• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

10th విద్యార్థులు.. ఇవి ఒకసారి చెక్ చేసుకోండి!

TG: కాసేపట్లో పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. విద్యార్థులు తమ హాల్ టికెట్లను తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలి. సెల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు, కాలిక్యులేటర్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు. ప్రశ్నాపత్రం ఇవ్వగానే అన్ని ప్రశ్నలను ఒకసారి చదవండి. మీకు బాగా తెలిసిన సమాధానాలను ముందుగా రాయండి. పరీక్షా సమయంలో ప్రశాంతంగా ఉండండి. ALL THE BEST

March 14, 2026 / 08:00 AM IST

బేస్తవారిపేటలో కార్డన్ అండ్ సెర్చ్

ప్రకాశం: బేస్తవారిపేటలోని బీసీ కాలనీలో ఇవాళ తెల్లవారుజామున సీఐ మల్లికార్జున ఆధ్వర్యంలో కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీలో అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలను పరిశీలించారు. పలు మోటార్ సైకిళ్లు పత్రాలు లేకుండా కనిపించడంతో వాటిని స్వాధీనం చేసుకుని వాటిని పరిశీలిస్తున్నట్లు సీఐ మల్లికార్జున తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సై రవీంద్ర రెడ్డి పాల్గొన్నారు.

March 14, 2026 / 07:57 AM IST

ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలి: డీఈవో

KDP: జిల్లాలో సోమవారం నుంచి 10th పరీక్షలు ప్రారంభం అవుతున్నాయి. విద్యార్థులు మానసిక ప్రశాంతతో, ఏకాగ్రతగా ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని DEO శంషుద్దీన్ సూచించారు. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయాలన్నారు. విద్యార్థులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పరీక్ష కేంద్రాల్లో ఏర్పాటు చేశామన్నారు. విద్యుత్ సరఫరా, తాగునీరు, ప్రాథమిక వైద్య సేవలు అందుబాటులో ఉంచామన్నారు.

March 14, 2026 / 07:55 AM IST

అర్హులందరికీ దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లు: రూపేష్ రెడ్డి

ADB: అర్హులందరికీ దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లు కేటాయించటం జరుగుతుందని యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సామ రుపేష్ రెడ్డి అన్నారు. శుక్రవారం సాత్నాల మండలంలోని దుబ్బగూడ గ్రామంలో స్థానిక కాంగ్రెస్ నాయకులతో పర్యటించి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు రాజు, మోకశి, యువకులు తదితరులున్నారు.

March 14, 2026 / 07:54 AM IST

జనాభా లెక్కల సేకరణ దేశ అభివృద్ధికి దిక్సూచి: కలెక్టర్

WGL: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జనగణన-2027పై అధికారులకు మూడు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ డా. సత్య శారద శుక్రవారం ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జనాభా లెక్కల సేకరణ ప్రభుత్వ పథకాల అమలుకు, దేశాభివృద్ధికి దిక్సూచి వంటిదని పేర్కొన్నారు. దేశంలో తొలిసారిగా డిజిటల్ విధానంలో జరుగుతున్న ఈ ప్రక్రియలో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు.

March 14, 2026 / 07:51 AM IST

పరీక్షలకు భయం వద్దు: AISF

WNP: పదవ తరగతి పరీక్షలను విద్యార్థులు ధైర్యంగా ఎదుర్కోవాలని AISF జిల్లా అధ్యక్షుడు నరేశ్ నిన్న పిలుపునిచ్చారు. జిల్లాలోని 221 పాఠశాలలకు చెందిన 7,212 మంది విద్యార్థులు (3,635 మంది బాలికలు, 3,577 మంది బాలురు) 37 కేంద్రాల్లో పరీక్షలు రాస్తున్నారని తెలిపారు. కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులను కోరుతూ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.

March 14, 2026 / 07:51 AM IST

‘ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం’

BHNG: ప్రజా సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. శుక్రవారం యాదగిరిగుట్ట మండలం చోల్లేరు, వంగపల్లి గ్రామాలలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు కల్పించాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు.

March 14, 2026 / 07:51 AM IST

ముగిసిన వార్డు సభ్యుల శిక్షణ కార్యక్రమం

MDK: తూప్రాన్ మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన వార్డు సభ్యుల శిక్షణ కార్యక్రమం ముగిసినట్లు ఎంపీడీవో సతీష్ తెలిపారు. మండలంలోని 14 పంచాయతీలకు చెందిన 114 వార్డు సభ్యులు శిక్షణకు హాజరైనట్లు వివరించారు. తూప్రాన్ ఆర్డిఓ జయచంద్రారెడ్డి ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై శిక్షణ సర్టిఫికెట్లను ప్రధానం చేసినట్లు వివరించారు.

