MDK: తూప్రాన్ పట్టణ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలకు చెందిన ఆరుగురు విద్యార్థులు నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ (NMMS)కు ఎంపికైనట్లు ఇంఛార్జ్ ప్రధానోపాధ్యాయులు ప్రభాకర్ తెలిపారు. ఇది పాఠశాలలో అమలు చేస్తున్న సమర్థవంతమైన బోధన విధానాలకు నిదర్శనమని మండల విద్యాధికారి డాక్టర్ పర్వతి సత్యనారాయణ పేర్కొన్నారు. అనంతరం విద్యార్థులను అభినందించారు.
సత్యసాయి: ధర్మవరం పట్టణంలోని తన కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మంగళవారం పార్టీ నాయకులతో కీలక సమావేశం నిర్వహించారు. వార్డు, పంచాయతీల పరిశీలకులు, మండల, పట్టణ కన్వీనర్లు ఈ భేటీలో పాల్గొన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం నుంచి ప్రజా సమస్యల పోరాటం వరకు భవిష్యత్తు కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు.
సూర్యాపేట జిల్లాలో యూరియా నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, రైతులు ఆందోళన చెందవద్దని జిల్లా వ్యవసాయ అధికారి తెలిపారు. ఫెర్టిలైజర్ మొబైల్ యాప్ ద్వారా రైతులు ఇంటి నుంచే పారదర్శకంగా యూరియా బుక్ చేసుకోవచ్చని సూచించారు. స్మార్ట్ ఫోన్ లేని వారు వాలంటీర్ల సాయం తీసుకోవాలన్నారు. అనవసరంగా నిల్వ చేయవద్దని, అవసరమైనప్పుడే కొనుగోలు చేసి సహకరించాలని ఆయన కోరారు.
ATP: మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని మంగళవారం శింగనమల నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త సాకే శైలజానాథ్ కలిశారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు నుంచి పార్టీ బలోపేతం వరకు పలు అంశాలపై వీరు చర్చించారు. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకలాపాలను ముమ్మరం చేయడం, ప్రజా సమస్యలపై పోరాటం వంటి వ్యూహాలపై సుదీర్ఘంగా సంప్రదింపులు జరిపారు.
NZB: పదో తరగతి వార్షిక పరీక్షా కేంద్రాల్లోకి విద్యార్థులతో పాటు చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంట్ ఆఫీసర్లకు సెల్ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు, ఎలక్ట్రానిక్ ఉపకరణాల అనుమతి లేదని కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పష్టం చేశారు. నగరంలోని కలెక్టరేట్‌లో మంగళవారం చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.
KMR: డోంగ్లి నర్సరీలో నాటిన మొక్కలను సంరక్షించాలని మండల ప్రత్యేకాధికారిని రమ్య సూచించారు. డోంగ్లిలోని నర్సరీను సందర్శించి పలు సూచనలు చేశారు. నర్సరీలో ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ మొక్కలు ఎదిగేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనంతరం గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించి లబ్ధిదారులకు పలు సూచనలు చేశారు.
NLG: హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై చిట్యాల పురపాలిక పరిధిలోని శివనేనిగూడెం గ్రామస్థులు మంగళవారం రాస్తారోకో చేపట్టారు. రెండు రోజుల క్రితం బైక్ ప్రమాదంలో గాయపడిన మహిళా బాధితురాలికి నష్టపరిహారం చెల్లించి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా నిందితుడిని పట్టుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
NGKL: వాహన డ్రైవర్లు కచ్చితంగా లైసెన్స్ కలిగి ఉండాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని మరికల్ సీఐ భగవంతు రెడ్డి వాహనదారులకు సూచించారు. అలైవ్ అరైవ్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం మండల కేంద్రంలో వాహనదారులకు అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, వేగంతో వాహనాలు నడపరాదన్నారు.
GNTR: కాకుమాను మండలం కొండపాటూరు శ్రీ పోలేరమ్మ తిరునాళ్ల ఏర్పాట్లపై మంగళవారం అధికారులు సమీక్షించారు. మార్చి 31న మల్లెపూల పూజ, ఏప్రిల్ 3న కుంకుమ పూజ, 7న తిరునాళ్లు జరగనున్నాయి. సమావేశంలో గ్రామస్తులు రోడ్లు, విద్యుత్, ట్రాఫిక్ సమస్యలను ప్రస్తావించారు. ఉన్నతాధికారులతో చర్చించి వెంటనే వీటిని పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇచ్చారు.
AP: విజయనగరం జిల్లా హుకుంపేటలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో భవానీ అనే వివాహిత సజీవ దహనమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
NRPT: జిల్లాలో జరిగే పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. నారాయణపేట కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశం నిర్వహించి, పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. పరీక్షలను పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు.
TG: బల్దియా దోమల ఫాగింగ్‌లో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. పంపకాల్లో తేడాలు రావడంతో అవినీతి బాగోతం బయటపడింది. ఫాగింగ్ కోసం కేటాయించిన డీజిల్ వాడకుండా అవినీతికి పాల్పడ్డారు. సిబ్బందికి నెలకు రూ.5 వేలు ఇచ్చి.. మిగిలిన డబ్బులను సూపర్ వైజర్ AE, SE పంచుకున్న వారిని ఉన్నతాధికారులు విధుల నుంచి తొలగించారు. అందుకే డీజిల్‌లో మైలాథిన్ కలిపి ఇస్తున్నట్లు తెలిపారు.
T20 క్రికెట్‌లో పాకిస్తాన్‌పై ఇంగ్లండ్ పూర్తి ఆధిపత్యం చలాయిస్తోంది. ఈ రెండు జట్లు 30 మ్యాచ్‌ల్లో తలపడగా.. ఇంగ్లండ్ 21 సార్లు గెలవగా, పాక్ కేవలం 9 మ్యాచ్‌ల్లోనే గెలుపొందింది. ఇక T20 WCలో.. ఈ రెండు జట్లు 3 సార్లు తలపడగా, అన్ని సార్లు ఇంగ్లండే విజయం సాధించింది. అదేవిధంగా, ఇరు జట్ల మధ్య జరిగిన చివరి 5 టీ20 మ్యాచ్‌ల్లోనూ ఇంగ్లీష్ జట్టే గెలవడం గమనార్హం.
JGL: ధర్మపురిలో ఇస్కాన్ ప్రతినిధుల బృందం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌ను కలిసింది. నరహరి ప్రభు ఆధ్వర్యంలో వచ్చిన బృందం ధర్మపురిలో ఇస్కాన్ మందిరం ఏర్పాటు చేయాలని వినతి పత్రం అందజేసింది. కృష్ణ భక్తి ప్రచారం, భగవద్గీత శిక్షణ, నిత్య అన్నదానం, గోశాల నిర్వహణ ప్రధాన లక్ష్యాలుగా వారు వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రేమానంద్, సురనాథ్, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.