• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘స్వర్ణాంధ్ర సాధనే లక్ష్యంగా పనిచేయాలి’

AKP: స్వర్ణాంధ్ర సాధనే లక్ష్యంగా పని చేయాలని కలెక్టర్ విజయ కృష్ణన్ పిలుపునిచ్చారు. మంగళవారం కలెక్టరేట్ లో స్వర్ణాంధ్ర-2047 ప్రణాళికకు సంబంధించి విజన్ యాక్షన్ ప్లాన్ పై అధికారులతో సమీక్ష నిర్వహించారు. స్వర్ణాంధ్ర విజన్ లో భాగంగా పీ-4 విధానం అమలు జరుగుతుందన్నారు. అభివృద్ధి దిశగా అధికారులు కృషి చేయాలన్నారు. ప్రజలను అన్ని విధాల అభివృద్ధిలో తీసుకురావాలన్నారు.

February 25, 2026 / 06:39 AM IST

మతిస్థిమితం కోల్పోయి బావిలో దూకి వ్యక్తి ఆత్మహత్య

KMM: మానసిక స్థితి సరిగా లేక బావిలో దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. SI హరిత తెలిపిన వివరాల ప్రకారం.. కల్లూరు కప్పలబంధం రోడ్డులో నివాసం ఉంటున్న వేనేపల్లి సత్యనారాయణ (47) కొంతకాలంగా మతిస్థిమితం కోల్పోయి ఇబ్బంది పడుతున్నాడు. ఈ క్రమంలోనే బావిలోకి దూకి ప్రాణాలు విడిచాడు.

February 25, 2026 / 06:39 AM IST

నాగర్ కర్నూల్ ఘటనకు ఖండిస్తూ.. కొవ్వొత్తుల ర్యాలీ

NZB:  ఇటీవల నాగర్ కర్నూల్ జిల్లాలో జరిగిన అమానుష ఘటనలో రెండు నెలల పసికందు మరణించిన ఘటనను ఖండిస్తూ.. తెలంగాణ యూనివర్సిటీ అంబేద్కర్ సాధన సమితి ఆధ్వర్యంలో మంగళవారం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. యూనివర్సిటీలో ర్యాలీ చేపట్టి పసికందు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.ఏఐ రాజ్యమేలుతున్న ఈ కాలంలో కూడా ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరమన్నారు.

February 25, 2026 / 06:38 AM IST

‘ఇంటర్ పరీక్షలు కట్టుదిట్టంగా నిర్వహించాలి’

PDPL: ఈ నెల 25 నుంచి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించాలని చీఫ్ సెక్రటరీ రామకృష్ణ రావు జిల్లా కలెక్టర్లతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆదేశించారు. విద్యార్థులు 5 నిమిషాలు ఆలస్యమైనా పరీక్షకు అనుమతించాలని తెలిపారు. తాగునీరు, విద్యుత్, రవాణా సదుపాయం కల్పించాలని సూచించారు. ఈ సమావేశంలో కలెక్టర్ శ్రీ హర్ష, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

February 25, 2026 / 06:38 AM IST

అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలి: మంత్రి

WNP: అధికారులు కేవలం కార్యాలయాలకే పరిమితం కాకుండా ఉదయం వేళల్లో గ్రామాల్లో పర్యటించి క్షేత్రస్థాయి సమస్యలను తెలుసుకోవాలని మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు. వనపర్తిలో నిర్వహించిన అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు చేరువగా ఉండి సేవలు అందించాలని పేర్కొన్నారు.

February 25, 2026 / 06:37 AM IST

హైదరాబాద్ స్టార్టప్ సరికొత్త రికార్డు

TG: HYDకు చెందిన స్టార్టప్ సంస్థ జెనిత్ అన్‌మ్యాన్డ్ సిస్టమ్స్ తన తొలి డ్రోన్ ప్రోటోటైప్‌ను విజయవంతంగా పరీక్షించింది. ఈ డ్రోన్ పనితీరు, సామర్థ్యాన్ని నిర్ధారించేలా నిర్వహించిన ఫ్లైట్ టెస్ట్ సక్సెస్ కావడంతో కంపెనీ మరో కీలక మైలురాయిని అధిగమించింది. భవిష్యత్తులో నిఘా, రవాణా, వ్యవసాయ రంగాలలో ఈ డ్రోన్ సాంకేతికత విప్లవాత్మక మార్పులు తీసుకువస్తుందని అంచనా వేస్తున్నారు.

February 25, 2026 / 06:37 AM IST

నరసాపురంలో ఐదుగురిపై కేసు నమోదు

W.G: నరసాపురం మండలం యర్రంశెట్టివారిపాలెంలో కూనపురెడ్డి సంజీవ్‌రావుపై దాడి చేసిన ఐదుగురిపై రూరల్ పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. రూరల్ ఎస్సై టీవీ సురేష్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 22న ఆదివారం కుటుంబ కలహాల నేపథ్యంలో సంజీవ్‌రావుపై ఆయన కోడలు నవ్యరాణి, ఆమె బంధువులు కోటిపల్లి అబ్బాయి, సురేష్, రామకృష్ణ మరి కొందరితో కలిసి దాడికి పాల్పడ్డారు.

