నంద్యాల: ఆత్మకూరు మండలం కృష్ణాపురం వద్ద విషాద ఘటన చోటుచేసుకుంది. కర్ణాటకకు చెందిన విజయ్ కుమార్ బరాది (38) పాదయాత్రగా శ్రీశైలానికి వెళ్తుండగా ఎండ వేడిమి తట్టుకోలేక అస్వస్థతకు గురయ్యాడు. కృష్ణాపురం వద్ద సేదతీరుతున్న సమయంలో అతడు మృతి చెందగా, ఇవాళ పోలీసులు ఘటనపై దర్యాప్తు చేసి బంధువులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు.
MBNR: జడ్చర్ల నియోజకవర్గ అభివృద్ధి పనుల నిమిత్తం విచ్చేసిన మంత్రి వాకిటి శ్రీహరికి ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి రంగారెడ్డిగూడ వద్ద ఘన స్వాగతం పలికారు. అనంతరం జడ్చర్ల, మిడ్జిల్ మండలాల్లో పలు సంక్షేమ కార్యక్రమాల్లో వీరు పాల్గొననున్నారు. ఈ పర్యటనతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగవంతం కానున్నాయని కార్యకర్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
E.G: జిల్లా వైసీపీ ఏడు నియోజకవర్గాలకు సంబంధించి నూతన పరిశీలకులను ఆదివారం నియమించింది. కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులుగా గొoదేశి శ్రీనివాసరెడ్డి, అనపర్తి తులసి కుమార్, రాజానగరం చందన నాగేశ్వర్, నిడదవోలు గిరజాలబాబు, గోపాలపురం తోట రామకృష్ణ, రాజమండ్రి సిటీ అద్దంకి ముక్తేశ్వరరావు నియమితులయ్యారు. ఈ నియామకంపై పార్టీ శ్రేణులు హర్షo వ్యక్తo చేశారు.
TG: రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ డ్రగ్స్ కేసుపై టీపీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్ స్పందించారు. ఈ కేసుపై కేటీఆర్ బృందం సమాధానం చెప్పాలని డిమండ్ చేశారు. ప్రజలు, డ్రగ్స్ రహిత సమాజం కోసం దాడులు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అవసరమైతే కేటీఆర్ డ్రగ్స్ పరీక్షకు సిద్ధం కావాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ సమావేశాల సమయంలో ఎమ్మెల్యేలందరం పరీక్షలు చేసుకుందామని తెలిపారు.
ప్రకాశం: సింగరాయకొండ లో దొంగతనాల నేపథ్యంలో గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. శనివారం రాత్రి CI హజరత్తయ్య సిబ్బందితో గ్రామంలో పలుచోట్ల పర్యటించారు. స్థానికులతో మాట్లాడి భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. CC కెమెరాలతో నిఘా పెంచామని వారిలో ధైర్యం నింపారు.
ADB: నార్నూర్ మండలం కొత్తపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో నిబద్ధతతో పనిచేస్తున్న మల్టీపర్పస్ వర్కర్లను సర్పంచ్ దిగంబర్ అభినందించారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడంలోనూ, ప్రజలకు నిరంతరం సేవలందించడంలోనూ వారి పాత్ర కీలకమని కొనియాడారు. కష్టపడి పనిచేసే కార్మికుల వల్లే గ్రామ అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
కలెక్షన్ కింగ్ మోహన్ బాబుపై దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ప్రశంసలు కురిపించాడు. ‘ది ప్యారడైజ్’ మూవీ సెట్‌లో మోహన్ బాబు ఉంటే ఆ రోజు షెడ్యూల్ అంత అనుకున్న సమయానికి పూర్తవుతుందన్నాడు. మిగిలిన రోజు ఆలస్యమవుతుందని చెప్పాడు. ఈ సినిమాలో ఆయన పాత్ర గురించి ఇప్పుడేం చెప్పలేనని, అది ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటుందో ట్రైలర్ విడుదలైనప్పుడు మీకే అర్థమవుతుందని తెలిపాడు.
