• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

బాల్య వివాహల నిర్ములనపై అవగాహన

CTR: విజయపురం(మం) శ్రీహరిపురం, జంబడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఐసీడీఎస్ పర్యవేక్షకులు శ్యామల ఆధ్వర్యంలో బాల్య వివాహలపైన అవగాహన కార్యక్రమం గురువారం నిర్వహించారు. చిన్న వయస్సులో పెళ్లి చేసుకొని జీవితాలను నాశనం చేసుకోరదని, పొక్సో, శిశు లింగ నిర్దారణ చట్టాలపైన శ్యామల అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసలు, దొరస్వామి పాల్గొన్నారు.

March 12, 2026 / 08:20 PM IST

కసింకోటలో స్పెషల్ డ్రైవ్

AKP: కసింకోట మండలంలో ఇప్పటివరకు రూ.2.61 కోట్లు పైగా ఇంటి పన్నుల వసూళ్లు చేసినట్లు కసింకోట ఎంపీడీవో చంద్రశేఖర్ తెలిపారు. గురువారం తేగాడ, జోగారావుపేట, బయ్యవరం గ్రామాల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ఇంటి పన్నుల వసూళ్లు చేసామన్నారు. మొత్తం డిమాండు రూ.3.67 కోట్లు ఉందన్నారు. ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిసి అవగాహన కల్పిస్తున్నామన్నారు.

March 12, 2026 / 08:19 PM IST

‘మండలంలో 8257 మందికి లబ్ధి’

ASR: అన్నదాత సుఖీభవ పధకం 3వ విడతలో అనంతగిరి మండలంలో 8257 మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని ఎంఏవో రంగారావు గురువారం తెలిపారు. 8257 మంది రైతులకి అన్నదాత సుఖీభవ పథకం 3వ విడతలో రూ. 4000, 22వ విడత పీఎం కిసాన్ పథకం కింద రూ. 2,000 లబ్ధి వారి ఖాతాలకు జమ అవుతుందన్నారు. అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పధకాల కింద మండలానికి మొత్తం రూ.4.95 కోట్ల లబ్ధి అందుతుందన్నారు.

March 12, 2026 / 08:18 PM IST

మునుగోడులో రేపు రూ.18కోట్ల పనులకు శ్రీకారం

NLG: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రేపు మండలంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. సుమారు రూ.18 కోట్ల వ్యయంతో చేపట్టనున్న రోడ్లు, అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడంతో పాటు దుబ్బ కాల్వలో నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని MLA ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా మండల నాయకులు పాల్గొన్నారు.

March 12, 2026 / 08:18 PM IST

సీసీ రోడ్డు నిర్మాణ పనులను శ్రీకారం

SRPT: మోతే మండలం భీక్యాతండాలో ఈరోజు సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాన్ని మోతే మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కీసర సంతోష్ రెడ్డి పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో గ్రామాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని ఆయన అన్నారు.

March 12, 2026 / 08:17 PM IST

హిట్ టీవీ కథనానికి స్పందన

VZM: ఎస్.కోట నుంచి విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్ వెళ్ళడానికి కొత్తవలస ప్రధాన బస్సు స్టాప్‌లో చెయ్యి ఎత్తిన బస్సులు ఆపడం లేదని ఈనెల 9న, హిట్ టీవీలో కథనం వెలువడిన విషయం పాఠకులకు తెలిసిందే. ఈ కథనానికి ఎస్.కోట డిపో ప్రబంధకుడు సుదర్శనరావు స్పందించి ప్రధాన బస్ స్టాప్‌లో ప్రత్యేక సిబ్బందిని గురువారం నియమించారు. సిబ్బంది నియమించడంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేశారు.

March 12, 2026 / 08:17 PM IST

రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీసేలా జగన్‌ వైఖరి: మంత్రి

AP: గతంలో చెప్పిన అబద్ధాలనే జగన్ మళ్లీ చెప్పారని మంత్రి పయ్యావుల కేశవ్ విమర్శించారు. YCP హయాంలో ఆర్థిక విధ్వంసం జరిగిందని కాగ్ స్పష్టం చేసిందన్నారు. వాళ్లు చేసిన ఆర్థిక విధ్వంసాన్ని తమపై నెట్టేందుకు ప్రయత్నించారని మండిపడ్డారు. బాధితుల్ని నిందితులుగా చిత్రీకరించడం జగన్ మార్క్ రాజకీయాలని ఆరోపించారు. నెట్ బారోయింగ్‌ను కూటమి ప్రభుత్వం ఎక్కడా అధిగమించలేదన్నారు.

March 12, 2026 / 08:15 PM IST

భీమవరంలో 15,699 జనసేన సభ్యత్వాలు నమోదు

W.G: భీమవరం నియోజకవర్గంలో జనసేన ఉద్యమి క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సాధక్‌లు ఎంతో ఉత్సాహంగా నిర్వహిస్తున్నారని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. గురువారం సభ్యత్వ నమోదు సాధక్‌లతో ఎమ్మెల్యే అంజిబాబు జూమ్ మీటింగ్ ద్వారా మాట్లాడారు. నియోజక వర్గంలో 15,699 జనసేన సభ్యత్వాలు నమోదు చేసారని అన్నారు.

