ADB: మహిళలు స్వయం ఉపాధి పొందుతూ ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని డీఆర్డీవో ఏపీడీ గోవిందరావు పిలుపునిచ్చారు. బజార్హతనూర్ మండలం కొలంగూడలో పీవీటీజీ గిరిజన కుటుంబాలకు భరోసానిచ్చేందుకు నెల రోజులుగా నిర్వహించిన వెదురు వస్తువుల తయారీ, కుట్టు శిక్షణ కార్యక్రమం ముగిసింది. ఈ సందర్భంగా శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు ఆయన సర్టిఫికేట్లను అందజేశారు.