GDWL: జిల్లాలో సీడ్ పత్తి రైతులకు రావాల్సిన బకాయిలు చెల్లించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత, NHPS జిల్లా చైర్మన్ రంజిత్ కుమార్ డిమాండ్ చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లో రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డిని కలిగి వినతిపత్రం అందజేశారు. హామీ ఇచ్చిన 80% పేమెంట్లు ఇంకా పూర్తవలేదని, తక్షణమే చర్య తీసుకోవాలని కోరారు.
MNCL: లక్షెట్టిపేట మండలంలోని వివిధ గ్రామాలలో నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యులు వివిధ చట్టాలపై అవగాహన పెంచుకున్నారని స్థానిక ఎంపీడీవో సరోజ తెలిపారు. శనివారం ఆమె మాట్లాడుతూ.. నూతన వార్డు సభ్యులకు ఐదు రోజులపాటు శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా వారికి పంచాయతీరాజ్ చట్టం, గ్రామపంచాయతీ విధులు, నిధులు, బాధ్యతల గురించి వివరించామన్నారు.
ప్రకాశం: కనిగిరి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో శనివారం ఉదయం 11 గంటలకు మున్సిపల్ కౌన్సిల్ హాల్లో ప్రత్యేక సమావేశం జరగనుంది. మున్సిపల్ కమిషనర్ శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం, మున్సిపల్ ఛైర్మన్ అబ్దుల్ గఫార్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో వైస్ ఛైర్మన్లు, పాలక సభ్యులు అధికారులు పాల్గొంటారని అన్నారు.
ELR: పెదవేగి అంబేడ్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతి, ఇంటర్ మొదటి ఏడాది ప్రవేశాలకు మార్చి 1న పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ రమేష్ బాబు తెలిపారు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు నిర్ణీత సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
TG: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన భూభారతి స్కాం యాదాద్రి భువనగిరి జిల్లాలో సైతం పెద్ద ఎత్తున ప్రకంపనలు సృష్టించింది. ప్రభుత్వానికి చెల్లించాల్సిన రిజిస్ట్రేషన్ ఫీజులో మోసం చేశారని పలువురిని పోలీసులు రిమాండ్‌కు తరలించారు. అయితే రిజిస్ట్రేషన్ చేసే ముందు క్షుణ్ణంగా చెక్ చేయాల్సిన తహసీల్దార్లు ఎందుకు చేయలేదనే ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానం దొరకటం లేదు.
KRNL: 2026-27 సంవత్సరానికి ట్రెడ్ లైసెన్స్ ఫీజు చెల్లింపుకు నేడు చివరి తేదీగా ఉంది అని కమిషనర్ హరిప్రసాద్ శుక్రవారం తెలిపారు. ఫ్యాక్టరీ యజమానులు, వ్యాపారస్థులు ఫీజు చెల్లించి రసీదు, లైసెన్స్ ధ్రువీకరణ పత్రం తీసుకోవాలని అయన సూచించారు. తరవాత, మార్చి 1వ నుంచి 25% మరియు ఏప్రిల్ నుంచి 50% అపరాధ రుసుముతో ఫీజు చెల్లించవలసి వస్తుందని హెచ్చరించారు.
NRPT: కృష్ణ మండలంలోని గ్రామపంచాయతీ అభివృద్ధి విధివిధానాలపై ఐదు రోజుల శిక్షణ శుక్రవారం ముగిసింది. అన్ని గ్రామాల ఉపసర్పంచ్లు, వార్డు సభ్యులు పాల్గొని పంచాయతీ పాలన, నిధుల వినియోగంపై అవగాహన పొందారు. ఎంపీడీఓ, పంచాయతీ కార్యదర్శులు శిక్షణ విజయవంతం చేసిన సభ్యులను అభినందించారు.
JGL: పెగడపల్లి మండలంలోని అంగన్వాడీ కేంద్రాల్లో శుక్రవారం చిన్నారులకు చేతుల శుభ్రతపై అంగన్వాడీ టీచర్లు అవగాహన కల్పించారు. అన్నం తినే ముందు, తిన్న తర్వాత చేతులను ఎలా శుభ్రం చేసుకోవాలో చిన్నారులకు చూపిస్తూ,అవగాహన కల్పించారు. మండల ఐసిడిఎస్ సూపర్వైజర్లు మహేశ్వరి,సుభద్ర మాట్లాడుతూ.. అంగన్వాడి కేంద్రాల్లో చిన్నారులకు విద్యతో పాటు పరిశుభ్రత పై అవగాహన కల్పిస్తున్నారు.
