ATP: పెద్దవడుగూరు మండలం మల్లేనిపల్లిలో సోమవారం జరిగిన స్థల వివాదంతో నాగన్న అనే వ్యక్తిపై గొడ్డలితో దాడి చేసిన ఘటనలో ముత్యాలు అనే వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ఆంజనేయులు తెలిపారు. బుధవారం ఎస్ఐ మీడియాతో మాట్లాడారు. పాత కక్షలను మనసులో పెట్టుకుని దాడులకు పాల్పడితే ఉపేక్షించేది లేదన్నారు. సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే వాటిని పరిష్కరిస్తామన్నారు.
VKB: చౌడాపూర్ మండలం పచ్చవుకుంట తండాలో శ్రీ బంగారు మైసమ్మ విగ్రహ ప్రతిష్ఠాపన పూజా కార్యక్రమం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది. గ్రామాల్లో ఇలాంటి ధార్మిక కార్యక్రమాలు సామరస్యాన్ని పెంపొందిస్తాయని గ్రామప్రజలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అశోక్, సర్పంచ్ సవిత రాజు, చౌడాపూర్ సర్పంచ్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ సలీమ్, రాము, గ్రామస్థులు పాల్గొన్నారు.
WNP: అయ్యప్ప స్వామి ఆలయ కమిటీ సభ్యులకు, భక్తుల పిలుపు మేరకు అయ్యప్ప స్వామి దర్శనానికి విచ్చేసిన మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్‌కి ఘన స్వాగతం పలికారు. వనపర్తి అయ్యప్ప స్వామి ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. విచ్చేసిన భక్తులకు, కమిటీ సభ్యులకు పేరుపేరునా ఆలయ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
NLG: దేవరకొండ ఆర్టీసీ వెల్ఫేర్ కమిటీ మెంబర్ పాపారాజు, కార్మికులు కలిసి వారి సమస్యల గురించి ఎమ్మెల్సీ కోదండరామ్‌కు బుధవారం వినతిపత్రం అందజేశారు. ఆర్టీసీ కార్మికుల తరుపున సీఎం రేవంత్ రెడ్డి, రవాణా శాఖా మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. పూర్తి స్థాయిలో వారి సమస్యలను విని కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
SRCL: ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలకు తొలి రోజు 4209 మంది విద్యార్థులు హాజరైనట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. జిల్లాలోని 16 పరీక్ష కేంద్రాలలో నిర్వహించిన తొలి రోజు పరీక్షలో 4046 మంది రెగ్యులర్, 283 మంది ప్రైవేటు విద్యార్థులు కలిపి 4328 మంది విద్యార్థులకు గాను, 4209 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారన్నారు. అలాగే 119 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు.
GNTR: మంత్రి లోకేష్ కృషితో మంగళగిరి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఆత్మకూరులో కోకాకోలా సంస్థ సీఎస్ఆర్ నిధులు రూ.35 లక్షలతో పలు పనులు చేపట్టారు. అంగన్వాడీ కేంద్రాలు 52, 53, 54లను ఆధునీకరించి, 62వ కేంద్రానికి స్మార్ట్ టీవీ అందించారు. జెడ్పీ హైస్కూల్‌కు కంప్యూటర్లు, సీసీ కెమెరాలు, క్రీడా దుస్తులు అందజేశారు.
VZM: పోలిపల్లి పైడితల్లి అమ్మవారి పండగను రాష్ట్ర పండగగా ప్రకటించినందుకు అసెంబ్లీలో రాజాం MLA కొండ్రు మురళీమోహన్ కృతజ్ఞతలు తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. రాజాంలోని గుళ్లసీతారాంపురంలోని 150 సంవత్సరాల చరిత్ర గల రామాలయ అభివృద్ధికి ప్రభుత్వం సహకరించాలని కోరారు. పట్టణంలో, సారధి గ్రామంలో రైతులకు సంబంధించి 70 ఎకరాల భూమి సమస్యను పరిష్కరించాలని కోరారు.
