HYD: ఎండకాలం ప్రారంభంలోనే చికెన్ ధరలు కొండెక్కాయి. శనివారం KG చికెన్ రూ. 325 నుంచి 330 వరకు పలకడం గమనార్హం. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కిలో స్కిన్‌తో కూడిన చికెన్ ధర రూ. 286గా ఉండగా, స్కిన్‌లెస్ చికెన్ ధర రూ. 325కు చేరుకుంది. వేసవి మొదలులో ఇలా ఉంటే ఏప్రిల్, మే నెలల్లో ధరలు ఇంకెంత పెరుగుతాయోనని చికెన్ ప్రియులు సందేహ పడుతున్నారు.
ADB: గుడిహత్నూర్ మండలంలోని కోలహరి గ్రామంలో బోథ్ MLA అనిల్ జాదవ్ శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలోని సీసీ రోడ్డు, వాకింగ్ ట్రాక్ వంటి పలు అభివృద్ధి పనులకు స్థానిక నాయకులతో కలిసి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు తనవంతుల కృషి చేస్తానని అనిల్ జాదవ్ పేర్కొన్నారు.
తూ.గో జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్ ఆదేశాల మేరకు అసాంఘిక శక్తులను, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు అడ్డుకట్టు వేయాలనే లక్ష్యంగా ప్రత్యేక నిఘా కొనసాగుతుంది. బహిరంగంగా మద్యం, గంజాయి సేవించడం, పేకాట, చైన్ స్నాచింగ్, జూదం తదితర నేరాలపై ప్రతిరోజు రాత్రి డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేరకు నేరాలు నియంత్రిస్తున్నామని పోలీసు అధికారులు ప్రకటించారు.
ATP: గుంతకల్లు టీడీపీ కార్యాలయంలో కౌన్సిలర్లు, సర్పంచ్‌లతో ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రానున్న స్థానిక సంస్థ ఎన్నికలలో కూటమి పార్టీ నుంచి నిలబడిన ప్రతి అభ్యర్థి అఖండ మెజార్టీతో గెలిచి సీఎం చంద్రబాబుకు గిఫ్ట్ ఇవ్వాలని సూచించారు. అనంతరం కౌన్సిలర్లు, సర్పంచ్‌లు ఎమ్మెల్యేను సన్మానించారు.
కోనసీమ: ముమ్మిడివరంలో ఇళ్లు కోల్పోయిన అగ్నిప్రమాద బాధితులను MLA దాట్ల సుబ్బరాజు శనివారం పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బాధిత కుటుంబాలకు తక్షణ సాయంగా రూ.5,000 నగదుతో పాటు నిత్యావసరాలు అందజేశారు. బాధితులకు త్వరగా పునరావాసం కల్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం నుంచి పూర్తి సహాయం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు.
చేతులు శుభ్రంగా కడిగితే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. భోజనానికి ముందు చేతులను సబ్బుతో కనీసం 20 సెకన్ల పాటు శుభ్రంగా కడుక్కోవాలి. నిత్యం తాకే కీబోర్డు, మౌస్, డోర్ హ్యాండిల్స్ వంటి వస్తువులపై కంటికి కనిపించని ఎన్నో బ్యాక్టీరియాలు ఉంటాయి. కేవలం చేతులు కడగడం అనే చిన్న అలవాటు ద్వారా మనం 50% వరకు అంటువ్యాధులను సమర్థవంతంగా అడ్డుకోవచ్చు.
