TG: HYDకు చెందిన స్టార్టప్ సంస్థ జెనిత్ అన్మ్యాన్డ్ సిస్టమ్స్ తన తొలి డ్రోన్ ప్రోటోటైప్‌ను విజయవంతంగా పరీక్షించింది. ఈ డ్రోన్ పనితీరు, సామర్థ్యాన్ని నిర్ధారించేలా నిర్వహించిన ఫ్లైట్ టెస్ట్ సక్సెస్ కావడంతో కంపెనీ మరో కీలక మైలురాయిని అధిగమించింది. భవిష్యత్తులో నిఘా, రవాణా, వ్యవసాయ రంగాలలో ఈ డ్రోన్ సాంకేతికత విప్లవాత్మక మార్పులు తీసుకువస్తుందని అంచనా వేస్తున్నారు.