• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధి చేయాలి’

BDK: BRS పార్టీ తరఫున గెలిచిన కార్పొరేటర్లు ప్రజలకు అందుబాటులో ఉంటూ డివిజన్ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేయాలని వనమా సూచించారు. కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావును నూతన కార్పొరేటర్లు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన కార్పొరేటర్లను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పలు రాజకీయ అంశాలపై చర్చించారు.

February 24, 2026 / 03:11 PM IST

అక్రమంగా ఇసుక తరలింపు

MDK: కొల్చారం మండలం పైతర, తుక్కాపూర్ శివారుల్లో మంజీరా ఇసుక దోపిడీ బహిరంగంగా సాగుతోంది. ట్రాక్టర్ల ద్వారా అక్రమంగా ఇసుకను తరలిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఈ అక్రమ రవాణా వల్ల పర్యావరణం దెబ్బతింటోందని, తక్షణమే ఈ దందాను అరికట్టి అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు అధికారులను కోరుతున్నారు.

February 24, 2026 / 03:10 PM IST

ఆపరేషన్ కగార్‌లో కీలక పరిణామం

TG: ఆపరేషన్ కగార్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మావోయిస్టు అగ్రనేతలు డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. మావోయిస్టు అగ్రనేత దేవ్‌జీతో పాటు కేంద్రకమిటీ సభ్యులు మల్లారెడ్డి, నూనె గంగన్న పోలీసులకు సరెండర్ అయ్యారు. వారితో పాటు పెద్ద ఎత్తున మావోయిస్టులు లొంగిపోయినట్లు డీజీపీ వెల్లడించారు.

February 24, 2026 / 03:10 PM IST

లడ్డూ విషయంలో టీడీపీ తప్పు మీద తప్పు చేస్తోంది: వైసీపీ

AP: తిరుమల లడ్డూ కల్తీపై వైసీపీ వరుస ట్వీట్లు చేసింది. ప్రభుత్వ ఆరోపణలు అవాస్తమని SMలో పోస్టులు పెట్టింది. కర్ణాటక మిల్క్ డెయిరీ అసలు టెండర్లలోనే పాల్గొనలేదని తెలిపింది. ఇప్పుడు టెండర్‌కు తగినట్టుగా సరఫరా చేయలేకపోవడంతో మిగిలిన మొత్తాన్ని సంగంకు కట్టబెట్టారని ఆరోపించింది. తిరుమల లడ్డూ విషయంలో టీడీపీ తప్పు మీద తప్పు చేస్తోందని విమర్శించింది.

February 24, 2026 / 03:09 PM IST

బాపట్ల జిల్లాలో వేగంగా రీ-సర్వే ప్రక్రియ

BPT:  జిల్లాలోని పది గ్రామాల్లో రీ-సర్వే ప్రక్రియ వేగంగా సాగుతోందని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ మంగళవారం వెల్లడించారు. జిల్లాలో మొత్తం 6,400 పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేయాల్సి ఉండగా, ఇప్పటివరకు 1,287 మంది రైతులకు అందజేశామని తెలిపారు. మిగిలిన పుస్తకాలను కూడా జాప్యం లేకుండా తక్షణమే అర్హులకు అందించాలని అధికారులను ఆదేశించారు.

February 24, 2026 / 03:06 PM IST

అక్రమ ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్ పట్టివేత

ASF: రెబ్బెన మండలంలో మంగళవారం నిర్వహించిన వాహనాల తనిఖీల్లో అక్రమ ఇసుక రవాణా బయటపడింది. పాసిగాం నుంచి రెబ్బెనకు అనుమతి లేకుండా ఇసుక లోడ్తో వెళ్తున్న ట్రాక్టర్‌ను పోలీసులు పట్టుకున్నారు. డ్రైవర్, ఓనర్ నీకోడే తిరుపతిపై కేసు నమోదు చేసినట్లు SI వెంకట కృష్ణ తెలిపారు. అక్రమ రవాణాపై కఠిన చర్యలు కొనసాగుతాయని హెచ్చరించారు.

February 24, 2026 / 03:05 PM IST

‘ఇంటర్ పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట పోలీస్ బందోబస్తు’

SRPT: రేపటి నుంచి జరగనున్న ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్పీ నరసింహ మంగళవారం తెలిపారు. ఈనెల 25 నుంచి మార్చి 18 వరకు పరీక్షలు జరుగుతుండగా పరీక్ష సమయాల్లో పరీక్ష కేంద్రాల వద్ద శాంతి భద్రతల దృష్ట్యా 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలన్నారు.

