NTR: పెనుగంచిప్రోలు నిన్న కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గురువారం పరిశీలించారు. అనంతరం బాధిత రైతులకు మాట్లాడి పంట నష్ట తీవ్రతను అడిగి తెలుసుకున్నారు. నష్టపోయిన ప్రతి రైతుకు ప్రభుత్వం తరఫున సరైన నష్టపరిహారం అందేలా కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
కోనసీమ: ర్యాలి దేవస్థానంలో శ్రీ జగన్మోహిని కేశవ స్వామి దివ్య కళ్యాణ మహోత్సవాల పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమం గురువారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పాల్గొని పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్ మెర్ల నాగేశ్వరరావు, ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
E.G: రాజమండ్రి స్థానిక బొమ్మూరు కలెక్టర్ కార్యాలయంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలలో MLA గోరంట్ల బుచ్చయ్య చౌదరి, JC మెగా స్వరూప్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలుగు ప్రజలందరికీ శ్రీ పరాభవ నామ సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేశారు. అందరి జీవితాల్లో వెలుగులు నిండాలని ఆయన ఆకాంక్షించారు.
BPT: చీరాల టీడీపీ ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య, నియోజకవర్గ అధికార ప్రతినిధి మహేంద్ర నాథ్‌లను గురువారం తెలుగు యువత అధ్యక్షులు దోగిపర్తి బాలకృష్ణ కలిశారు. పార్టీ సేవా కార్యక్రమాలు, జరుగుతున్న అభివృద్ధిని గురించి ప్రజలకు తెలియజేస్తున్న విధానాన్ని ఆయన ఎమ్మెల్యే కొండయ్యకు వివరించారు. అనంతరం వారిరువురికి ఉగాది నామ శుభాకాంక్షలు తెలియజేశారు.
NLG: తిరుమలగిరి సాగర్(మం) బోగ్యతండాలో ట్రాన్స్ ఫార్మర్ కాలిపోయినా అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు. గ్రామంలో ట్రాన్స్ ఫార్మర్ లేకపోవడంతో కరెంట్ సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు. మంచి నీటి సరఫరా అంతంత మాత్రమే అని, కరెంట్ సమస్య వల్ల సరఫరా మరింత తగ్గి నీటి కోసం అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
VSP: పద్మనాభం మండలం పొట్నూరు గ్రామానికి చెందిన ముద్దాడ శ్రియాన్ సత్తా చాటాడు. మొన్నవచ్చిన సైనిక్ స్కూల్ ఫలితాల్లో సదరు విద్యార్థి ఎన్నికయ్యాడు. అయితే, నిన్న విడుదలైన నవోదయ ఫలితాల్లో కూడా మెరిశాడు. మొత్తం వంద మార్కులకు గానూ 86.25 మార్కులు సాధించి 399వ ర్యాంక్ కైవసం చేసుకున్నాడు. దీంతో శ్రియాన్ తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
JN: దేవరుప్పుల మండలంలోని కామారెడ్డి గూడెంలో ఉగాది పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ చింత రవి ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ పెద్దలు, ప్రజలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఉగాది పండుగ ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలని సర్పంచ్ రవి ఆకాంక్షించారు.
SRCL: ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామంలో ముస్లిం మహిళలకు తోఫా పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మార్కెట్ కమిటీ ఛైర్మన్ షేక్ సబేర బేగం గౌస్ చేతుల మీదుగా ఈద్ ముబారక్ ఈద్ కా తోఫాలో భాగంగా ముస్లిం పేద మహిళలకు చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంజాన్ కానుకగా అందజేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో నారాయణపూర్ ఉప సర్పంచ్ మధు సూధన్ పాల్గొన్నారు.
విజయనగరంలోని కంటోన్మెంట్ దండుమారెమ్మ దేవాలయంలో ఈనెల 19 నుంచి 24 వరకు ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఎస్పీ ఏ.ఆర్.దామోదర్ గురువారం తెలిపారు. ఉత్సవాల ప్రారంభంలో ఎస్పీ పాల్గొని, జ్యోతి ప్రజ్వలనలతో ప్రత్యేక పూజలు నిర్వహించి, ఉత్సవాలను ప్రారంభించారు. ఈ ఉత్సవాలకి ఎస్పీతో పాటు, అదనపు ఎస్పీ పాల్గొన్నారు.
JGL: జిల్లా కేంద్రంలోని స్థానిక చారిత్రాత్మక గుడికోట శివాలయంలో పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదిన వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయంలో శివునికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. ఆలయ మండపంలో ఏర్పాటు చేసిన పంచాంగ శ్రవణ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ కట్కం రవీందర్, కౌన్సిలర్లు, ఆలయ ధర్మకర్తలు పాల్గొన్నారు. ఆలయ సిద్ధాంతి ఈ సంవత్సర ఫలితాలను భక్తులకు తెలిపారు.
HYD: రవీంద్రభారతిలో ఉగాది వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాదా బైనామా భూముల సమస్యకు త్వరలో పరిష్కారం చూపుతామని ప్రకటించారు. రైతు భరోసా, రుణమాఫీ, ఉచిత విద్యుత్ వంటి పథకాలతో రైతును బలోపేతం చేస్తున్నామని తెలిపారు. ఈనెల 22న రైతు భరోసా అందజేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పాల్గొన్నారు.
NDL: ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘మన మిత్ర’ వాట్సాప్ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కొత్తపల్లి తహసీల్దార్ ఉమారాణి ఇవాళ సూచించారు. ఈ సేవల ద్వారా ధ్రువీకరణ పత్రాలు, RTC, విద్యుత్, రెవెన్యూ, హెల్త్ కార్డులు సహా 160కు పైగా సేవలను ఇంటి నుంచే పొందవచ్చన్నారు. 95523 00009 నెంబర్‌కు ‘హాయ్’ మెసేజ్ పంపి అవసరమైన శాఖను ఎంపిక చేసుకుని, సమాచారం పొందవచ్చని పేర్కొన్నారు.
BDK: పాల్వంచ పెద్దమ్మ గుడిలో భక్తులు మొక్కుబడిగా సమర్పించిన కానుకల హుండీ లెక్కింపు శుక్రవారం ఉదయం 8 గంటలకు దేవాలయ ఆవరణలోని శ్రీ శ్రీనివాస కళ్యాణ మండపంలో ప్రారంభమవుతుంది. OCT 9, 2025 నుంచి మార్చి 19, 2026 వరకు భక్తుల ద్వారా వచ్చిన మొత్తాన్ని లెక్కించడం జరుగుతుందని ఆలయ ఈవో రజిని కుమారి తెలిపారు. ఈ లెక్కింపు కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్ బాలినేని నాగేశ్వరరావు, ధర్మకర్తలు ప్రకటించారు.
ADB: మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెట్ కల్వకుంట్ల తారక రామారావును బోథ్ MLA అనిల్ జాదవ్ హైదరాబాదులో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఆయనను శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం జిల్లాలోని తాజా రాజకీయాలు, పలు అంశాలపై చర్చించినట్లు MLA పేర్కొన్నారు.
KMR: జుక్కల్ మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలకు రేపు కలెక్టర్ విచ్చేస్తున్నట్లు ప్రిన్సిపాల్ మోహన్ రెడ్డి తెలిపారు. కళాశాలలో ఏర్పాటు చేసిన ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్(IFP) ప్రారంభోత్సవానికి ఉదయం 10:30 గంటలకు ఆయన హాజరుకానున్నారు. ఈ విద్యా సంబంధిత కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొంటారని తెలిపారు.