March 12, 2026 / 08:15 PM IST

‘పరీక్షలకు 635 మంది విద్యార్థులు’

KNR: ఈనెల 14 నుంచి ఏప్రిల్ 16 వరకు జరగనున్న పదో తరగతి వార్షిక పరీక్షలకు రామడుగు మండలంలో ఏర్పాట్లు పూర్తయ్యాయని అధికారులు తెలిపారు. మండలం నుంచి మొత్తం 635 మంది విద్యార్థులు హాజరుకానుండగా, అందులో 386 మంది బాలురు, 249 మంది బాలికలు ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలల నుంచి 225 మంది, ఐదు ప్రైవేటు పాఠశాలల నుంచి 410 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు.

March 12, 2026 / 08:14 PM IST

మహాలక్ష్మి అమ్మవారి ఆలయ నిర్మాణానికి విరాళం

కోనసీమ: పి. గన్నవరం మండలంలోని లంకల గన్నవరం గ్రామం శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి ఆలయ పునఃనిర్మాణానికి గ్రామానికి చెందిన ప్రముఖ సిద్ధాంతి బులుసు శ్రీరామ శర్మ సిద్ధాంతి కుటుంబసభ్యులు రూ.1,10,232 విరాళాన్ని అందజేశారు. దాత కుటుంబ సభ్యులు ముందుగా అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ పునఃనిర్మాణ కమిటీ సభ్యులు దాతలను సత్కరించారు.

March 12, 2026 / 08:13 PM IST

గ్యాస్ కొరతపై లబ్ధిదారులలో ఆందోళన

SKLM: జిల్లా వ్యాప్తంగా గ్యాస్ బుకింగ్ సమస్య తలెత్తడంతో లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆన్‌లైన్ బుకింగ్ సరిగా జరగకపోవడంతో ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. అమెరికా-ఇరాన్ యుద్ధం కారణంగా గ్యాస్ కొరత వస్తుందనే వార్తలు సోషల్ మీడియాలో రావడంతో ప్రజల్లో భయం నెలకొంది. అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

March 12, 2026 / 08:11 PM IST

ఇఫ్తార్ విందులో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

NRPT: మద్దూరు మున్సిపాలిటీ కేంద్రంలోని జామ మసీదులో ముస్లిం మైనారిటీ సోదరుల ఆధ్వర్యంలో రంజాన్ సందర్భంగా ఇఫ్తార్ విందును ఘనంగా నిర్వహించారు. ఈ కార్య క్రమానికి కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ముస్లిం సోదరులతో కలిసి ఉపవాస విరమణ చేశారు. ఆయన మాట్లాడుతూ.. రంజాన్ పండుగ సోదరభావం, శాంతి ఐక్యతకు ప్రతీక అని అన్నారు.

March 12, 2026 / 08:11 PM IST

కమిషనరేట్ కార్యాలయంలో శ్రమదాన కార్యక్రమం

WGL: ‘ప్రజాపాలన-ప్రగతి’ 99 రోజుల కార్యక్రమంలో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో గురువారం ప్రత్యేక శ్రమదాన కార్యక్రమం నిర్వహించారు. పోలీస్ అధికారులు, సిబ్బంది స్వయంగా కమిషనరేట్ ప్రాంగణాన్ని శుభ్రం చేశారు. స్వచ్ఛతతో పాటు పచ్చదనాన్ని పెంపొందించేందుకు ప్రాంగణంలో కొత్త మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు.

March 12, 2026 / 08:10 PM IST

‘ఆన్‌లైన్‌లో మాత్రమే బుక్ చేసుకోవాలి’

MNCL: గ్యాస్ వినియోగదారులు ఆన్‌లైన్‌లో మాత్రమే సిలిండర్లను బుక్ చేసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రావు తెలిపారు. గురువారం నస్పూర్ కలెక్టరెట్‌లో LPG డీలర్లతో అత్యవసర సమావేశం నిర్వహించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. నిబంధనలకు విరుద్ధంగా డొమెస్టిక్ సిలిండర్లు ఉపయోగించినట్లయితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

March 12, 2026 / 08:10 PM IST

ఇఫ్తార్ విందులో మాజీ మంత్రి హరీష్, ఎమ్మెల్యే

SRD: జహీరాబాద్ పట్టణంలో BRS పార్టీ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు, స్థానిక ఎమ్మెల్యే మాణిక్యరావు పాల్గొని ముస్లిం సోదరులకు పండ్లు ఫలాలు తినిపించి, రోజా ఉపవాస దీక్షను విరమింపజేశారు. అనంతరం ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.

March 12, 2026 / 08:08 PM IST