• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

PM విశ్వకర్మ ట్రేడ్ ఫెయిర్ ప్రారంభం

అన్నమయ్య: మదనపల్లి శివాజీ నగర్‌లోని పద్మావతి కళ్యాణమండపంలో నిర్వహిస్తున్న PM విశ్వకర్మ ట్రేడ్ ఫెయిర్ – కమ్ – ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని జిల్లా రెవెన్యూ అధికారి, ఇంఛార్జ్ జాయింట్ కలెక్టర్ మధుసూదనరావు ప్రారంభించారు. మూడు రోజుల పాటు జరిగే ఈ ప్రదర్శనలో సంప్రదాయ వృత్తుల కళాకారులు తమ హస్తకళా ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నారు.

March 13, 2026 / 06:12 PM IST

గ్యాస్‌ సరఫరాపై నిరంతర నిఘా: కలెక్టర్‌

SRPT: జిల్లాలో గ్యాస్‌ సిలిండర్ల సరఫరాను మానిటరింగ్‌ కమిటీ ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నామని కలెక్టర్‌ తేజస్‌ తెలిపారు. శుక్రవారం మంత్రులు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, తుమ్మల నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. డొమెస్టిక్‌ సిలిండర్లు పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకుంటున్నామని, నిబంధనలు ఉల్లంఘించే ఏజెన్సీలపై కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు.

March 13, 2026 / 06:09 PM IST

పది విద్యార్థులకు శుభాకాంక్షలు చెప్పిన సీఎం

TG: రాష్ట్రవ్యాప్తంగా రేపు 10వ తరగతి పరీక్షలకు హాజరుకాబోతున్న లక్షలాది మంది విద్యార్థులకు సీఎం రేవంత్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. భవిష్యత్తుకు తొలిమెట్టుగా ఈ పరీక్షలను ప్రతి విద్యార్థి ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవాలని కోరారు. భయం, ఆందోళన, ఒత్తిడి లేకుండా ప్రశాంతమైన మనసుతో పరీక్షలు రాస్తే తప్పకుండా మంచి ఫలితాలు సాధించవచ్చని విద్యార్థులకు పిలుపునిచ్చారు.

March 13, 2026 / 06:07 PM IST

ఆర్ఎంపీపై దాడి చేసి చైన్ స్నాచింగ్‌.. ఐదుగురు అరెస్ట్

KNR: అప్పులు తీర్చేందుకు ఆర్ఎంపీ వైద్యుడి కళ్లలో కారం కొట్టి, గొలుసు దోచుకున్న ఐదుగురు యువకులను కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి కారు, తులం బంగారం, నగదు స్వాధీనం చేసుకున్నారు. జల్సాలకు అలవాటు పడి ఈ దారి దోపిడీకి పాల్పడినట్లు ఏసీబీ విజయ్ కుమార్ తెలిపారు. ఈ మేరకు నిందితులను పట్టుకున్న సిబ్బందిని సీపీ అభినందించారు.

March 13, 2026 / 06:07 PM IST

అవార్డులు అందుకున్న జిల్లా రైతులు

SDPT: కేంద్ర పట్టు పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లాలోని బోదాన్ పోచంపల్లిలో జరిగిన పట్టు కృషి మేళాలో సిద్దిపేట జిల్లాలోని ఉత్తమ పట్టు రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారికి అవార్డులను అందజేసి శాలువాలతో సన్మానించారు. ఉత్తమ రైతులుగా శ్రీనివాస్, నర్సింలు, రాజు, నారాయణరెడ్డి జిల్లా స్థాయి అవార్డులు అందుకున్నారు.

March 13, 2026 / 06:05 PM IST

తహసీల్దార్ కుటుంబానికి పరామర్శ

ADB: నేరడిగొండ మండలంలోని కుంటాల(కే) గ్రామానికి చెందిన సత్నాల తహసీల్దార్ రామరావు తండ్రి నెమ్య నాయక్ ఇటీవల మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ ఆడే గజేందర్ శుక్రవారం వారి నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి మృతికి గల కారణాలు అడిగి తెలుసుకుని, తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

March 13, 2026 / 06:04 PM IST

అంతర్జాతీయ మహిళా దినోత్సవ అవార్డు అందుకున్న అనిత

JGL: జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ కవయిత్రి, ఉపాధ్యాయురాలు అయిత అనితకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ పురస్కారం అందుకున్నారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్‌లో జరిగిన కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి కే రాజ్ కుమార్ అవార్డు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథితులుగా అదనపు కలెక్టర్ బి.ఎస్. లత, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ హాజరయ్యారు.

March 13, 2026 / 06:03 PM IST

సకాలంలో జీతాలు రాక.. ‘108’ సిబ్బంది విలవిల

MBNR: అత్యవసర వైద్య సేవలు అందించే 108 సిబ్బందికి నెలల తరబడి జీతాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పనిచేస్తున్న ఉద్యోగులు ఇంటి అద్దెలు, EMIలు, స్కూల్ ఫీజులు కట్టలేక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని, ప్రతి నెలా సకాలంలో వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాలని సిబ్బంది కోరుతున్నారు.

