వనపర్తి పట్టణంలో త్రాగునీటి ఎద్దడి రాకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు మున్సిపల్ ఛైర్‌పర్సన్ మిడిదొడ్డి మాధవి తెలిపారు. శనివారం 33వ వార్డులో కొత్తగా ఏర్పాటు చేసిన బోరును కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆమె ప్రారంభించారు. ఎమ్మెల్యే మేఘారెడ్డి సహకారంతో పట్టణ ప్రజల దాహార్తిని తీరుస్తామని హామీ ఇచ్చారు.
హైదరాబాద్ బాక్సాఫీస్ వద్ద ‘ధురంధర్ 2’ సృష్టిస్తున్న హంగామా మామూలుగా లేదు. మార్చి 19న విడుదల కానున్న ఈ బాలీవుడ్ చిత్రం, టాలీవుడ్ టాప్ స్టార్ సినిమాల రేంజ్‌లో అడ్వాన్స్ బుకింగ్స్‌తో దూసుకుపోతోంది. బుక్‌మైషోలో టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతుండటంతో అప్పుడే పలు థియేటర్లు హౌస్‌ఫుల్ అయ్యాయి. ఈ అన్-స్టాపబుల్ క్రేజ్ చూసి ట్రేడ్ వర్గాలు సైతం షాక్ అవుతున్నాయి.
MLG: వెంకటాపూర్ మండలం లక్ష్మీదేవిపేటలో ఇవాళ అటవీ శాఖ ఆధ్వర్యంలో అడవి అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా సర్పంచ్ వంశావతి-రమేష్ హాజరై, మాట్లాడుతూ.. “అడవిలో నిప్పు.. పర్యావరణానికి ముప్పు.. అడవి సంరక్షణ సమస్త జీవకోటి పరిరక్షణ” అనే నినాదంతో ఈ కార్యక్రమం జరుగుతోందని తెలిపారు. అటవీ శాఖ అధికారులు, వార్డు మెంబర్లు ఉన్నారు.
MHBD: తొర్రూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని పదో తరగతి పబ్లిక్ పరీక్ష కేంద్రాన్ని శనివారం MRO శ్రీనివాస్ స్వయంగా సందర్శించారు. ఈ సందర్భంగా MRO పరీక్షల నిర్వహణ తీరు, ఇన్విజిలేషన్ విధానం, విద్యార్థులకు కల్పించిన సౌకర్యాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. విద్యార్థులు ఏ రకమైన ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా పరీక్షలు రాసేలా చూడాలని తాహసీల్దార్ అధికారులకు సూచించారు.
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బియ్యం జపాన్‌కు చెందిన ‘కిన్మెమై ప్రీమియం’. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బియ్యంగా గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించింది. దీని కిలో ధర సుమారు రూ. 12,500 నుంచి రూ. 15,000 వరకు ఉంటుంది. 5 రకాల మేలైన వంగడాలను కలిపి దీనిని తయారు చేస్తారు. ఈ బియ్యాన్ని కడగాల్సిన అవసరం లేదు. సాధారణ బియ్యం కంటే ఇది 6 రెట్లు ఎక్కువ రోగనిరోధక శక్తిని ఇస్తుంది.
TPT: సత్యవేడు నియోజకవర్గం వరదయ్యపాల్యం మండలంలో జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు జెండా ఆవిష్కరణ చేసి కేక్ కట్ చేశారు. అనంతరం AIM FOR SEVA ఆశ్రమంలో 50 కిలోల బియ్యం, నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా కార్యదర్శి తడ శ్రీనివాసులు సహా పలు పార్టీ నాయకులు పాల్గొన్నారు.
AP: గ్యాస్ సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. కేంద్రం పరిస్థితిని పర్యవేక్షిస్తోందన్నారు. కుటుంబ అవసరాలకు ఏ మాత్రం లోటురాకుండా చేయడమే ప్రభుత్వ తొలి ప్రాధాన్యత అని స్పష్టంచేశారు. గ్యాస్‌పై ప్రజల ఆందోళనను ఆసరాగా తీసుకుని బ్లాక్ మార్కెటింగ్‌కి ఎవరైనా పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
SKLM: మందస M బాలిగాం జంక్షన్‌లో రూ.11 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డుకు శంకుస్థాపన కార్యక్రమం శనివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే శిరీష హాజరై శంకుస్థాపన చేశారు. ఆమె మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. అధికారులు స్థానిక నాయకులు పాల్గొన్నారు.
