• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

అలివేలు మంగమ్మ ఆలయ హుండీ లెక్కింపు

MBNR: మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి అనుబంధమైన అలివేలు మంగమ్మ ఆలయంలో శనివారం హుండీ లెక్కింపు నిర్వహించారు. హుండీ ద్వారా మొత్తం రూ.10,09,442 ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త అలహరి మధుసూదన్ కుమార్, ఈవో శ్రీనివాస రాజు, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.

March 7, 2026 / 07:02 PM IST

కామారెడ్డి పోలీస్ ‘ఆపరేషన్ కవచ్’ సక్సెస్!

కామారెడ్డి జిల్లాలో నేరాల నియంత్రణే లక్ష్యంగా అమలు చేస్తున్న ‘ఆపరేషన్ కవచ్’ అద్భుత ఫలితాలను ఇస్తోంది. పోలీసులు రాత్రిపూట గస్తీని ముమ్మరం చేయడంతో వరుస దొంగతనాలకు చెక్ పడటమే కాకుండా, అంతర్రాష్ట్ర ముఠాలు సైతం పట్టుబడుతున్నాయి. ఇటీవల రామారెడ్డి, బాన్సువాడ, బిచ్కుంద ప్రాంతాల్లో జరిగిన మూడు వేర్వేరు దొంగతనాల కేసులను పకడ్భందీగా ఛేదించారు.

March 7, 2026 / 07:02 PM IST

నిరుపయోగంగా మారిన సంచార వైద్యశాల వాహనం

GDWL: జిల్లాలో గ్రామీణ ప్రజలకు వైద్య సేవలు అందించడానికి గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంచార వైద్యశాల వాహనం నిర్వహణ లేక నిరుపయోగంగా మారింది. అయిజ మండల పరిషత్ కార్యాలయ సమీపంలో వాహనం తుప్పుపట్టే స్థాయికి చేరుకుంది. నెటిజన్లు వాహనాన్ని తిరిగి అందుబాటులోకి తీసుకు వెళ్లి గ్రామీణులకు వైద్య సేవలు అందించాలని కోరుతున్నారు.

March 7, 2026 / 07:02 PM IST

సబ్ స్టేషన్ ముందు గ్రామస్తుల ధర్నా

SDPT: కరెంట్ సమస్యపై గునుకుల కొండాపూర్ సబ్‌స్టేషన్ ముందు గ్రామస్తులు ధర్నా నిర్వహించారు. కొండాపూర్, చీమలకుంటపల్లీ సర్పంచ్‌లు సొల్లు అజయ్ వర్మ, జంగిడి ప్రకాష్ పాల్గొన్నారు. రెండు రోజులుగా కరెంట్ లేక తాగునీరు, వ్యవసాయ పనులకు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నామని అజయ్ వర్మ తెలిపారు. గుండ్లపల్లి నుంచి గునుకుల కొండాపూర్ వరకు ఎక్స్‌ప్రెస్ లైన్ ఏర్పాటు చేయాలన్నారు.

March 7, 2026 / 07:02 PM IST

కుక్కల దాడిలో వ్యక్తికి తీవ్ర గాయాలు

NZB: రుద్రూర్‌లో శనివారం కుక్కల దాడిలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. గ్రామాల్లో వీధికుక్కల స్వైర విహారంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. రాత్రివేళల్లో గుంపులుగా వచ్చి రోడ్లపై నుంచి వెళ్లే వారిపై దాడులు చేస్తుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు స్పందించి కుక్కల బెడద నుంచి రక్షించాలన్నారు.

March 7, 2026 / 07:02 PM IST

పాఠశాల ప్రాంగణంలో పరిశుభ్రత కార్యక్రమం

KNR: గన్నేరువరం మండలంలోని గుణుకులకొండాపూర్ గ్రామంలో శనివారం ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా పాఠశాల ప్రాంగణంలో పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్ సొల్లు అజయ్ వర్మ ఆధ్వర్యంలో జరిగింది. ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి, ఎంపీవో, పాఠశాల హెచ్ఎం, గ్రామపంచాయతీ కార్యదర్శి, పాలకవర్గ సభ్యులు, మహిళా సంఘ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

March 7, 2026 / 07:01 PM IST

వన్యప్రాణులను వేటాడిన ముగ్గురిపై కేసు నమోదు

MNCL: వేమనపల్లి మండలం కేతనపల్లి శివారులోని కల్మల పేట అటవి సమీపంలో అటవీ, పోలీస్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. కరెంట్ తీగలు అమర్చి వన్యప్రాణులను వేటాడటం చట్టరీత్య నేరమని గ్రామస్థులను హెచ్చరించారు. చుక్కల దుప్పిని వేటాడిన గ్రామానికి చెందిన రాజ్ కుమార్, శ్రీకాంత్, సంతోష్‌‌లపై శనివారం వన్యప్రాణి చట్టం కింద అటవీ శాఖ కేసు నమోదు చేసింది.

