 శాతం ఆదాయం రైతుల నుంచే వస్తుంది అన్నారు. ఏ రాష్ట్రం ఇలా ఇవ్వటం లేదన్నారు.

March 13, 2026 / 08:10 PM IST

రేపే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

KDP: రాజంపేటలో జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రేపు (మార్చి 14) ఘనంగా నిర్వహించనున్నారు. రాజంపేట పార్లమెంటు జనసేన పార్టీ ఇంఛార్జ్ యల్లటూరు శ్రీనివాస రాజు ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. మన్నూరు యల్లటూరు భవన్‌లో ఉదయం 10 గంటలకు పార్టీ పతాక ఆవిష్కరణ, మధ్యాహ్నం 12 గంటలకు అన్న క్యాంటీన్‌లో అన్నదాన కార్యక్రమం చేస్తున్నట్లు తెలిపారు.

March 13, 2026 / 08:09 PM IST

పనులకు డెడ్‌లైన్ పెట్టండి: మంత్రి

BHPL: పూర్తి చేయాల్సిన అభివృద్ధి పనులకు డెడ్‌లైన్ పెట్టాలని, గడువు ముగిసినా పూర్తి కాకపోతే అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేసి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని IT మంత్రి శ్రీధర్ బాబు ఆదేశించారు. శుక్రవారం మహదేవపూర్ మండలంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, కాంగ్రెస్ నేతలు ఉన్నారు.

March 13, 2026 / 08:08 PM IST

ఇఫ్తార్ విందులో పాల్గొన్న డీసీసీ ప్రధాన కార్యదర్శి

SRD: కంగ్టి మండలం తడ్కల్‌లో శుక్రవారం సాయంత్రం సర్పంచ్ ఎలిచల సుగుణ మల్లారెడ్డి ఆధ్వర్యంలో ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసిన దావత్- ఏ – ఇఫ్తార్ విందులో డీసీసీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మానవతా విలువలతో మనిషి మహోన్నతుడిగా మారాలన్నదే ఉపవాసాల ముఖ్యోద్దేశ్యమని ఆయన అన్నారు.

March 13, 2026 / 08:08 PM IST