ELR: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన వివిధ శాఖల లక్ష్యాలను ఈనెల 25లోగా నూరుశాతం పూర్తి చేయాలని కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. ఏలూరు కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. డ్వాక్రా సంఘాల రుణ లక్ష్యాలతో పాటు, ఆ నిధులతో ఉపాధి యూనిట్ల స్థాపనపై దృష్టి సారించాలన్నారు.