KMR: మాచారెడ్డి మండలం కొత్తపల్లిలో కూర్మ సంఘం ఆధ్వర్యంలో బీరప్ప కామరాతి కల్యాణోత్సవాలు మిన్నంటాయి. వారం రోజుల పాటు సాగే ఈ వేడుకల్లో భాగంగా ఆదివారం ఒగ్గు కళాకారుల విన్యాసాల మధ్య ‘గంగా బోనం’ కార్య క్రమాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ వేడుకను తిలకించేందుకు గ్రామస్థులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.
సత్యసాయి: పెనుకొండ మండలం ఎర్రమంచి గ్రామ పంచాయతీలోని శ్రీ సద్గురు షిర్డీ సాయిబాబా ఆలయంలో ఆదివారం విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ సత్యసాయి సేవ సమితి ఆధ్వర్యంలో ఆలయంలో సాయి భజనలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు అన్నదానం చేశారు.
AKP: కె.కోటపాడు మండలం ఏ.కోడూరులో PACS ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్‌ను ఆదివారం ప్రారంభించారు. DCCB ఛైర్మన్ కోన తాతారావు, ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి ప్రారంభోత్సవం నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో ఇంధన సౌకర్యాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
MNCL: జన్నారం మండలంలోని రైతులు పంటల రక్షణకు దృష్టి పెట్టాలని మండలంలోని కవ్వాల్ క్లస్టర్ ఏఈఓ అక్రమ్ సూచించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. మార్చి 16-20 తేదీల మధ్యలో మోస్తరు నుంచి భారీ వర్షాలు, బలమైన ఉరుములు, మెరుపులు పిడుగులు, ఈదురుగాలులు, వడగళ్ల వానలు పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని వాతావరణ శాఖ ప్రకటించిందన్నారు. పంటల రక్షణకు దృష్టి సారించాలని కోరారు.
NTR: విజయవాడ వెటర్నరీ కాలనీ యూత్ హాస్టల్ ఖాళీ స్థలాన్ని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావుతో కలిసి ఎంపీ కేసినేని చిన్ని ఆదివారం పరిశీలించారు. ఎంపీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి విజయవాడ అభివృద్ధికి కృషి చేస్తున్నామని అన్నారు. కానీ కార్పొరేషన్ పాలకవర్గంలో ఉన్న వైసీపీ నాయకులు నగర అభివృద్ధికి అడ్డుపడుతున్నారని విమర్శించారు.
SRCL: ఈనెల 17, 18న తంగళ్ళపల్లి మండలం మండేపల్లిలో జరగనున్న ఎల్లమ్మ సిద్దోగానికి కాంగ్రెస్ సిరిసిల్ల నియోజకవర్గం ఇన్‌ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డిని గౌడ సంఘం నాయకులు ఆదివారం ఆహ్వానించారు. ఎల్లమ్మ సిద్దోగానికి హాజరై తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని వారు తెలిపారు. పెద్ద ఎత్తున భక్తులు హాజరై ఆ దేవత కృపకు పాత్రులు కావాలని కోరారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు టోనీ ఉన్నారు.
‘ది హండ్రెడ్’ లీగ్ కోసం పాక్ ప్లేయర్ అబ్రార్ అహ్మద్‌ను సన్‌రైజర్స్ లీడ్స్ తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇంటర్నేషనల్ షెడ్యూల్ వల్ల ఈ ఏడాది అతను సన్‌రైజర్స్ తరఫున ఆడే ఛాన్స్ లేదని PCB వర్గాలు తెలిపాయి. ఇంగ్లండ్ లీగ్ ఈ ఏడాది జూలై 21-ఆగష్టు 16 తేదీల్లో జరగనుండగా.. అదే సమయంలో విండీస్‌తో పాక్ 2 టెస్టుల సిరీస్ ఆడనుందని పేర్కొన్నాయి.
VZM: నెల్లిమర్ల మండలంలో ఇవాళ పలు కేంద్రాల్లో ఉల్లాస్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. నిరక్షరాస్యులైన వయోజనులకు ప్రభుత్వం నిర్వహిస్తున్న పరీక్ష కేంద్రాలను MEO త్రినాథరావు పరిశీలించారు. నిర్వహణ తీరును పరిశీలించి, పకడ్బందీగా నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో CRP నాయుడు, వెలుగు, ఉపాధిహామీ సిబ్బంది ఉన్నారు.