February 25, 2026 / 06:36 AM IST

దట్టమైన అడవిలో 15 ఏళ్ల వనవాసం

 BDK: అశ్వారావుపేట మండలం కావడిగుండ్ల గ్రామ పంచాయతీ పరిధిలోని పాత గోగులపూడి గ్రామంలో నివసిస్తున్న ఆ కుటుంబం దీనస్థితి ఇది. చుట్టూ క్రూరమృగాలు దట్టమైన అడవి జనసంచారానికి 10 కిలోమీటర్ల దూరం అయినా సరే, ఆ అడవినే నమ్ముకుని గత 15 ఏళ్లుగా ఒకే ఒక కుటుంబం జీవనం సాగిస్తోంది. దాత రమావత్ అనిష్ సుమారు 15 వేల రూపాయల విలువైన నిత్యావసర సరుకులు, ఇచ్చారు.

February 25, 2026 / 06:36 AM IST

నేడు నందిపల్లెకు రానున్న YS జగన్

KDP: మాజీ సీఎం వైయస్ జగన్ నేడు వేంపల్లి మండలంలోని నంది పల్లెకు రానున్నారు. గ్రామంలో నూతనంగా నిర్మించిన నందీశ్వర స్వామి ఆలయ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొంటారు. ఇప్పటికే ఆయన పులివెందుల చేరుకున్నారు. జగన్ రాకతో అన్ని ఏర్పాట్లను ఆలయ నిర్వాహకులు సిద్ధం చేశారు. తెల్లవారుజాము నుంచే పూజా కార్యక్రమాలను ఏర్పాటు చేయనున్నారు.

February 25, 2026 / 06:36 AM IST

ఇంటర్ పరీక్షా ఏడు కేంద్రాలు ఏర్పాటు..!

RR: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో షాద్ నగర్‌లో మొత్తం 7 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష నిర్వహించడం జరుగుతుందని, మొదటి రోజు 3,131 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు.

February 25, 2026 / 06:36 AM IST

దర్గా భవన నిర్మాణానికి విన్నపం

NGKL: రంగాపూర్ హజ్రత్ నిరంజన్ షావలి దర్గాలో నూతన సమఖానా భవనం నిర్మించాలని దర్గా కమిటీ ఛైర్మన్ రఫీ విజ్ఞప్తి చేశారు. మంగళవారం హైదరాబాద్‌లో వక్ఫ్ బోర్డు ఛైర్మన్ అజ్మత్ ఉల్లాను కలిసి వినతిపత్రం అందజేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఛైర్మన్ భవన నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

February 25, 2026 / 06:34 AM IST

‘డయేరియా బాధితులకు మెరుగైన వైద్యం అందించాలి’

SKLM: జిల్లాలో డయేరియా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే శంకర్ మంగళవారం రాత్రి రిమ్స్ ఆసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి, వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం అన్ని విధాల బాధితులకు అండగా ఉంటుందని భరోసా కల్పించారు.

February 25, 2026 / 06:33 AM IST

‘టాక్సిక్‌’లో మరో స్టార్ నటుడు

కన్నడ స్టార్ యష్, దర్శకురాలు గీతూ మోహన్ దాస్ కాంబోలో ‘టాక్సిక్’ మూవీ తెరకెక్కుతోంది. అయితే ఈ మూవీలో మరో స్టార్ యాక్టర్ నటిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. నటుడు బాలాజీ మనోహర్ ‘భీరా’ అనే ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుపుతూ పోస్టర్ షేర్ చేశారు. ఇక ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళం, మలయాళం సహా మరికొన్ని భాషల్లో మార్చి 19న విడుదల చేయనున్నారు.

February 25, 2026 / 06:32 AM IST

వచ్చే నెల 4న ఛలో విజయవాడ

ASR: గొర్రెల మేకల పెంపకం దారుల సమస్యలు పరిష్కరించాలని గొర్రెల, మేకల పెంపకం దారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గంటా శ్రీరామ్, జిల్లా కార్యదర్శి జి.దేముడుబాబు డిమాండ్ చేశారు. మంగళవారం అనకాపల్లి రామునాయుడు భవనంలో మాట్లాడుతూ.. సమస్యలపై వచ్చే నెల 4న ఛలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. గొర్రెల మేకల పెంపకం దారులకు సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలన్నారు.

February 25, 2026 / 06:31 AM IST

బూర్గుల ఆసుపత్రి వైద్యుడిగా రఘురాం నియామకం

RR: ఫరూఖ్ నగర్ మండలం బూర్గుల ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యుడు డాక్టర్ రాఘవేందర్ ఎట్టకేలకు బదిలీ అయ్యారు. రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని బదిలీ ఉత్తర్వులు మూడు వారాల క్రితమే పంపగా.. ఉత్తర్వులు తీసుకోకుండా కాలయాపన చేశారు. ప్రజల నుంచి ఆరోపణలు వెల్లువెత్తడంతో నూతన వైద్యుడిగా డాక్టర్ రఘురాంను నియమించగా.. ఆయన నిన్న ఆసుపత్రిలో రిపోర్ట్ చేశారు .

February 25, 2026 / 06:31 AM IST