ADB: విద్యార్థులు ప్రాథమిక దశ నుంచి సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. బుధవారం పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఆశ్రమ పాఠశాలలో ధ్యేయ లెర్నింగ్ సొల్యూషన్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న లెర్న్ స్మార్ట్ విత్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీంతో విద్యార్థులకు కంప్యూటర్ జ్ఞానం పెరగడంతో పాటు విషయ పరిజ్ఞానం సైతం పెరుగుతుందన్నారు.
ADB: జిల్లాలో మార్చి 14న జరగాల్సిన జాతీయ లోక్ అదాలత్ అదే నెల 28వ తేదీకి వాయిదా పడినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు వెల్లడించారు. అదనంగా లభించిన ఈ రెండు వారాల సమయాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. మార్చి 28న జరిగే అదాలత్లో పెద్ద సంఖ్యలో కేసులు పరిష్కారమయ్యేలా చూడాలని కోరారు.
AP: సీఎం చంద్రబాబు మార్కాపురం ప్రజా వేదిక సభకు హాజరయ్యారు. వెలిగొండ ప్రాజెక్టులో ఫీడర్ కాలువ లైనింగ్ పనుల శంకుస్థాపన అనంతరం సభలో పాల్గొన్నారు. జిల్లా ఏర్పాటు అయ్యాక తొలిసారి మార్కాపురం జిల్లా పర్యటనకు వచ్చిన చంద్రబాబుకు మంత్రులు గొట్టిపాటి, డీఎస్‌బీవీ స్వామి, నిమ్మల హెలిప్యాడ్ వద్ద సీఎంకు స్వాగతం పలికారు.
MNCL: మంత్రి వివేక్ పై BRS నాయకుల తీరును చెన్నూర్ కాంగ్రెస్ నాయకులు తప్పుబట్టారు. క్యాతన్పల్లి ఘటనలో మంత్రిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు.ప్రజాస్వామ్య బద్ధంగా ఓటు వేయడానికి వెళ్లిన మంత్రిపై దాడికి పాల్పడటం బాల్క సుమన్ అహంకారానికి నిదర్శనమన్నారు. తప్పు చేసి మంత్రిపైనే విమర్శలు చేయడం సరికాదని, BRS నేతలు తమ వైఖరి మార్చుకోవాలని హితవు పలికారు.
BPT: జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి, మౌలిక సదుపాయాల పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని కలెక్టర్ డా.వినోద్ కుమార్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో ఆయన సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న పనులను గడువులోగా పూర్తి చేసి, వెంటనే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఈ సందర్భంగా అధికారులకు ఆయన స్పష్టం చేశారు.
కృష్ణా: గ్రామీణ ప్రజలు ముందస్తు కాన్సర్ పరీక్షలు చేయించుకోవడం ఎంతో అవసరమని టిడిపి నేత వర్ల చైతన్య అన్నారు. బుధవారం పమిడిముక్కల మండలం హనుమంతపురం గ్రామ కమ్యూనిటీ హాల్‌లో నిర్వహిస్తున్న ఉచిత క్యాన్సర్ శిబిరాన్ని ఆయన సందర్శించారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా ఇటువంటి సేవా కార్యక్రమాలు కొనసాగించాలని పేర్కొన్నారు.
ATP: వజ్రకరూరు గ్రామంలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను జడ్పీ సీఈవో శివశంకర్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం పంచాయతీ కార్యాలయంలో రికార్డులను పరిశీలించి, మండల సమస్యలపై ఎంపీడీవోతో చర్చించారు. పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. పంచాయతీలో ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని గ్రామ సర్పంచ్ మోనాలిసాకు సూచించారు.
నెల్లూరు: బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షమ్మ స్వామి అమ్మవార్ల దేవస్థానాన్ని మార్చి మూడవ తేదీన సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా మూసివేయునున్నారు. ఆరోజు ఉదయం ఆర్జిత సేవలు అనంతరం 10 గంటల తర్వాత ఆలయాన్ని మూసివేస్తున్నట్లు ఈవో శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. సంప్రోక్షణ అనంతరం నాలుగవ తేదీ యధావిధిగా దర్శనం కల్పిస్తామన్నారు.