E.G: కూటమి ప్రభుత్వం ప్రజలకు మంచి పాలన అందించే దిశగా పనిచేస్తుందని రాష్ట్ర అంచనాల కమిటీ ఛైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు తెలిపారు. మండపేట పట్టణం 11వ వార్డుకి చెందిన పలువురు వైసీపీ కార్యకర్తలు ఆ వార్డు టీడీపీ నాయకుడు కొవ్వాడ అప్పన్నబాబు ఆధ్వర్యంలో TDP కార్యాలయంలో గురువారం ఎమ్మెల్యే సమక్షంలో వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు.
AP: సాగర్ డిఫెన్స్ ఇంజినీరింగ్ పరిశ్రమ రాష్ట్రానికి రావడం ఆనందంగా ఉందని మంత్రి లోకేష్ అన్నారు. నెల్లూరు జిల్లాలోని జువ్వలదిన్నెలో సాగర్ డిఫెన్స్ ఇంజినీరింగ్ పరిశ్రమకు లోకేష్ శంకుస్థాపన చేసి మాట్లాడారు. ఈ పరిశ్రమ వల్ల 25 వేల మత్స్యకార కుటుంబాలకు లబ్ధి జరుగుతుందని చెప్పారు. మత్స్యకార కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు.
TG: HYD నగరంలో సమగ్ర రవాణా వ్యవస్థపై HMDA కీలక ప్రణాళికను సిద్ధం చేసింది. 2050 నాటికి మెట్రో నెట్‌వర్క్‌ను 556.6 కిలోమీటర్లు, MMTS నెట్‌వర్క్‌ను 336.4 కిలోమీటర్లు, రోడ్ నెట్‌వర్క్‌ను 19,352 కిలోమీటర్లకు విస్తరించనున్నట్లు తెలిపింది. HYDలో 120 ఫుట్ ఓవర్ బ్రిడ్జ్‌లు, స్కైవాక్‌లకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. మూసీ నదిపై 29 వంతెనలు నిర్మించను...
WNP: మార్చి 28న జరగనున్న జాతీయ లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని వనపర్తి జిల్లా జడ్జి ఎం.ఆర్ సునీత అన్నారు. గురువారం వనపర్తి జిల్లా కోర్టు ఆవరణలో న్యాయవాదులతో సమావేశాన్ని నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. రాజీ మార్గమే ఉత్తమమై కక్షిదారులు తమ కేసులను రాజీ ద్వారా పరిష్కరించుకునేలా చూడాలని న్యాయవాదులకు సూచించారు.
MBNR: జిల్లా కేంద్రంలోని డీసీఎంఎస్ ఎరువుల గోదామును జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్తా గురువారం సందర్శించారు. యూరియా కోసం యాప్‌లో బుక్ చేసుకున్న రైతులకు మాత్రమే యూరియా ఇవ్వాలని ఆదేశించారు. ఈ పాస్‌లో విక్రయాలకు, నిల్వలకు ఎటువంటి తేడా ఉండకూడదని హెచ్చరించారు. ప్రస్తుతం 7652 బ్యాగుల యూరియా నిల్వలు ఉన్నాయని ఎటువంటి యూరియా కొరత లేదన్నారు.
JGL: కథలాపూర్ మండలం బొమ్మెన గ్రామానికి చెందిన రోజాను వరకట్న వేధింపులకు గురి చేసిన ఆమె భర్త గంగాధర్‌కు జగిత్యాల అదనపు జూనియర్ సివిల్ జడ్జి, జుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ శ్రీనిజ కోహిర్కర్ గురువారం 6 నెలల జైలు శిక్ష విధించారు. ఈ కేసులో నిందితునికి శిక్ష పడేలా కృషి చేసిన పోలీసు సిబ్బందిని ఎస్పీ అశోక్ కుమార్ అభినందించారు.
ADB: మహిళలు స్వయం ఉపాధి పొందుతూ ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని డీఆర్డీవో ఏపీడీ గోవిందరావు పిలుపునిచ్చారు. బజార్హతనూర్ మండలం కొలంగూడలో పీవీటీజీ గిరిజన కుటుంబాలకు భరోసానిచ్చేందుకు నెల రోజులుగా నిర్వహించిన వెదురు వస్తువుల తయారీ, కుట్టు శిక్షణ కార్యక్రమం ముగిసింది. ఈ సందర్భంగా శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు ఆయన సర్టిఫికేట్లను అందజేశారు.
