• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

అటవీ శాఖ అవనిగడ్డ రేంజ్ అధికారిగా కే. కుమార్

కృష్ణా: అటవీ శాఖ అవనిగడ్డ రేంజ్ అధికారిగా కే. కుమార్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా అవనిగడ్డలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాదును మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు. కొద్దిసేపు వారితో సమావేశమై తమ శాఖ ద్వారా నిర్వహిస్తున్న కార్యక్రమాలు వివరించారు. ఈ కార్యక్రమంలో అటవీశాఖ సెక్షన్ అధికారిణి నాగమణి, ఎఫ్.బీ.వో సత్యనారాయణ పాల్గొన్నారు.

March 20, 2026 / 07:45 PM IST

ముస్లిం సోదరులకు ఎస్పీ రంజాన్ శుభాకాంక్షలు

సత్యసాయి: రంజాన్ పర్వదినం పురస్కరించుకుని శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ ముస్లిం సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ శాంతి, సహనం, దాతృత్వానికి ప్రతీక అని పేర్కొన్నారు. జిల్లాలో వేడుకలు ప్రశాంతంగా, ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. మసీదులు, ప్రార్థనా స్థలాల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని పోలీసులను ఆదేశించారు.

March 20, 2026 / 07:44 PM IST

‘మైనారిటీలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది’

SKLM: రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో శుక్రవారం పేద ముస్లింలకు రంజాన్ తోఫాను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు సనపల అన్నాజీరావు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రంజాన్ పర్వదినం సహనానికి, సేవా భావానికి ప్రతీక అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ మైనారిటీల సంక్షేమానికి అండగా ఉంటుందని అన్నారు.

March 20, 2026 / 07:43 PM IST

రేషన్ కార్డున్న వాళ్లకే ‘ఇందిరమ్మ బీమా’: రేవంత్

TG: రాష్ట్రంలో రేషన్ కార్డు ఉన్న వాళ్లందరికీ ఇందిరమ్మ బీమా పథకాన్ని వర్తింపజేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. కుటుంబ పెద్ద లేదా సంపాదించే వ్యక్తికి ఏదైనా ప్రమాదం జరిగితే ఆ కుటుంబం రోడ్డున పడకుండా చూడటమే ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం. ఈ పథకానికి కావాల్సిన బీమా ప్రీమియం మొత్తాన్ని లబ్ధిదారుల తరపున ప్రభుత్వమే నేరుగా బీమా కంపెనీలకు చెల్లిస్తుంది.

March 20, 2026 / 07:42 PM IST

రెడ్డి సంఘం అధ్యక్షునిగా సుధాకర్ రెడ్డి

SRCL: ఎల్లారెడ్డిపేట మండల రెడ్డి సంఘం అధ్యక్షునిగా కుంబాల సుధాకర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్బంగా కుంభాల సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. మండలంలో సంఘ అభివృద్ధికి పాటు పడతానని సంఘం పురోభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మండలములోని అన్ని గ్రామాల రెడ్డి కుల బాంధవులకు, తన ఎన్నికకు సహకరించిన వారందరికీ సుధాకర్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు

March 20, 2026 / 07:41 PM IST

రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ

ప్రకాశం: రంజాన్ పర్వదినం సందర్భంగా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి ముస్లిం సోదర, సోదరీమణులందరికీ ఈద్ ముబారక్ తెలిపారు. రంజాన్ మాసం ఉపవాసం, దైవారాధన, దానధర్మాలు, మానవ సేవకు ప్రతీక అని పేర్కొన్నారు. ఈ పవిత్ర పండుగ ఉమ్మడి జిల్లా ప్రజలకు సుఖసంతోషాలు, శాంతి, సౌభ్రాతృత్వం తీసుకురావాలని ఆకాంక్షించారు.

March 20, 2026 / 07:40 PM IST

IPL-2026 గేమ్ ఛేంజర్ అతడే: మాజీ క్రికెటర్

IPL-202 త్వరలో ప్రారంభంకానున్న వేల టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మపై ప్రశంసలు కురిపించాడు. ఈ సారి రాజస్థాన్ రాయల్స్ సంచలనం వైభవ్ సూర్యవంశీ కంటే కూడా అభిషేక్ ఈ సారి ఐపీఎల్ సీజన్‌లో ‘గేమ్ ఛేంజర్’ అవుతాడని అభిప్రాయపడ్డాడు. ఈ సీజన్ అభిషేక్‌కు టర్నింగ్ పాయింట్ కావాలి అన్నాడు.

