• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

తర్బూజ్ మామకు.. తెగ డిమాండ్..!

ఎండాకాలం చల్లదనం కోసం పానీయాలు సేవించటం కామన్. వంటికి చలువచేసే తర్బూజ్ సైతం తెగ తినేస్తుంటాం. దీంతో ఎండాకాలం ఫుల్ డిమాండ్ ఏర్పడుతుంది. ఫిబ్రవరిలోనే HYD శివారు బాటసింగారం మార్కెట్‌లో డిమాండ్ షురూ అయింది. మొన్నటి వరకు కిలో రూ.30 పలుకగా ఇవాళ రూ. 35 నుంచి రూ. 40 వరకు చేరింది. ఇక మార్చి నెలలో తర్బూజ్ మామకు మరింత డిమాండ్ ఏర్పడనుంది.

February 28, 2026 / 10:03 AM IST

భక్తుల మనోభావాలను కాంగ్రెస్ దెబ్బతీస్తోంది: హరీష్ రావు

TG: మఠాన్ని కూల్చడమంటే భక్తుల మనోభావాలు దెబ్బతీయడమే అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. హైదరాబాద్ కోకపేట నియోపోలిస్‌లోని విశాఖ శారద పీఠాన్ని హరీష్ రావు పరిశీలించారు. కేసీఆర్ అద్భుతమైన ఆలయాలు నిర్మిస్తే ఈ ప్రభుత్వం అన్నీ కూల్చుతోందని మండిపడ్డారు. ఖమ్మంలో పేదలు ఉంటున్న భూములను స్వాధీనం చేసుకుంటున్నారని విమర్శించారు.

February 28, 2026 / 10:02 AM IST

గ్రామాలలో పల్లెనిద్ర కార్యక్రమం

CTR: జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ దూడి ఆదేశాల మేరకు, అదనపు ఎస్పీ శ్రీ రాజశేఖర్ పర్యవేక్షణలో జిల్లాలోని గ్రామాలలో “పల్లె నిద్ర” కార్యక్రమాన్ని నిర్వహించారు. పోలీసులు గ్రామస్తులతో సంభాషించి ధైర్యం-స్పర్శ, మహిళలు మరియు పిల్లలపై నేరాలు, సైబర్ నేరాల జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. మాదకద్రవ్యాల దుర్వినియోగం, బాల్య వివాహాల నివారణపై మార్గ నిర్దేశం చేశారు.

February 28, 2026 / 10:02 AM IST

సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం: కవింద్ర

BHPL: జిల్లా కేంద్రంలోని సింగరేణి GM కార్యాలయంలో ప్రాతినిధ్య సంఘం ఐఎన్‌టీయూసీ యూనియన్‌తో ఏరియా లెవెల్ స్ట్రక్చర్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఏరియా ఇన్‌ఛార్జి జనరల్ మేనేజర్ కవింద్ర హాజరై మాట్లాడుతూ.. సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారానికి పూర్తి కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘం నేతలు తదితరులు ఉన్నారు.

February 28, 2026 / 10:02 AM IST

ముగ్గురు ఉద్యోగుల సస్పెండ్

ప్రకాశం: అర్ధవీడు మండలంలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు టెక్నికల్ అసిస్టెంట్లతోపాటు,గతంలో ఈసీగా విధులు నిర్వహిస్తూ ప్రస్తుతం మార్కాపురం కార్యాలయంలో ఈసీగా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగి సస్పెండ్ అయ్యారు. అర్ధవీడులో మొక్కలు లేకుండానే బిల్లులు చేశారని లోకాయుక్తకు ఫిర్యాదు మేరకు, విచారణ చేపట్టిన అధికారులు భారీ అవినీతి బయటపడడంతో వారిని సస్పెండ్ చేశారు

February 28, 2026 / 10:01 AM IST

అక్రిడేషన్ల గడువు పెంపు: డిపిఆర్‌వో

WNP: జిల్లాలో ఆయా మీడియాలలో పనిచేస్తున్న జర్నలిస్ట్‌ల అక్రిడేషన్ కాలపరిమితిని ప్రభుత్వం రెండు నెలలు పొడిగించినట్లు డిపిఆర్‌వో సీతారాం తెలిపారు. నేటితో ముగియనున్న కాలపరిమితిని ఏప్రిల్ 30వరకు పొడిగించినట్లు పేర్కొన్నారు. అక్రిడేషన్ కలిగిన జర్నలిస్ట్‌లు జిల్లా పౌరసంబంధాల శాఖ కార్యాలయంలో శనివారం ఉదయం 10:30 నుంచి కార్డులపై స్టిక్కర్లు వేయించుకోవాలని సూచించారు.

February 28, 2026 / 10:01 AM IST

తాగునీటి శుద్ధి కేంద్రాన్ని పరిశీలించిన కమిషనర్

ATP: గుంతకల్లు మున్సిపాలిటీలోని తాగునీటి శుద్ధి కేంద్రాన్ని కమిషనర్ లక్ష్మీదేవి శనివారం ఆకస్మికంగా పరిశీలించారు. ఆమె తాగునీటి శుద్ధి కేంద్రంలోని యంత్రాల పనితీరు, నీటి నాణ్యత, పారిశుధ్య పరిస్థితులను తనిఖీ చేసి ప్రజలకు నిరంతరం సురక్షితమైన తాగునీరు అందించాలని సిబ్బందిని ఆదేశించారు. తాగునీటి శుద్ధి ప్రక్రియ సక్రమంగా జరుగుతోందో లేదో చూడాలన్నారు.

