KMM: మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కుమారుడు హరిహరన్ సాయి వెడ్స్ దీక్షతో శనివారం నిశ్చితార్థం జరగనుంది. ఈ సందర్భంగా ఎంపీ వద్దిరాజు రవిచంద్రను హైదరాబాద్ బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని నివాసంలో ఎమ్మెల్యే గంగుల తన అన్న సుధాకర్‌తో కలిసి వచ్చి శాలువాతో సత్కరించి ఆహ్వాన పత్రికను అందజేశారు.
NRML: రాష్ట్రంలో గ్యాస్ సిలిండర్ల కొరత లేదని, ప్రజలకు సరిపడా నిల్వలు అందుబాటులో ఉన్నాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సాగునీటి సరఫరాపై కూడా సమీక్షించారు. ప్రజలు వదంతులు నమ్మవద్దని, రైతులకు అవసరమైన సాగునీరు అందుబాటులో ఉందని కలెక్టర్ అభిలాష అభినవ్ ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు.
TG: యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాదం నెలకొంది. మోత్కూరులో పదో తరగతి విద్యార్థి తండ్రి చనిపోయాడు. కానీ పది పరీక్షల దృష్ట్యా తండ్రి మరణాన్ని దిగమింగి పదోతరగతి వార్షిక పరీక్షలకు విద్యార్థి హర్షవర్దన్ హాజరయ్యాడు.
E.G: మండపేట మండలం కేశవరంకు చెందిన వైసీపీ నాయకులు దూలం వెంకన్న బాబును రాజమండ్రి రూరల్ నియోజకవర్గ వైసీపీ పరిశీలకులుగా ఆ పార్టీ నియమించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు శనివారం వైసీపీ పార్టీ విడుదల చేసింది. తనకిచ్చిన బాధ్యతను సక్రమంగా నిర్వహించి పార్టీ గెలుపులో భాగస్వామి అవుతానని వెంకన్న బాబు స్పష్టం చేశారు.
E.G: మండపేట మండలం కేశవరంకు చెందిన వైసీపీ నాయకులు దూలం వెంకన్న బాబును రాజమండ్రి రూరల్ నియోజకవర్గ వైసీపీ పరిశీలకులుగా ఆ పార్టీ నియమించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు శనివారం వైసీపీ పార్టీ విడుదల చేసింది. తనకిచ్చిన బాధ్యతను సక్రమంగా నిర్వహించి పార్టీ గెలుపులో భాగస్వామి అవుతానని వెంకన్న బాబు స్పష్టం చేశారు.
KRNL: కర్నూలు సమీపంలోని గార్గేయపురంలో శనివారం ఒక విషాదకర సంఘటన చోటుచేసుకుంది. తల్లి రాజేశ్వరి(35) తన ఇద్దరు కుమారులైన అబ్రహం (3)సుకుమార్ (6)లతో కలిసి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. భార్యభర్తల మధ్య కలహాలతోనే బలవన్మరణానికి పాల్పడి ఉంటుందని అనుమానిస్తున్నారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు, తెలియాల్సి ఉంది.
GDWL: రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి గద్వాల పర్యటన నేపథ్యంలో జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కుమారుడి వివాహ వేడుకకు సీఎం హాజరుకానుండటంతో ఎస్పీ టి. శ్రీనివాసరావు శనివారం భద్రతా ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. పట్టణంలో ట్రాఫిక్ మళ్లింపులు, వీఐపీ సెక్యూరిటీపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
WNP: గోపాల్ పేట ఎస్సీ హాస్టల్‌లో టెన్త్ చదువుతున్న ఏదుట్ల గ్రామానికి చెందిన భూత భరత్ పరీక్షలపై ఆసక్తి లేక హైదరాబాద్ వెళ్లిపోయాడు. శనివారం సమాచారం అందుకున్న ఎస్సై జగన్మోహన్, టీచర్ ధర్మరాజు విద్యార్థి ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులతో మాట్లాడారు. భరత్‌ను తిరిగి రప్పించి పరీక్షలు రాయించేందుకు అధికారులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు.