చిత్తూరు నగరంలోని కట్టమంచి వద్ద సుజుకి షోరూంను ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ ప్రారంభించారు. అనంతరం సంస్థ యజమానులను అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు. సుజుకి వాహనాలను సరదాగా డ్రైవ్ చేశారు. ఈ కార్యక్రమంలో నగర ప్రజాప్రతినిధులు, కూటమి పార్టీ నాయకులు పాల్గొన్నారు.
KMM: ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డికి అంతర్జాతీయ పార్లమెంటరీ స్థాయిలో కీలక బాధ్యత దక్కింది. భారత్-స్విట్జర్లాండ్ పార్లమెంటరీ ఫ్రెండ్‌షిప్ గ్రూప్ సభ్యుడిగా ఎంపీని లోక్‌సభ స్పీకర్ నామినేట్ చేశారు. ప్రస్తుత 18వ లోక్‌సభ కాలానికి సంబంధించి భారత్-స్విట్జర్లాండ్ దేశాల మధ్య పార్లమెంటరీ స్నేహ సంబంధాలను బలోపేతం చేసే లక్ష్యంతో ఈ ఫ్రెండ్‌షిప్ గ్రూప్‌ను ఏర్పాటు చేశారు.
JN: ఉప్పుగల్ గ్రామంలో ఆంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి భూమిపూజ చేశారు. ఆంజనేయ స్వామి ఆశీస్సులతో గ్రామ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో జీవించాలని ప్రార్థించారు. ఉప్పుగల్ గ్రామ ప్రజల ఆశీర్వాదంతో 30ఏళ్లుగా రాజకీయాలలో కొనసాగుతున్నానని, ఆలయ నిర్మాణానికి తన వంతు సహాయంగా లక్ష రూపాయలు విరాళంగా ప్రకటించారు.
HNK: కాకతీయ యూనివర్సిటీలో శనివారం పూర్వ హిందూ వాహిని రాష్ట్ర కార్యదర్శి, గోపా జిల్లా సహాయ కార్యదర్శి మార్క సునీల్ గౌడ్ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పాటను విడుదల చేశారు. కేయూ పాలక మండలి సభ్యులు డాక్టర్ చిర్ర రాజు గౌడ్ ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. బహుజన హిందూ వికాస్ పరిషత్ సభ్యులు రఘురాం నాయక్, అనురామ్ చౌదరి ఉన్నారు.
మెగా హీరో అల్లు శిరీష్ తన పెళ్లిలో ‘చోకర్’ ధరించడంపై వస్తున్న విమర్శలకు గట్టి సమాధానమిచ్చాడు. నగలు ధరించడం మన భారతీయ సంస్కృతిలో భాగమేనని, మహారాజులు కూడా భారీ హారాలు వేసుకునేవారని గుర్తుచేశాడు. ‘2026లో ఉన్నాం, నా స్టైల్ ఏంటో నాకు తెలుసు. ఇతరుల మాటలు వినాల్సిన అవసరం లేదు’ అంటూ తన వ్యక్తిత్వాన్ని చాటుకున్నాడు.
WGL: ఉమ్మడి వరంగల్ జిల్లాలో గ్రామ పంచాయతీ కార్యదర్శులు ప్రస్తుతం తీవ్ర పని భారంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నెలాఖరులోగా పన్నుల వసూళ్లు 100 శాతం పూర్తి చేయాలనే ఆదేశాలు ఒకవైపు ఉండగా, ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమాల అమలు మరోవైపు భారంగా మారింది. పని భారం పెరిగి పన్నుల వసూళ్లు చేయడం కష్టమవుతోందని కార్యదర్శులు వాపోతున్నారు.
VKB: దౌల్తాబాద్ మండల నూతన ఎస్సైగా వేణు కుమార్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు పనిచేసిన ఎస్సై బంగారు రాజు వికారాబాద్ వీఆర్‌కు బదిలీ అయ్యారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఎస్సై మాట్లాడుతూ.. మండలంలో నేరాల నియంత్రణకు, ప్రజల భద్రతకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. నూతన ఎస్సైకి సిబ్బంది స్వాగతం పలికారు.