TG: ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమా తరహా ఘటన నిజామాబాద్ జిల్లా పోచారంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తికి నిశ్చితార్థం అనంతరం తనకు HIV నిర్ధారణ కావడంతో యువతి పెళ్లికి నిరాకరించింది. దీంతో ఆగ్రహించిన పెళ్లి కుమారుడు యువతికి ఇంట్లోకి వెళ్లి బలవంతంగా తన HIV రక్తం ఎక్కించాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
కృష్ణా: పేదల కష్టాన్ని చూసి చలించే నేత పవన్ కళ్యాణ్ అని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. ఇవాళ అవనిగడ్డ కోర్టు సెంటర్‌లో జనసేన జిల్లా అధికార ప్రతినిధి రాయపూడి వేణుగోపాల్, ఏఎంసీ వైస్ ఛైర్మన్ రాజనాల వీరబాబు పార్టీ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. ఎమ్మెల్యే జనసేన పార్టీ జెండా ఆవిష్కరించి, చలివేంద్రాన్ని ప్రారంభించి కేక్ కట్ చేశారు.
ATP: గుంతకల్లులోని మోదీనాబాద్‌లో వెలిసిన శ్రీ కోదండరామస్వామి దేవాలయంలో శనివారం శివుడు, నంది విగ్రహాల విగ్రహ ప్రతిష్ట పూజా కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది. ఆలయంలో స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. ఈ పూజా కార్యక్రమానికి వైసీపీ జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతి రెడ్డి హాజరయ్యారు.
WNP: తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం 4వ రాష్ట్ర మహాసభల సన్నాహక సమావేశానికి జిల్లా నాయకులు శనివారం మహబూబ్ నగర్ తరలివెళ్లారు. అంబేద్కర్ కళాభవన్‌లో జరిగే ఈ సభలో జిల్లా అధ్యక్షుడు ఎస్.అజయ్, సీపీఎం నేతలు మహమూద్, గోపి, కౌన్సిలర్ మాధవి రాజేందర్ తదితరులు పాల్గొని మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
SKLM: ఎచ్చెర్ల మండలం కొయ్యాం గ్రామంలో వైసీపీ నాయకులు మజ్జి కోటేశ్వరరావు సతీమణి అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ శనివారం ఆమెను పరామర్శించారు. ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆయనతో పాటు జిల్లా ప్రధాన కార్యదర్శి సనపల నారాయణరావు, తదితరులు ఉన్నారు.
NZB: కమ్మర్ పల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం 10వ తరగతి పరీక్షలు జరుగుతున్న పరీక్షా కేంద్రాలను ఎంపీడీవో చింతరాజ శ్రీనివాస్ సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని పాఠశాల పరీక్షల పర్యవేక్షణ అధికారితో పాటు పోలీసు అధికారులకు సూచించారు.
NLR: యుద్ధ ప్రభావం సామాన్య కుటుంబాలపై చూపుతోంది. ప్రజలకు వంట నూనె ధరలు రోజురోజుకు కలవరపెడుతున్నాయి. పామాయిల్, సన్ ఫ్లవర్ నూనెలు కిలోకు రూ. 10 నుంచి 15 రూపాయల మేర పెరిగాయి. జిల్లాలో రోజుకు సుమారు 4 లక్షల లీటర్లకుపైగా వంట నూనెల వినియోగం జరుగుతోంది. దేశంలో వంట నూనెలు 60 శాతం దిగుమతులపైనే ఆధారపడటంతో ఈ పరిస్థితి నెలకొన్నట్లు వ్యాపారులు చెబుతున్నారు.
TG: హైదరాబాద్‌లో దారుణం జరిగింది. బోరబండలో తన ఐదేళ్ల కుమారుడు, రెండేళ్ల కుమార్తె గొంతు నులిమి అనంతరం తల్లి సత్యవాణి ఆత్మహత్య చేసుకుంది. కుమారుడు అక్కడికక్కడే మృతి చెందగా.. కుమార్తె పరిస్థితి విషమంగా ఉంది. దీంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు.
అన్నమయ్య: జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను అత్యంత పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం పటిష్ట చర్యలు చేపట్టిందని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి శనివారం తెలిపారు. ప్రతి పరీక్షకేంద్రం వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశామన్నారు. పరిసరాల్లో ప్రజలు గుమిగూడకుండా 144సెక్షన్ కఠినంగా అమలు చేసినట్లు తెలిపారు.