• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఎమ్మిగనూరులో పర్యటించిన కమిషనర్

KRNL: ఎమ్మిగనూరులోని సంజీవయ్య నగర్ మున్సిపల్ కమిషనర్ ఎన్.గంగిరెడ్డి మంగళవారం క్షేత్రస్థాయిలో పర్యటించారు. రోడ్లు, కాలువలు, నీటి సరఫరాను పరిశీలించారు. ఆయా వార్డులలోని సమస్యలపై ప్రజల నుంచి వినతులు తీసుకున్నారు. డీఈఈ రాజు నాయక్, శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు, ఏఈ ప్రతాప్, సిబ్బంది ఉన్నారు.

February 24, 2026 / 03:47 PM IST

ఇంటర్ పరీక్షల్లో కఠిన నిబంధనలు: జిల్లా అధికారి హెచ్చరిక

ఉమ్మడి వరంగల్ జిల్లాలో రేపటి నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల్లో తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని జిల్లా అధికారి వీరేందర్ స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రాలకు ఎలక్ట్రానిక్ వస్తువులు, డిజిటల్ వాచ్‌లు, సెల్‌ఫోన్లు, కెమెరాలు తీసుకురావద్దని ఆదేశించారు. పరీక్షా కేంద్రం చుట్టూ 200 మీటర్ల పరిధిలో జిరాక్స్ షాపులు తెరిచి ఉంచకూడదని సూచించారు.

February 24, 2026 / 03:46 PM IST

జిల్లా పరిషత్ హై స్కూల్‌లో ‘పీఎం మన్ కీ బాత్’

E.G: అనపర్తి MLA నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆదేశాల మేరకు అనపర్తి శ్రీ రామారెడ్డి జిల్లా పరిషత్ హై స్కూల్‌లో  పీఎం మన్ కీ బాత్ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా BJP జిల్లా కార్యదర్శి హేమ తులసి విద్యార్థిని, విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించారు. విజేతలకు ఎమ్మెల్యే చేతుల మీదుగా త్వరలో బహుమతులు అందజేస్తామన్నారు.

February 24, 2026 / 03:45 PM IST

పోలీసుల అదుపులో క్రిప్టో క్రిమిన‌ల్‌

VSP: క్రిప్టో కరెన్సీ పెట్టుబడుల పేరుతో అమాయక ప్రజల నుంచి వందల కోట్లు వసూలు చేసిన భారీ కుంభకోణం విశాఖలో వెలుగుచూసింది. ఈ కేసులో కీలక సూత్రధారిగా భావిస్తున్న రవి కిరణ్‌ను సైబర్ క్రైమ్ పోలీసులు సోమవారం అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్నారు. బాధితులు సీపీకి నేరుగా ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు, నిందితుడిని రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు.

February 24, 2026 / 03:45 PM IST

చేనేత సమస్యలపై సీఎంకు వినతి పత్రం

సత్యసాయి: చేనేత కార్మికుల సమస్యలను సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి ఆలిండియా వీవర్స్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు పప్పు దుర్గా రమేశ్ తీసుకెళ్లారు. సుమారు రూ.220 కోట్ల ఆప్కో బకాయిలు చెల్లించాలని, ఎన్నికల హామీ మేరకు కార్మికులకు రూ.25 వేల ఆర్థిక సాయం అందించాలని కోరారు. ఈ సమస్యలపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని, త్వరలోనే పరిష్కారం లభిస్తుందన్నారు.

February 24, 2026 / 03:45 PM IST

54 పతకాలతో క్రీడాకారుల సత్తా చాటారు: కలెక్టర్

BDK: సీఎం కప్ రాష్ట్ర స్థాయి క్రీడల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా క్రీడాకారులు 54 పతకాలు సాధించి ప్రతిభ చాటారు. ఈ విజయాలు జిల్లాకు గర్వకారణమని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అభినందించారు. క్రీడాకారులకు మరింత శిక్షణ, సౌకర్యాలు కల్పిస్తామని అధికారులు తెలిపారు. భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరింత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

February 24, 2026 / 03:44 PM IST

రహస్య జీవితాన్ని గడపాలనుకుంటున్నా: దేవ్‌జీ

TG: పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టు కీలక నేత దేవ్‌జీ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను రహస్య జీవితాన్ని గడపాలనుకుంటున్నట్లు తెలిపారు. ఇప్పుడు తామున్న పరిస్థితిని అందరూ అర్థం చేసుకోవాలని కోరారు. మావోయిజం ఎప్పుడూ ముగియదు.. ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతూనే ఉంటుందన్నారు. ప్రభుత్వంతో చర్చించిన అనంతరం మిగిలిన మావోయిస్టులకు సందేశం ఇస్తామని వెల్లడించారు.