March 13, 2026 / 06:02 PM IST

మహాధర్నా వాల్ పోస్టర్ విడుదల

GDWL: దేశవ్యాప్తంగా ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తున్న నాలుగు లేబర్ కోడ్స్ దేశ కార్మిక వర్గానికి మరణ శాసనాలు అని ఐఎఫ్టీయూ గద్వాల జిల్లా కార్యదర్శి జమ్మిచెడు కార్తీక్ అన్నారు. ఈ చట్టాలకు వ్యతిరేకంగా మార్చి 16న జిల్లా కలెక్టరేట్ల వద్ద నిర్వహించనున్న మహాధర్నా గోడ పత్రికలను శుక్రవారం గద్వాలలో పార్టీ కార్యాలయంలో విడుదల చేశారు. కార్యక్రమంలో పలువురు ఐఎఫ్టీయూ నేతలు పాల్గొన్నారు.

March 13, 2026 / 06:02 PM IST

ప్రమాద బీమా చెక్కు అందజేత

MNCL: లక్షెట్టిపేట మండలంలోని హనుమంతపల్లికి చెందిన మారం సత్తయ్య కుటుంబ సభ్యులకు ఎస్బీఐ బ్యాంక్, జనరల్ ఇన్సూరెన్స్ అధికారులు రూ. 20 లక్షల ప్రమాద బీమా చెక్కును అందజేశారు. సత్తయ్యకు ఇటీవల విద్యుత్ షాక్‌తో కాలు, చెయ్యి దెబ్బతిన్నాయి. సత్తయ్య ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్‌లో ప్రమాద బీమా తీసుకోవడంతో సత్తయ్య కుటుంబ సభ్యులకు బ్యాంక్ అధికారులు చెక్కును అందజేశారు.

March 13, 2026 / 06:01 PM IST

‘వేధింపులు గురైతే షీ టీమ్‌కు కాల్ చేయండి’

GDWL: మహిళలు వేధింపులకు గురైతే సంకోచించకుండా షీ టీమ్‌ను సంప్రదించాలని జిల్లా షీ టీమ్ సభ్యురాలు లోకేశ్వరీ పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు  గోనుపాడు పాలిటెక్నిక్ కళాశాలలో శుక్రవారం షీ టీమ్ ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఫిర్యాదుల కోసం 8712670312 నంబర్‌కు కాల్ చేయాలని సూచించారు.

March 13, 2026 / 06:01 PM IST

అంగన్వాడీ చిన్నారులకు దుస్తుల పంపిణీ

SDPT: దుబ్బాకలోని ఆర్య వైశ్య భవన్‌లో నిర్వహించిన అంగన్వాడీ ‘బాల మేళా’లో కాంగ్రెస్ నాయకులు సందడి చేశారు. 19వ వార్డు ఇంఛార్జ్ సిరిసిల్ల సంధ్య నరేష్, మల్లుగారి రామచంద్రారెడ్డి పాల్గొని చిన్నారులకు డ్రెస్ కోడ్ దుస్తులను పంపిణీ చేశారు. పిల్లల సర్వతోముఖాభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.

March 13, 2026 / 06:01 PM IST

ప్రజాపాలనలో 152 మందికి ఉచిత వైద్యం

GDWL: ప్రజా పాలన ప్రగతి ప్రాణాలికలో భాగంగా నిర్వహిస్తున్న ఈ మెడికల్ క్యాంపులు సామాన్యులకు వరం అని సర్పంచ్ మహేశ్వరమ్మ అన్నారు. శుక్రవారం ధరూరు మండలం ఉప్పేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ జి. రాజు ఆధ్వర్యంలో ఓ వైద్య శిబిరం నిర్వహించారు. జనరల్ మెడిసిన్, గైనకాలజీ, ఆర్థోపెడిక్ వంటి వివిధ విభాగాల స్పెషలిస్టులు 152 మంది రోగులను పరీక్షించి మందుల అందించారు.

March 13, 2026 / 06:01 PM IST

‘ముదిరాజ్ సొసైటీని రద్దు చేయాలి’

SDPT: బెజ్జంకి మండలం కల్లేపల్లి గ్రామ సర్పంచ్ బిగుల్ల మోహన్ ఆధ్వర్యంలో గ్రామ పాలకవర్గం సిద్దిపేట జిల్లా మత్స్యశాఖ అధికారి మల్లేశంను కలిసి వినతిపత్రం అందజేశారు. గ్రామ పంచాయతీ అనుమతి లేకుండా కొంతమంది ముదిరాజ్ సంఘ నాయకులు ఏర్పాటు చేసిన సొసైటీని రద్దు చేయాలని కోరారు. ఉపసర్పంచ్ శేషి వినీత్, వార్డు సభ్యులు నిషాని అనిల్ కుమార్, వేదిరే సతీష్ ఉన్నారు.

March 13, 2026 / 06:01 PM IST

‘ఇంటర్ పరీక్షలు విజయవంతంగా పూర్తి’: DIEO

PDPL: జిల్లాలో నిర్వహించిన ఇంటర్మీడియట్ పరీక్షలు ఇవాల్టితో విజయవంతంగా పూర్తయ్యాయని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి కల్పన తెలిపారు. రెవెన్యూ, పోలీస్, తపాలా, వైద్య, విద్యాశాఖ, విద్యుత్ మరియు టెలిఫోన్ శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పరీక్షలు సజావుగా జరిగాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పరీక్షల విజయవంతానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ఆమె ధన్యవాదాలు తెలిపారు.

March 13, 2026 / 06:00 PM IST