WG: పట్టణ ప్రజలు కాచి చల్లార్చిన నీటిని తాగాలని మున్సిపల్ కమిషనర్ ఏసుబాబు సూచించారు. శుక్రవారం తాడేపల్లిగూడెం మున్సిపల్ ఆఫీసులో వాటర్ వర్క్స్ ఇంజనీరింగ్ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. రాబోయే రోజుల్లో డయేరియా వ్యాప్తి చెందే అవకాశం ఉందన్నారు. పైప్ లైన్ లీకేజీలను గుర్తించి, సరి చేయాలన్నారు. ప్రతి ఇంటి నుంచి పైపుల నుంచి నీటి నాణ్యతను సేకరిస్తామన్నారు.
KRNL: గోనెగండ్ల గ్రామ పంచాయతీ పరిధిలో ఇంటి, కొళాయి, వాణిజ్య పన్నులను సకాలంలో చెల్లించి, గ్రామ అభివృద్ధికి బాటలు వేయాలని పంచాయతీ సెక్రెటరీ సతీశ్ ఇవాళ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణ పంచాయతీ పోర్టల్ ద్వారా నేరుగా ఆన్‌లైన్‌లో పన్ను చెల్లింపులు చేపడుతుందన్నారు. కాబట్టి ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి మార్చి 15 లోపు పన్నులు చెల్లించి, పంచాయతీకి సహకరించాలన్నారు.
ATP: సత్యసాయి వాటర్ సప్లై వర్కర్స్ యూనియన్ ప్రతినిధులు అనంతపురం జిల్లా కలెక్టర్ ఆనంద్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. యూనియన్ జిల్లా అధ్యక్షుడు చింతకాయల నరేష్ ఆధ్వర్యంలో పెండింగ్ బిల్లుల సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కలెక్టర్, వీలైనంత త్వరగా బిల్లులు మంజూరయ్యేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
HNK: DGP పిలుపునిచ్చిన ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో భాగంగా మడికొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని 45 మంది డ్రైవర్లకు CI పుల్యాల కిషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. కాజీపేట నవ దృష్టి ఆసుపత్రిలో డాక్టర్ లీలా నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో అవసరమైన వారికి ఉచిత అద్దాలు, మందులు అందజేశారు. రహదారి భద్రతలో డ్రైవర్ల ఆరోగ్యం కీలకమని అన్నారు.
GNTR: అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ శనివారం అవనిగడ్డ మండలం మోదుమూడిలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందించారు. ఒకటో తేదీ ఆదివారం వచ్చే ప్రతి నెలా ప్రభుత్వం ఒకరోజు ముందుగానే పింఛన్లు సొమ్ము పంపిణీ చేయిస్తోందని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్లు పెంచిందన్నారు.
విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి, అదితీ రావు హైదరీ నటించిన సైలెంట్ మూవీ ‘గాంధీ టాక్స్’ ఓటీటీలోకి వచ్చేసింది. JAN 30న థియేటర్‌లో విడుదలైన ఈ మూవీ ప్రేక్షకులను మెప్పించింది. వెండితెరపై మూకీ చిత్రాల యుగం ఎప్పుడో ముగిసింది. ఇలాంటి తరుణంలో ‘గాంధీ టాక్స్’ పేరుతో ఓ నిశ్శబ్ద చిత్రాన్ని దర్శకుడు కిశోర్ తెరకెక్కించారు. ఇందులో ఒక్క డైలాగ్ కూడా వినిపించదు.
KDP: సిద్ధవటం మండలంలో చిరుత పులి సంచారం స్థానికంగా భయాందోళనలు రేకెత్తిస్తోంది. కనుమలోపల్లి అటవీ బీట్ పరిధిలోని పంట పొలాల సమీపంలో చిరుత పాదముద్రలను గుర్తించినట్లు ఫారెస్ట్ రేంజ్ అధికారి ప్రసాద్ శుక్రవారం ధృవీకరించారు. మూలపల్లి, కనుమలోపల్లి గ్రామాల్లో చిరుత తిరుగుతోందని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి గుర్తిస్తామని తెలిపారు.