MNCL: మందమర్రి మండలం పొన్నారం సర్పంచ్ మధు కాంగ్రెస్‌లో చేరారు. మంత్రి వివేక్ వెంకటస్వామి ఆయనకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. మంత్రి మాట్లాడుతూ.. BRS విధానాలు నచ్చకనే మధు కాంగ్రెస్‌లో చేరారని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై అనేకమంది నేతలు కాంగ్రెస్ బాట పడుతున్నారని మంత్రి పేర్కొన్నారు.
NRML: రేపటి నుంచి ప్రారంభం కానున్న 10వ తరగతి పరీక్షకు హాజరయ్యే విద్యార్థులందరూ గంటముందు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని జిల్లా డీఈవో భోజన్న తెలిపారు. పదో తరగతి పరీక్షలకు నిమిషం నిబంధన అమలులో లేదని 9:30 గంటలకు పరీక్ష ప్రారంభమవుతుండగా ఐదు నిమిషాల వరకు అనుమతి ఉంటుందని తెలిపారు. విద్యార్థులు గంట ముందు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు.
AP: అనకాపల్లి జిల్లా పెందుర్తి మండలంలో కొండచిలువల కలకలం రేగింది. స్థానిక పెదముషిడివాడలోని వాటర్ పైపుల నిర్మాణ స్థలంలో 6 కొండచిలువలు కనిపించాయి. ఇందులో 2 కొండచిలువలు JCB తగిలి మృతిచెందగా.. మిగిలిన నాలుగింటిని సిబ్బంది అడవుల్లో వదిలేశారు. ఒకేసారి 6 కొండచిలువలు కనిపించడంతో ఎక్కడి నుంచి వచ్చాయో, నిర్మాణ స్థలంలో ఇంకా ఏమైనా ఉన్నాయేమోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
WGL: ఎనుమాముల మార్కెట్‌లో జీరో కాంటా వ్యవహారంలో ముగ్గురు దడ్డువాయిలకు మార్కెట్ కార్యదర్శి మల్లేశం నోటీసులు జారీ చేశారు. మిర్చి యార్డులో తనిఖీల్లో నంబర్ 37 తూర్పాటి రహేక్, 38 నిమ్మ సాంపేటి, 43 సతీష్ జీరో కాంటాతో దొరికినట్లు తెలిపారు. దీంతో వారిని డ్యూటీ రిజిస్టర్‌లో గైర్హాజర్‌గా నమోదు చేశారు. ఈ చర్యలపై యూనియన్ నాయకులు చర్యలు తీసుకోవాలని కార్యదర్శి కోరారు.
KMR: రంజాన్ పండుగ కోసం రాష్ట్ర ప్రభుత్వం నిరుపేద ముస్లింలకు రంజాన్ తోఫా అందించనుందనీ మద్నూర్ MRO ముజీబ్ NEFU ఒక ప్రకటనలో తెలిపారు. జుక్కల్ నియోజకవర్గంలోని 8 మండలాలకు 1,250 మందికి రంజాన్ తోఫా ప్రభుత్వం సరఫరా చేస్తుందని అన్నారు. త్వరలో ఎమ్మెల్యే చేతుల మీదుగా ఆయా మండలాల పరిధిలో పంపిణీ చేయడం జరుగుతుందని తాహసీల్దార్ తెలిపారు.
GDWL: జిల్లాలో రేపటి నుంచి ప్రారంభం కానున్న పదవ తరగతి వార్షిక పరీక్షలకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లా వ్యాప్తంగా 40 పరీక్ష కేంద్రాలను సిద్ధం చేశారు. 187 ఉన్నత పాఠశాలల నుంచి సుమారు 8057 మంది విద్యార్థులు ఈ ఏడాది పరీక్షలకు హాజరుకానున్నారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు అందజేశారు.
SDPT: పదవ తరగతి విద్యార్థులకు సర్పంచ్ లావుడియా రాజు నాయక్ అండగా నిలిచారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అంతకపేట పరీక్షా కేంద్రానికి వెళ్లేందుకు ఆయన స్వయంగా ఆటోను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఏకాగ్రతతో చదివి, మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించి తల్లిదండ్రులకు, పాఠశాలకు పేరు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు.