March 14, 2026 / 07:49 AM IST

ఇసుక ర్యాంపులో నిబంధనల ఉల్లంఘన: గిరిజన సంఘం

MLG: మంగపేట మండలం రమణక్కపేట ఇసుక ర్యాంపులో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పనులు జరుగుతున్నాయని ఆదివాసీ గిరిజన సంఘం ఆరోపించింది. భారీ యంత్రాలతో ఇసుక తవ్వుతూ స్థానిక ఆదివాసీలకు పనులు ఇవ్వడం లేదని సంఘం జిల్లా కార్యదర్శి గొంది రాజేశ్ నేడు తెలిపారు. రాత్రివేళల్లో అక్రమ ఇసుక రవాణా జరుగుతోందని ఆరోపిస్తూ విచారణ చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

March 14, 2026 / 07:49 AM IST

రైలు ఢీకొని గుర్తు తెలియని మహిళ మృతి

NLR: కొడవలూరు తలమంచి రైల్వే స్టేషన్ మధ్య దిగువ లైన్‌లో గుర్తు తెలియని మహిళ రైలు కిందపడి మరణించింది. సదరు మహిళ కుడి చేతిపై ముగ్గు ఆకారంలో పచ్చబొట్టు ఉంది. సదరు మహిళ కాఫీ కలర్ అంచు కలిగిన లైట్ పింక్ కలర్ చీర, పచ్చ రంగు జాకెట్ ధరించి ఉంది. ఈ మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

March 14, 2026 / 07:49 AM IST

అనసూయను వేధించిన వ్యక్తి అరెస్ట్

HYD: యాంకర్ అనసూయను సోషల్ మీడియాలో వేధించిన వ్యక్తిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె ఫోటోలను మార్ఫింగ్ చేసి, యూట్యూబ్, ట్విట్టర్‌లో అసభ్యకరంగా ప్రచారం చేసినట్లు నిందితుడిపై ఆరోపణలు ఉన్నాయి. ఐటీ యాక్ట్, BNS కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. IP అడ్రస్ ద్వారా అతడిని గుర్తించినట్లు తెలిపారు. ఈ కేసులో మొత్తం 73 మందిని పోలీసులు గుర్తించడం గమనార్హం.

March 14, 2026 / 07:48 AM IST

భారత్‌లో మహిళా క్రికెటర్లు పెరిగారు!

మన దేశంలో క్రికెట్ ఆడే అమ్మాయిల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఓ సర్వే ప్రకారం.. 2020లో 15-24 ఏళ్ల అమ్మాయిల్లో 6% మంది క్రికెట్ అడితే.. ఇప్పుడు అది 16%కి చేరింది. WPL, 2025 వరల్డ్ కప్, ఆస్ట్రేలియా వంటి పెద్ద జట్లపై సిరీస్ విజయాల స్ఫూర్తితో ప్రతి నలుగురిలో ఒకరు క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకుంటున్నారు. భద్రతా కారణాలతో 13% మంది అన్ని క్రీడలకు దూరంగా ఉండటం గమనార్హం.

March 14, 2026 / 07:47 AM IST

ఈ నెల 16 నుంచి ఒంటిపూట బడులు

KRNL: జిల్లాలో ఈ నెల 16 నుంచి ఏప్రిల్ 23 వరకు ఒంటిపూట బడులు నిర్వహించనున్నట్లు డీఈవో సుధాకర్ తెలిపారు. ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు తరగతులు నిర్వహించాలని సూచించారు. మధ్యాహ్న భోజనం తర్వాతే విద్యార్థులను ఇంటికి పంపాలని చెప్పారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

March 14, 2026 / 07:46 AM IST

కమ్ముకున్న పొగ మంచు

SRPT: మునగాల మండల వ్యాప్తంగా శనివారం తెల్లవారుజాము నుంచి దట్టమైన పొగ మంచు కురుస్తూ ఉండడంతో రోడ్లు కనిపించక వాహనదారుల రాకపోకలకు ఇబ్బందులకు గురయ్యారు. అలాగే, తెల్లవారుజామున పొలాలకు వెళ్లే రైతులు, ట్యూషన్స్‌కు వెళ్లే విద్యార్థిని, విద్యార్థులు, ప్రయాణికులు రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడింది.

March 14, 2026 / 07:45 AM IST

డ్రైవింగ్ లైసెన్స్‌తో మహిళ ఆదర్శం

NDL: డోన్ మండలం కొచ్చెరువుకు చెందిన మిద్దె కళావతి ఆర్టీవో కార్యాలయంలో ద్విచక్రవాహనం నడపడానికి డ్రైవింగ్ లైసెన్స్ శుక్రవారం పొందారు. చదువు లేకపోయినా ఇళ్లలో పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న ఆమె రహదారి భద్రతను గౌరవిస్తూ లైసెన్స్ పొందడం ద్వారా అందరికీ ఆదర్శంగా నిలిచారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఆర్టీఓ క్రాంత కుమార్ పేర్కొన్నారు.

March 14, 2026 / 07:42 AM IST