February 24, 2026 / 03:05 PM IST

‘గోదావరి పవిత్రతను కాపాడాలి’

PDPL: ధర్మపురిలో గోదావరి నది పరిశుభ్రత కోసం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ “స్వచ్ఛ ధర్మపురి-స్వచ్ఛ గోదావరి” కార్యక్రమాన్ని ప్రారంభించారు. పార్టీలకు అతీతంగా అందరూ కలిసి గోదావరి పవిత్రతను కాపాడాలని ఆయన తెలిపారు. భక్తులు నదిలో పాత బట్టలు, చెత్త వేయకుండా సూచించిన ప్రదేశాల్లో వేయాలని పేర్కొన్నారు.

February 24, 2026 / 03:02 PM IST

‘ఉద్యోగులు, పెన్షనర్లకు ఆరోగ్య పథకం హర్షణీయం’

MNCL: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వం ఆరోగ్య పథకాన్ని ప్రవేశ పెట్టడం హర్షణీయమని టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి అన్నారు. మంగళవారం మంచిర్యాలలో మాట్లాడుతూ ఉద్యోగులకు రూ. 1 కోటి బీమా సదుపాయం, వైద్య విధాన పరిషత్ ఉద్యోగుల జీతాలను 010 పద్దు ద్వారా చెల్లిస్తూ ప్రత్యేక డైరెక్టరేట్‌ను మంజూరు చేయడం పట్ల ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

February 24, 2026 / 03:02 PM IST

‘స్వచ్ఛభారత్ వైపు అడుగులు వేయాలి’

MBNR: స్వచ్ఛ భారత్ వైపు ప్రతి ఒక్కరు అడుగులు వేయాలని మహబూబ్ నగర్ కార్పొరేషన్ 21 డివిజన్ కార్పొరేటర్ గుండా సంతోష్ అన్నారు. జిల్లా కేంద్రంలోని శ్రీనివాస కాలనీలో గీతం పాఠశాల విద్యార్థులతో కలిసి స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా స్వచ్ఛభారత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు.

February 24, 2026 / 03:01 PM IST

పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు: ఎస్పీ

WNP: జిల్లాలో రేపటి నుంచి మార్చి 18 వరకు జరగనున్న ఇంటర్ పరీక్షల నేపథ్యంలో ఎస్పీ సునీత రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. 25 పరీక్షా కేంద్రాల వద్ద ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు. కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలోని జిరాక్స్ సెంటర్లను మూసివేయాలని, పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

February 24, 2026 / 03:00 PM IST

కుమ్మరి సంఘం నాయకుడికి పరామర్శ

NLG: తెలంగాణ కుమ్మర సంఘం జిల్లా కార్యవర్గ సభ్యులు తాడూరి చంద్రం తండ్రి వీరయ్య ఇటీవల మరణించిన విషమం తెలిసిందే. ఇవాళ చిట్యాలలోని వారి స్వగృహంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోశాధికారి ఆమంచి రాజలింగం, ఉపాధ్యక్షులు ఏడుకొండల వెంకటేశం, ఇతర జిల్లా, మండల స్థాయి నాయకులు పాల్గొన్నారు.

February 24, 2026 / 03:00 PM IST

ఉపాధి హామీ పనులు పరిశీలించిన సర్పంచ్

KMR: జుక్కల్ మండలంలోని బస్వాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని మహాదేవ్ కుంటలో చురుకుగా సాగుతున్న ఉపాధి హామీ పనులు   గ్ర సర్పంచ్ రమణ పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. కూలీలు ప్రతిరోజు ఉదయం 8 గంటలకు వచ్చి 12 గంటలకు వెళ్లాలన్నారు. ప్రతి ఒక్కరూ సమయం పాటించాలని ఇవాళ కూలీలకు విజ్ఞప్తి చేశారు.

February 24, 2026 / 03:00 PM IST

రిలే సామూహిక దీక్షలకు మాజీ ఎమ్మెల్యే మద్దతు

ATP: గుంతకల్లు మున్సిపాలిటీ కార్యాలయం సమీపంలో రైతు సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే దీక్షలు మంగళవారం ఐదవ రోజుకు చేరాయి. దీక్షాపరులకు మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని చెరువులకు నీళ్లు అందించే విధంగా సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తామని వారు దీక్షాపరులకు హామీ ఇచ్చారు.

February 24, 2026 / 03:00 PM IST

శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి హుండీ లెక్కింపు

NLR: బోగోలు మండలంలోని కొండ బిట్రగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని అధికారులు లెక్కించారు. మంగళవారం ఈ సందర్భంగా కార్యనిర్వాహణ అధికారి రాధాకృష్ణ మాట్లాడుతూ.. మూడు నెలలకు గాను హుండీ ఆదాయం రూ.19,83,056 వచ్చినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

February 24, 2026 / 03:00 PM IST