రామ్‌చరణ్ హీరోగా నటించిన మూవీ ‘పెద్ది’. బుచ్చిబాబు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రాన్ని డాల్బీ సినిమాస్ ఫార్మాట్‌లో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటిస్తూ.. రామ్‌చరణ్ కొత్త ఫొటోను విడుదల చేశారు. కాగా, APR 30న విడుదల కానున్న ఈ మూవీ డాల్బీ ఫార్మాట్‌లో విడుదలవుతున్న తొలి టాలీవుడ్ చిత్రంగా నిలవనుంది.
VKB: పరిగి మండలం రూప్పైన్‌పేట్ సమీపంలో ఇవాళ తెల్లవారుజామున NHపై యాక్సిడెంట్ జరిగింది. పోలీసుల వివరాలు.. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని కారు ఢీ కొట్టడండంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు పరిగి మండలం రంగంపల్లి గ్రామానికి చెందిన సుబ్బన్నయ్య (45)గా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం మృతదేహాన్ని పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
నల్లగొండ మెడికల్ కాలేజీలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన 62 బోధనా సిబ్బంది పోస్టులను భర్తీ చేయనున్నారు. ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ట్యూటర్ వంటి వివిధ స్థాయిలలో ఖాళీలు ఉన్నాయి. అనాటమీ, ఫిజియాలజీ, బయో కెమిస్ట్రీ, ఫార్మాకాలజీ, పాథాలజీ, మైక్రో బయాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, కమ్యూనిటీ మెడిసిన్ వంటి విభాగాలలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు
TG: హైదరాబాద్‌లోని గోషామహల్, బేగంబజార్‌లో రీఫిలింగ్ స్టేషన్లపై SOT పోలీసులు దాడులు చేపట్టారు. ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో గ్యాస్ కొరతను ఏర్పడగా దీనిని ఏజెన్సీలు సొమ్ము చేసుకుంటున్నాయి. ఒక్కో సిలిండర్‌ను బ్లాక్‌లో రూ.5 నుంచి 8 వేల వరకు అమ్ముతున్నాయి.
SKLM: లావేరు మండలం సుభద్రాపురం కూడలి సమీపంలో అక్రమంగా తరలిస్తున్న 8 పశువులను ఎస్సై కె. అప్పలసూరి గురువారం పట్టుకున్నారు. నరసన్నపేట మండలం తిలారు సంత నుంచి అలమండకు తరలిస్తున్న పవన్‌పై కేసు నమోదు చేసి, వ్యాను సీజ్ చేశామన్నారు. మూగజీవాలను అక్రమంగా రవాణా చేస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని ఎస్సై అప్పలసూరి హెచ్చరించారు.
MHBD: బయ్యారం మండలం చల్లపల్లి గ్రామ పంచాయతీలో 70 మంది లబ్ధిదారులకు రూ.70 లక్షల విలువైన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను గురువారం ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య అందజేశారు. వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలను పైరవీలకు తావు లేదని, పార్టీలకతీతంగా నిరుపేదలైన వారికి ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందిస్తున్నామని పేర్కొన్నారు.
CTR: జిల్లాలో పశుపోషకులు అధికంగా ఉన్నందున మినీ గోకులాలకు డిమాండ్ ఎక్కువగా ఉందని సీఎం చంద్రబాబుకు కలెక్టర్ సుమిత్ కుమార్ విన్నవించారు. రూ.3 వేల గోకుల నిర్మాణం చేపట్టామని, మరిన్ని మంజూరు చేస్తే పాడి రైతులకు ఉపయోగముంటుందని తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో అధిక సంఖ్యలో మంజూరు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.
ప్రకాశం: ఒంగోలులోని ఆర్టీసీ డిపోలో డ్రైవింగ్ స్కూల్ ఏర్పాటు చేసినట్లు మార్కాపురం ఆర్టీసీ మేనేజర్ గురువారం ఒక ప్రకటనలు తెలిపారు. ఆర్టీసీ డ్రైవర్లచే 40 రోజులు శిక్షణ ఇస్తారని, రూ.20వేలు, జీఎస్‌టీ రూ.3600 చెల్లించాల్సి ఉంటుందన్నారు. శిక్షణ అనంతరం హెవీ లైసెన్స్ కలిగి ఉంటే ఆర్టీసీ రిక్రూట్‌మెంట్‌లో తగిన ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు.