VZM: చీపురుపల్లి మేజర్ పంచాయతీ EO ఝాన్సీ రాణి తన సిబ్బందితో కలసి శనివారం పంచాయతీలో ఇంటి పన్ను చెల్లించిన వారికి ఆన్లైన్ రసీదులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పంచాయతీకి ఇంటి పన్నులు చెల్లించి అభివృద్ధికి సహకరించాలని ప్రజలను కోరారు. అనంతరం పంచాయతీ సిబ్బంది చేపడుతున్న రసీదుల పంపిణీని స్దానిక MPDO సురేష్ పర్యవేక్షించారు.