March 20, 2026 / 07:40 PM IST

గిన్నిస్ వరల్డ్ రికార్డు కొట్టిన విశాఖ వాసి 

AP: ఏపీకి చెందిన వ్యక్తి చరిత్ర సృష్టించారు. విశాఖపట్నంకు చెందిన భూపతిరాజు అన్మిష్ వర్మ ప్రపంచంలోనే అత్యంత వేగంగా ‘సెవెన్ వోల్కానిక్ సమ్మిట్స్’ అధిరోహించిన వ్యక్తిగా గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లోకెక్కారు. అన్మిష్ వర్మ ఈ సాహసయాత్రను కేవలం 92 రోజుల 4 గంటల 45 నిమిషాల వ్యవధిలో పూర్తి చేశాడు.

March 20, 2026 / 07:37 PM IST

సీఎం సహాయనిధి పంపిణీ చేసిన ఎమ్మెల్యే

VSP: సీఎం సహాయనిధి నుంచి విడుదలైన చెక్కులను భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీినవాసరావు శుక్రవారం పంపిణీ చేశారు. ఆనందపురం, పద్మనాభం ప్రాంతాలకు చెందిన 9 మందికి ఈ ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం పేదలకు అండగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం సీఎం సహాయనిధి ఎంతో వేగంగా అందుతోందన్నారు.

March 20, 2026 / 07:36 PM IST

మోతే గ్రామంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు

NZB: రంజాన్ పండుగను పురస్కరించుకొని మోతే గ్రామంలో ఉప సర్పంచ్ పరంజ్యోతి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అన్ని మతాలకు చెందిన ప్రజలు పాల్గొని మత సామరస్యాన్ని చాటారు. ఈ సందర్భంగా పరంజ్యోతి కుమార్ మాట్లాడుతూ.. భారతదేశం ఒక లౌకిక దేశమని, ఇక్కడ ప్రతి మతానికి సమాన గౌరవం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రఫీ, సలీం, జయవర్ధన్, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.

March 20, 2026 / 07:35 PM IST

లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలి: కలెక్టర్

ELR: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన వివిధ శాఖల లక్ష్యాలను ఈనెల 25లోగా నూరుశాతం పూర్తి చేయాలని కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. ఏలూరు కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. డ్వాక్రా సంఘాల రుణ లక్ష్యాలతో పాటు, ఆ నిధులతో ఉపాధి యూనిట్ల స్థాపనపై దృష్టి సారించాలన్నారు.

March 20, 2026 / 07:35 PM IST

బేతపల్లిలో పర్యటించిన ఎమ్మెల్యే వీరుపాక్షి

KRNL: దేవనకొండ(మం) బేతపల్లిలో ఎమ్మెల్యే వీరుపాక్షి శుక్రవారం పర్యటించారు. గ్రామ ప్రజలతో ముఖాముఖి మాట్లాడి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం సుంకులమ్మ అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ, గ్రామస్థులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

March 20, 2026 / 07:35 PM IST

కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎస్పీ

NRPT: జిల్లా నూతన కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన ప్రతీక్ జైన్‌ను ఎస్పీ డాక్టర్ వినీత్ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టర్ ఛాంబర్‌లో ఆయనకు పూలమొక్క అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్, రెవెన్యూ శాఖలు సమన్వయంతో పనిచేస్తూ, జిల్లా అభివృద్ధికి సమష్టిగా కృషి చేద్దామని వారు ఆకాంక్షించారు.

March 20, 2026 / 07:33 PM IST

వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించిన మంత్రి బీసీ

NDL: అవుకు మండలం కునుకుంట్ల గ్రామంలో ఉన్న కంబగిరి స్వామి ఆలయంలో ఇవాళ రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పర్యటించారు. గ్రామానికి చేరుకున్న మంత్రికి స్థానిక టీడీపీ నాయకులు పూలతో స్వాగతం పలికారు. అనంతరం గ్రామంలో రూ. 10 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్‌ను మంత్రి ఘనంగా ప్రారంభించారు.

March 20, 2026 / 07:32 PM IST

ఘట్‌కేసర్ ప్రాంతం వైపు రియల్ చూపు..!

MDCL: ఘట్‌కేసర్ ప్రాంతం వైపు రియల్ ఎస్టేట్ గత 3 నెలలుగా పుంజుకుంటున్నట్లుగా ‘రేరాసేమ్’ సర్వేలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఉప్పల్ నుంచి నారపల్లి మార్గంలో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం కొనసాగుతుండగా, ఇది పూర్తయితే ఘట్‌కేసర్ నుంచి హైటెక్ సిటీ వెళ్లడం కేవలం గంటన్నర సమయం పడుతుందని, ఈ నేపథ్యంలో ఈ ప్రాంత నివాసితులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొంది.

March 20, 2026 / 07:32 PM IST