March 7, 2026 / 07:01 PM IST

ఇంటింటికి మంచినీరు అందించడమే లక్ష్యం: ఎమ్మెల్యే

కోనసీమ: అమరజీవి జలధార వాటర్ గ్రిడ్ పథకంలో భాగంగా మలికిపురంలో వెంకటేశ్వర స్వామి గుడి వద్ద ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలలో ప్రధానంగా ఇచ్చిన హామీ ఇంటింటికి మంచినీరు అందిస్తామని ఆ హామీ నెరవేరుతున్నందుకు సంతోషంగా ఉందని అన్నారు. గ్రామాలలో ఇంటింటికి మంచినీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.

March 7, 2026 / 07:01 PM IST

చిట్యాల పీహెచ్సీలో ఉచిత వైద్య పరీక్షలు

NLG: ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా శనివారం చిట్యాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రత్యేక ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. వివిధ విభాగాల స్పెషలిస్ట్ డాక్టర్లు పాల్గొని రోగులను పరీక్షించి అవసరమైన వైద్య సేవలు అందించారు. చిట్యాల, వెలిమినేడు పీహెచ్సీల వైద్యులు ఈసం వెంకటేశ్వర్లు, సత్య నరేష్, నరసింహ, ఇతర వైద్య నిపుణులు సేవలందించారు.

March 7, 2026 / 07:00 PM IST

‘రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

ATP: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం ఉదయం 9:30 గంటలకు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు అధ్యక్షతన కళ్యాణదుర్గంలోని ప్రజావేదికలో వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా బసవతారకం ఆసుపత్రికి చెందిన 15 మంది నిపుణులతో ఉచిత క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని కోరారు.

March 7, 2026 / 07:00 PM IST

పుట్టపర్తిలో రెండో రోజు మున్సిపల్ కార్మికుల సమ్మె

సత్యసాయి: పుట్టపర్తిలోని మున్సిపల్ కార్యాలయం వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు రెండో రోజు సమ్మెను శనివారం కొనసాగించారు. మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించడం లేదని, రాష్ట్ర బడ్జెట్లో కార్మికులకు ప్రభుత్వం మొండిచేయి చూపిందని సీఐటీయూ జిల్లా కార్యదర్శి పైపల్లి గంగాధర్ పేర్కొన్నారు. సమస్యలు పరిష్కరించేంత వరకు తమ పోరాటం ఆగదన్నారు.

March 7, 2026 / 07:00 PM IST

‘అంబేద్కర్ ఆలోచన విధానాన్ని అనుసరించాలి’

E.G: అంబేద్కర్ ఆశయాలు, ఆలోచన విధానాన్ని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని జాతీయ ఎస్సీ కమిషన్ ఛైర్మన్ కిషోర్ మక్వానా పేర్కొన్నారు. శనివారం ధవళేశ్వరంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఛైర్మన్ ఆవిష్కరించారు. అంబేద్కర్‌ను రాజ్యాంగ నిర్మాతగానో, దళిత నాయకుడుగానో, ప్రపంచ నేతగా గుర్తించాల్సిన అవసరం ఉందని తెలిపారు.

March 7, 2026 / 07:00 PM IST

కలక్టర్‌ను కలిసిన సివిల్స్ ర్యాంకర్

VZM: సివిల్ సర్వీస్ పరీక్షలలో 640 ర్యాంకును సాధించి జిల్లాకు పేరు ప్రతిష్టలు తెచ్చిన పల్లి ప్రమోద్ విష్ణు, కలక్టర్ ఎస్.రామసుందర్ రెడ్డిని శనివారం కలక్టర్ క్యాంపు ఆఫీసులో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛాన్ని అందజేశారు. విష్ణు ప్రస్తుతం సికింద్రాబాద్ ఎయిర్ పోర్టులో ఇమ్మిగ్రేషన్ అధికారిగా పని చేస్తున్నారు.

March 7, 2026 / 07:00 PM IST

‘తలసరి ఆదాయం పెంపుపై దృష్టి పెట్టాలి’

కర్నూలు: కలెక్టర్ సిరి అధికారులతో ఇవాళ సమావేశం నిర్వహించి జిల్లాలో తలసరి ఆదాయం పెంచడంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. స్థిరమైన అభివృద్ధి లక్ష్యాల్లో మరింత పురోగతి సాధించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించి ప్రభుత్వ శాఖల పనితీరును మెరుగుపరచాలని అధికారులకు తెలిపారు.

March 7, 2026 / 06:58 PM IST

‘కళాశాల అభివృద్ధిలో ప్రిన్సిపాల్ సేవలు అభినందనీయం’

NDL: ఆత్మకూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల అభివృద్ధిలో ప్రిన్సిపాల్ శ్రీనివాస్ చేస్తున్న కృషి అభినందనీయమని జనసేన యువ నాయకులు అరుణ్ కుమార్, ప్రదీప్ కుమార్ ఇవాళ తెలిపారు. కళాశాలలో విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన విద్య అందిస్తూ విద్యా ప్రమాణాలను మెరుగుపరుస్తున్నారని కొనియాడారు. భవిష్యత్తులో కూడా కళాశాల మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.

March 7, 2026 / 06:57 PM IST