TG: యుద్ధం వల్ల అనేక దేశాల్లో గ్యాస్ ధరలు పెరిగాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు తెలిపారు. మన దేశంలో మాత్రం గ్యాస్ ధరలు పెరగలేదని చెప్పారు. సామాన్యుడికి ఇబ్బందులు లేకుండా మోదీ ప్రభుత్వం గ్యాస్ ధరలను నియంత్రణలో పెట్టిందన్నారు. కొంతమంది దళారులు గ్యాస్ కొరతను కావాలనే సృష్టిస్తున్నారని విమర్శించారు.
NRPT: మార్చి 27న భద్రాచలంలో జరిగే శ్రీ సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని మంత్రి వాకిటి శ్రీహరి దంపతులను దేవస్థాన అధికారులు ఆహ్వానించారు. శనివారం హైదరాబాద్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో మంత్రిని కలిసిన ఆలయ ఈవో, అర్చకులు ఆహ్వాన పత్రికను అందజేసి, వేడుకల్లో పాల్గొని సాంప్రదాయ రీతులను అనుసరించాలని సూచించారు.
KKD: శంఖవరం మండలంలో పెద్దపులి సంచారం కలకలం రేకెత్తిస్తోంది. గత 15 రోజులుగా పోలవరం, కాకినాడ జిల్లాల పరిధిలో పలు ప్రాంతాల్లో తిరిగిన పులి రాత్రంతా స్థిరంగా ఒకే ప్రాంతంలో ఉండడంతో అధికారులు అప్రమత్తమై ప్రత్యేక నిఘా పెట్టారు. పులి సంచరిస్తున్న ప్రాంతాల రహదారులు తాత్కాలికంగా మూసివేసి భద్రతా చర్యలు కట్టుదిట్టం చేశారు. పులి పట్టుబడే వరకు ప్రజలు సహకరించాలన్నారు.
TG: డిండి ఎత్తిపోతల పథకంపై నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల మధ్య వివాదం చెలరేగింది. డిండి ప్రాజెక్టు నీటి సేకరణపై నల్గొండ రైతుల్లో ఆందోళన నెలకొంది. పాలమూరు ప్రాజెక్టును 436 మీటర్ల ఎత్తునుంచే నీరు తరలించాలని ప్రభుత్వం భావించింది. ఈ డిజైన్ అమలు చేస్తే 8 టీఎంసీలకే డిండి ప్రాజెక్టు పరిమితం కానుంది. దీంతో దిద్దుబాటు చర్యలకు రేవంత్ సర్కార్ ఉపక్రమించింది.
U వీసా అనేది అమెరికా ప్రభుత్వం జారీ చేసే ఒక ప్రత్యేకమైన నాన్-ఇమ్మిగ్రెంట్ వీసా. అక్కడ గృహ హింస లేదా తీవ్ర నేరాలకు గురైన బాధితుల రక్షణ కోసం ఈ వీసాను రూపొందించారు. ముఖ్యంగా వీసా లేని వారు లేదా వేరే వీసా మీద ఉన్నవారు పోలీసుల దగ్గరకు వెళ్తే తమని దేశం నుంచి పంపించేస్తారేమో అని భయపడతారు. ఆ భయం పోగొట్టి, నేరస్తులకు శిక్ష పడేలా చేయడమే ఈ U వీసా లక్ష్యం.
SKLM: సారవకోట మండల కేంద్రంలోని విద్యుత్ శాఖ కార్యాలయ భవనం శిథిలావస్థకు చేరుకుంది. రెండు దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ భవనం పైకప్పు పీల్చుబడిపోయింది. సిబ్బంది భయాందోళన చెందుతున్నారు. వర్షాలు కురిసినప్పుడు శ్లాబ్ నుంచి నీరు కారి కార్యాలయంలోని ముఖ్యమైన ఫైల్స్, కంప్యూటర్లు తడిసిపోతున్నాయి. భవన మరమ్మతులకు చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు కోరుతున్నారు.
BHPL: రంజాన్ మాసం సందర్భంగా గోరికొత్తపల్లి మండల కేంద్రంలోని మదీనా మసీదులో ఇవాళ సాయంత్రం 6 గంటలకు మండల సీనియర్ నాయకులు, మాజీ సర్పంచ్ సుధనబోయిన ఓం ప్రకాష్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు నిర్వహించనున్నారు. ఈ విందుకు ముఖ్యఅతిథిగా MLA గండ్ర సత్యనారాయణ రావు హాజరుకానున్నట్లు ఓం ప్రకాష్ తెలిపారు. ముస్లిం సోదరులు, మండల నాయకులు అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు.