అన్నమయ్య: మదనపల్లి శివాజీ నగర్లోని పద్మావతి కళ్యాణమండపంలో నిర్వహిస్తున్న PM విశ్వకర్మ ట్రేడ్ ఫెయిర్ – కమ్ – ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని జిల్లా రెవెన్యూ అధికారి, ఇంఛార్జ్ జాయింట్ కలెక్టర్ మధుసూదనరావు ప్రారంభించారు. మూడు రోజుల పాటు జరిగే ఈ ప్రదర్శనలో సంప్రదాయ వృత్తుల కళాకారులు తమ హస్తకళా ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నారు.