ప్రకాశం: జరుగుమల్లి మండలానికి నూతన తహసీల్దాగా కె. వెంకటేశ్వర్లు శుక్రవారం అధికార బాధ్యతలు స్వీకరించారు. కార్యాలయంలో జరిగిన చిన్న కార్యక్రమంలో ఆయన పదవిని చేపట్టారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. మండల ప్రజలకు పారదర్శకంగా, వేగవంతంగా సేవలు అందించేందుకు కృషి చేస్తానని కె. వెంకటేశ్వర్లు తెలిపారు.
NTR: ఈ నెల 16వ తేదీ నుంచి ఏప్రిల్ 1 వరకు జరగనున్న పదో తరగతి పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ జి. లక్ష్మీశ అన్నారు. డీఈవో ఎల్. చంద్రకళతో కలిసి కలెక్టరేట్‌లో ఏవీఎస్ రెడ్డి హాల్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేశ...
కృష్ణా: గ్యాస్ సిలిండర్ల బుకింగ్ విధానం అర్బన్ ప్రాంతాల్లో 25 రోజులు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులుగా ఉండడంతో కంకిపాడు మండల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని టీడీపీ సీనియర్ నేత యలమంచిలి కిషోర్ బాబు శుక్రవారం అన్నారు. కావున సంబంధిత అధికారులు ఈ విషయాన్ని పరిశీలించి కంకిపాడు మండలంలో గ్యాస్ సిలిండర్ బుకింగ్ విధానాన్ని 25 రోజులకు పెంచాలని తెలిపారు.
PLD: నరసరావుపేట ఏరియా ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటున్నారా, ఇన్ పేషంట్లతో వైద్యం సక్రమంగా జరుగుతుందా లేదా అని అడిగి తెలుసుకున్నారు. హాస్పటల్ పరిసరాల పరిశుభ్రత వాతావరణంపై ఆరా తీశారు. డాక్టర్లు అందుబాటులో ఉంటూ రోగులకు మెరుగైన వైద్యం అందించాలని ఆమె కోరారు.
VSP: మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈనెల 15వ తేదీ రాత్రి విశాఖకు రానున్నారు. ఆయన ఎయిర్ పోర్టుకు చేరుకుని కిర్లంపూడి లేఅవుట్‌లోని తన నివాసంలో బస చేస్తారు. మార్చి 17న సాయంత్రం 6 గంటలకు కళాభారతి ఆడిటోరియంలో నిర్వహించే ఉగాది పురస్కార కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం 19వ తేదీ ఉదయం విశాఖపట్నం నుంచి విజయవాడకు బయలుదేరుతారు.
PPM: కురుపాం ఎంపీడీవో కార్యాలయాన్ని ఇంఛార్జ్ సబ్ కలెక్టర్ ఎస్. దిలీప్ చక్రవర్తి శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని వివిధ విభాగాలను పరిశీలించి, సిబ్బంది పనితీరుపై ఆరా తీశారు. సచివాలయ మండల బృందంతో సబ్ కలెక్టర్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో కొనసాగుతున్న వివిధ ప్రభుత్వ సర్వేల పురోగతిని అడిగి తెలుసుకున్నారు.
KMM: ఆధునిక పద్ధతుల్లో ఔషధ మొక్కలు పండిస్తే మంచి లాభాలు పొందవచ్చని డీఎఫ్ఎ సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ తెలిపారు. ఖమ్మం జిల్లాలో ఔషధ మొక్కల పెంపకంపై రైతులకు అవగాహన కల్పించే శిక్షణా కార్యక్రమాన్ని వారు నేడు ప్రారంభించారు. ‘గ్రీన్ గోల్డ్’గా పిలిచే ఈ మొక్కల సాగుతో రైతులు ఆర్థికంగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. తమ శాఖ తరఫున సహకారం ఉంటుందని రైతులకు వివరించారు.
నిజామాబాద్: ధర్పల్లి మండలం సీతాయిపేట గుడి తండాకి చెందిన జరుపుల కాంతమణి అనే మహిళ శవం 2026 మార్చి 11న అనుమానాస్పద స్థితిలో ధర్పల్లి గ్రామం బస్టాండ్ వెనుకాల ఓపెన్ ప్లాట్స్ వద్ద కనిపించింది. ఈ ఘటనపై ధర్పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా ఇవాళ నిందితుడు గుండ్ల నడుకుడ నర్సయ్య S/o పోశన్నను పట్టుకొని రిమాండ్‌కు పంపించారు.
నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న భారీ యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన ‘ఆయా షేర్’ సాంగ్ దుమ్మురేపుతోంది. అయితే, ఈ సాంగ్ చిత్రీకరణ కోసం హైదరాబాద్‌లో ఏకంగా 2.5 ఎకరాల విస్తీర్ణంలో ఒక భారీ మురికివాడ సెట్‌ను నిర్మించారు. అందులో 60 ఇళ్లతో ఒక గ్రామాన్నే సృష్టించడం విశేషం. ఈ సాంగ్ సినిమాకే ప్రధాన ఆకర్షణగా నిలవనుందని తెలుస్తోంది.
TG: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లోని గుర్రంగూడ అటవీ ప్రాంతాన్ని రిజర్వ్ ఫారెస్ట్‌గా ప్రకటించింది. ఈ మేరకు పర్యావరణ, అటవీశాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. మరో భారీ అర్బన్ పార్క్ ఏర్పాటుకు అటవీ శాఖ కసరత్తు చేస్తోంది. మొత్తం 424.31 ఎకరాల అటవీ భూభాగాన్ని రిజర్వ్ ఫారెస్ట్‌గా ప్రభుత్వం గుర్తించింది.
TPT: వెంకటగిరి పట్టణంలోని పాలకేంద్రం సమీపంలో ఉన్న 132 KV సబ్ స్టేషన్‌లో మరమ్మతుల నిమిత్తం శనివారం ఉదయం 8.00 గంటల నుంచి మధ్యాహ్నం 2.00 గంటల వరకు విద్యుత్ అంతరాయం ఉంటుందని డీఈఈ శీనయ్య చెప్పారు. మున్సిపాలిటీ, వెంకటగిరి రూరల్, డక్కిలి, బాలాయపల్లి మండలాల పరిధిలో కరెంట్ ఉండదని అన్నారు. ఈ విద్యుత్ అంతరాయానికి ప్రజలందరూ సహకరించాలని తెలిపారు.
CTR: అన్నదాత సుఖీభవ-PM కిసాన్ 3వ విడతలో భాగంగా నగరి నియోజకవర్గంలోని 20,063 మంది రైతులకు రూ.11.27 కోట్లు చెక్కును నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ శుక్రవారం రైతులకు అందజేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సూపర్ సిక్స్ హామీల అమలులో భాగంగా దేశంలో ఎక్కడా లేనివిధంగా అన్నదాత సుఖీభవ కింద ప్రతీ రైతుకు ఏడాదికి రూ.20,000 ప్రభుత్వం అందజేస్తుందని తెలిపారు.
SKLM: ఆడపిల్లల ఆరోగ్యమే సమాజానికి పునాది అని నరసన్నపేట టీడీపీ నియోజకవర్గ సమన్వయకర్త అర్చన అన్నారు. శుక్రవారం పోలాకి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హెచ్‌పీవీ వ్యాక్సి నేషన్ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. గర్భాశయ క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే అరికట్టేందుకు హెచ్‌పీవీ వ్యాక్సిన్ ఎంతో కీలకమని అన్నారు.
ATP: అనంతపురంలోని శ్రీ కోదండ రామస్వామి దేవాలయ శ్రీరామనవమి బ్రహ్మోత్సవ ఆహ్వాన పత్రికలను ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆవిష్కరించారు. ఈ నెల 27 నుంచి ఏప్రిల్ 5 వరకు నిర్వహించనున్న ఈ ఉత్సవాల ఏర్పాట్లపై ఆలయ కమిటీ చైర్మన్ అమిలినేని నరేంద్ర చౌదరి, ఈవో నాగేంద్రుడుతో కలిసి చర్చించారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా పక్కాగా ఏర్పాట్లు చేయాలన్నారు.
AP: పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావం రాష్ట్రాంలోని విమాన టికెట్లపై పడింది. డొమెస్టిక్ విమానాలకు 10 శాతం టికెట్ ధరలు పెరిగాయి. ఇంటర్నేషనల్ విమాన టికెట్ ధరలు 4 రెట్లు పెరిగాయి. కాగా.. ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో విమాన ఇంధన ధరలకు రెక్కలు రావడంతో విమానయాన సంస్థలు ప్రయాణికులపై ఆ భారాన్ని మోపేందుకు సిద్ధమవుతున్నాయి.