NDL: అవుకు మండలం కునుకుంట్ల గ్రామంలో ఉన్న కంబగిరి స్వామి ఆలయంలో ఇవాళ రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పర్యటించారు. గ్రామానికి చేరుకున్న మంత్రికి స్థానిక టీడీపీ నాయకులు పూలతో స్వాగతం పలికారు. అనంతరం గ్రామంలో రూ. 10 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ను మంత్రి ఘనంగా ప్రారంభించారు.