February 28, 2026 / 10:00 AM IST

ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రసవం

ASR: కొయ్యూరు మండలం చల్దిగెడ్డకు చెందిన నాగులమ్మ అనే నిండు గర్భిణికి శనివారం పురుటి నొప్పులు వచ్చాయి. కుటుంబ సభ్యులు ఇచ్చిన సమాచారంతో 108 వాహనం రహదారి సౌకర్యం లేక గ్రామ సమీపానికి చేరుకుంది. కుటుంబీకులు గర్భిణీని మోసుకొని వచ్చి, అంబులెన్సులో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో నొప్పులు ఎక్కువయ్యాయి. దీంతో ఈఎంటీ ఈశ్వరరావు, పైలెట్ హరి ప్రసాద్ ప్రసవం చేశారు

February 28, 2026 / 10:00 AM IST

జిల్లాలో 58.70 పింఛన్ల పంపిణీ పూర్తి: DRDA

అనకాపల్లి జిల్లాలో ఉదయం 8.52 గంటల వరకు 58.70 శాతం పింఛన్ల పంపిణీ పూర్తయినట్లు డీఆర్డీఏ పీడీ శచీదేవి తెలిపారు. 76.38 శాతంతో నర్సీపట్నం మండలం ముందంజలో ఉందన్నారు. 47.8 శాతంతో పాయకరావుపేట మండలం చివర స్థానంలో ఉందన్నారు. ఉదయం ఏడు గంటలకు ప్రారంభించిన పింఛన్లు సాయంత్రంలోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు.

February 28, 2026 / 10:00 AM IST

సైనిక్ ప్రవేశ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు

VZM: ALL INDIA SAINIK EXAMలో ఎస్.కోట మండలం దొగ్గపేట ఎంపీపీ పాఠశాలలో చదువుతున్న 5వ తరగతి విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచినట్లు HM బీ సురేష్ శనివారం తెలిపారు. వజ్రపు శశి కుమార్ 267/300, చుక్కా శశాంక్ 241/300, తొత్తడి రిషిత 227/300 మార్కులు సాధించినట్లు తెలిపారు. వీరి ప్రతిభకు కారణమైన ఉపాధ్యాయులను విద్యార్థులు తల్లిదండ్రులు, స్థానికులు అభినందించారు.

February 28, 2026 / 10:00 AM IST

మగ బిడ్డను చెత్త దిబ్బలో పడేసిన కసాయి తల్లి

సత్యసాయి :సోమందేపల్లి మండలం నడింపల్లి గ్రామంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది.అప్పుడే పుట్టిన మగ బిడ్డను ఓ తల్లి చెత్త దిబ్బలో పడేసిన ఘటన కలకలం రేపింది.శిశువు ఏడుపు వినిపించడంతో అప్రమత్తమైన గ్రామస్తులు అక్కడికి చేరుకుని,చెత్త దిబ్బలో పడి ఉన్న బాబును గుర్తించి హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

February 28, 2026 / 10:00 AM IST

నిద్రమత్తులో ప్రమాదం.. వ్యక్తి మృతి

E.G: దేవరపల్లి మండలం ఎర్నగూడెం జాతీయ రహదారిపై  శనివారం జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. విజయనగరం జిల్లా గజపతినగరం మండలం పాతబగ్గానికి చెందిన కొందరు గుడివాడ మినప చేలు తీత కోసం వెళుతుండగా లారీ పైనుంచి ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు కిందపడ్డాడు. తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కిందపడే సమయంలో సదరు వ్యక్తి నిద్ర మత్తులో ఉన్నట్లు సమాచారం.

February 28, 2026 / 10:00 AM IST

పిఠాపురంలో ముందుగానే పింఛన్ల పంపిణీ కార్యక్రమం

KKD: పిఠాపురం నియోజకవర్గంలో మార్చి నెల పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. మార్చి 1 ఆదివారం కావడంతో లబ్ధిదారులకు అసౌకర్యం కలగకుండా ఫిబ్రవరి 28 శనివారం నుంచే పింఛన్లు అందజేస్తున్నారు. గ్రామాలు, వార్డుల్లో వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి నగదు పంపిణీ చేస్తున్నారు. వృద్ధులు, వికలాంగులకు సకాలంలో పింఛన్ అందేలా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

February 28, 2026 / 10:00 AM IST

పవన్ ఆఫీస్‌లోకి వ్యక్తి చొరబాటు.. ఐదుగురిపై చర్యలు

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్యాలయంలోకి వ్యక్తి చొరబాటు ఘటనపై అధికారులు చర్యలు తీసుకున్నారు. భద్రతా విభాగం నుంచి ఐదుగురిని మాతృశాఖకు పంపారు. రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ బి.పెంటారావుతోపాటు నలుగురు కానిస్టేబుళ్లను మాతృవిభాగంతో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. ప్రాథమిక విచారణలో భద్రతా వైఫల్యాలు రుజువుకావటంతో చర్యలు తీసుకున్నారు.

February 28, 2026 / 09:59 AM IST

పాలమూరు యూనివర్సిటీలో 100 రోజుల ప్లాన్

MBNR: పాలమూరు యూనివర్సిటీలో అకాడమిక్ ఆడిట్ సెల్ ఆధ్వర్యంలో ‘100 రోజుల యాక్షన్ ప్లాన్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. రిజిస్ట్రార్ ఆచార్య పి.రమేష్ బాబు, విద్యార్థుల వృత్తి నైపుణ్యాలను పెంపొందించి పరిశ్రమలకు అనుగుణంగా తీర్చిదిద్దడమే లక్ష్యం అని చెప్పారు. డాక్టర్ ఎన్.చంద్రకిరణ్, అధ్యాపకులు పాల్గొన్నారు.

February 28, 2026 / 09:59 AM IST