IPL 2026 సీజన్‌కు ముందు RCB జట్టుకు భారీ షాక్ తగిలే అవకాశం కనిపిస్తోంది. ఆ జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ ఈ సీజన్‌లో పాల్గొనడంపై సందిగ్ధత నెలకొంది. గాయంతో బాధపడుతున్న అతడు ఇంకా పూర్తిగా కోలుకోలేదు. తాజా సమాచారం ప్రకారం, అతడు ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒకవేళ అదే జరిగితే, RCB జట్టుకు ఇది కోలుకోలేని దెబ్బే.
NLG: పదవ తరగతి పరీక్షల నిర్వహణపై నల్లగొండ డివిజన్ ఇన్విజిలేటర్లకు అశోక గార్డెన్స్‌లో శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖాధికారి మాట్లాడుతూ.. పరీక్షలను అత్యంత పకడ్బందీగా, పారదర్శకంగా జరపాలని సూచించారు. ఎక్కడా మాస్ కాపీయింగ్‌కు తావులేకుండా, విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా ఇన్విజిలేటర్లు చర్యలు తీసుకోవాలన్నారు.
GDWL: అయిజ మండల పరిధిలోని వెంకటాపూర్ గ్రామంలో రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ముస్లిం సోదరులకు భారీ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. గురువారం ప్రముఖ సామాజిక వేత్త శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్థానిక మసీదులో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. శ్రీనివాస్ మాట్లాడుతూ.. పండుగలు మన మధ్య ప్రేమను, ఐక్యతను పెంచుతాయని, రంజాన్ పవిత్రతను కాపాడటం మనందరి బాధ్యతని అన్నారు.
KNR: పంటల సాగులో సస్యరక్షణ చర్యలు పాటించాలని, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త విజయ్ సూచించారు. ఇల్లందకుంట రైతు వేదికలో వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. శాస్త్రవేత్త జే. విజయ్ మాట్లాడుతూ.. ప్రస్తుత పంటల సంరక్షణ, యూరియా వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు యాజమాన్య పద్ధతులపై వివరించారు.
ELR: నూజివీడు రైతులకు రేపు సుమారు రూ.20 కోట్ల మేర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సాయంగా అందించనున్నట్లు వ్యవసాయ అధికారి చెన్నారావు తెలిపారు. ఆయన నూజివీడులో గురువారం మాట్లాడుతూ.. 35,529 మంది రైతులకు అన్నదాత సుఖీభవ పథకంలో రూ.14.21 కోట్లు, కేంద్రం అందించే పీఎం కిసాన్‌లో రూ.5.56 కోట్లు, మొత్తం రూ.19.77 కోట్లు రైతుల ఎకౌంట్లో జమ కానున్నట్లు పేర్కొన్నారు.
KRNL: ఆదోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఫార్మసిస్ట్ సిరాజ్ ఉల్ 15 ఏళ్లుగా నిరంతరం రోగులకు సేవలందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. సెలవులు, ఆదివారాల్లోనూ విధులు నిర్వర్తిస్తూ ఆసుపత్రికి వచ్చే సుమారు 700 మంది రోగులకు మందులు అందిస్తున్నారు. ఆసుపత్రిలో మహిళలు, పురుషులకు ఒకే కౌంటర్ ఉన్నప్పటికీ ప్రజలకు క్రమబద్ధంగా మందులు పంపిణీ చేస్తూ ప్రజల మన్నలను పొందుతున్నారు.
KDP: పులివెందులలో న్యాయవాది మిట్ట సతీష్ కుమార్‌పై దాడి జరిగింది. నోటరీ పని అనంతరం ఫీజు అడిగినందుకు రామిరెడ్డి శివానందరెడ్డి అనే వ్యక్తి దాడి చేసి గాయపరిచినట్లు సమాచారం. ఈ ఘటనతో స్థానిక న్యాయవాదుల్లో ఆందోళన నెలకొంది. న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు తులసీరామ్ సహా పలువురు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
సత్యసాయి: కదిరి పట్టణంలో వేసవి కాలంలో నీటి ఎద్దడి లేకుండా తక్షణం చేపట్టాల్సిన పనులపై ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్, RWS అధికారులతో గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నీటి ఎద్దడిని నివారించేందుకు అవసరమైన కీలక పనుల ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని తెలిపారు.