February 24, 2026 / 03:43 PM IST

గుండె పోటుతో 13 ఏళ్ల బాలిక మృతి

RR: వయసుతో సంబంధంలేకుండా నమోదవుతున్న గుండెపోటు మరణాలు వేధిస్తున్నాయి. ఇబ్రహీంపట్న పరిధి మంచాలలోనూ సోమవారం ఓ పసి గుండె ఆగింది. స్థానికుల వివరాలు.. ఆగపల్లి గ్రామానికి చెందిన యాదవరావు కూతురు నిహారిక (13) ఛాతిలో నొప్పితో తల్లడిల్లుతుంటే నగరంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బాలిక మృతి చెందిందని వైద్యులు ధ్రువీకరించారు.

February 24, 2026 / 03:43 PM IST

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1,068.74 పాయింట్లు నష్టపోయి 82225.92 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 288.35 పాయింట్ల నష్టంతో 25424.65 దగ్గర ముగిసింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 90.94గా ఉంది.

February 24, 2026 / 03:43 PM IST

‘రక్షణలోనే కాదు.. క్రీడల్లోనూ మేమే సాటి’

GDWL: నిరంతరం విధి నిర్వహణలో ఉంటూనే, క్రీడల్లో అసాధారణ ప్రతిభ చూపి గద్వాల్ జిల్లా పేరును రాష్ట్ర స్థాయిలో నిలబెట్టడం గర్వకారణం అని జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు పేర్కొన్నారు. సైబరాబాద్ వేదికగా జరిగిన రాష్ట్ర స్థాయి పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో గద్వాల పోలీసులు 4 స్వర్ణ, 8 కాంస్య పతకాలతో సత్తా చాటారు. మంగళవారం విజేతలను ఎస్పీ అభినందించారు.

February 24, 2026 / 03:40 PM IST

‘కల్తీ నెయ్యి.. దోషులు ఎవరైనా సరే శిక్ష పడాల్సిందే’

AP: కల్తీనెయ్యిలో ఏ రసాయనాలు వాడారో ఆ పెరుమాళ్లకే తెలియాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ‘జంతు సంబంధ రసాయనాలు ఉన్నాయని NDDB రిపోర్టు చెప్పింది. ఆ నెయ్యి నెయ్యే కాదని CBI రిపోర్టు ఇచ్చింది. ఇది ధర్మానికి సంబంధించిన విషయం. టీటీడీ పాత బోర్డును జగన్ ఎందుకు వెనకేసుకొస్తున్నారు? కల్తీ నెయ్యి కేసులో దోషులు ఎవరైనా సరే శిక్ష పడాల్సిందే’ అని పవన్ వెల్లడించారు.

February 24, 2026 / 03:40 PM IST

‘స్పిరిట్’లో విలన్‌గా కొరియన్ స్టార్!

ప్రభాస్, సందీప్ రెడ్డి వంగాల ‘స్పిరిట్’ మూవీలో విలన్‌గా కొరియన్ స్టార్ డాన్ లీ నటించనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ విషయంపై అభిమానులు వంగాను ప్రశ్నించగా.. ‘మీరు అనుకున్నట్టే జరుగుతుంది’ అని హింట్ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో మార్చి 1న డాన్ లీ బర్త్ డే సందర్భంగా ఈ అంశంపై అధికారిక ప్రకటన లేదా ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చే అవకాశం ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది.

February 24, 2026 / 03:40 PM IST

దోమల మందు పిచికారి చేయాలని వినతి

NRPT: మరికల్ మండలంలోని మాధవరం గ్రామంలో దోమల బెడద ఎక్కువగా ఉందని దోమల నివారణకై దోమల మందు పిచికారి చేయాలని యువకులు మంగళవారం గ్రామ సర్పంచ్ మొగులప్పకు వినతి పత్రాన్ని సమర్పించారు. దోమలతో పాటు పందుల బాధలు నివారించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ ఆంజనేయులు, రాజు, రాము, చెన్నకేశవులు, ఆంజనేయులు ఇచ్చిన వారిలో ఉన్నారు.

February 24, 2026 / 03:39 PM IST

బడేంపల్లిలో తాగునీటి సమస్యకు తక్షణ పరిష్కారం

VKB: దోమ మండలంలోని బడేంపల్లిలో తాగునీటి బోర్ మోటార్ కాలిపోవడంతో గ్రామంలో నీటి సమస్య తలెత్తింది. విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ గడ్డం శంకర్ వెంటనే స్పందించి నూతన మోటార్ అమర్చే పనులను చేపట్టించారు. తక్షణ చర్యలతో మోటార్‌ను బిగించి గ్రామస్థులకు తిరిగి తాగునీటి సరఫరా పునరుద్ధరించారు. సర్పంచ్ వేగవంతమైన చర్యలకు గ్రామ ప్రజలు అభినందనలు తెలిపారు.

February 24, 2026 / 03:39 PM IST

అమ్మవారిని దర్శించుకున్న ఛైర్మన్

VZM: చీపురుపల్లిలో జరుగతున్న శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి జాతర మహోత్సవంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు, డీసీసీబీ ఛైర్మన్ కిమిడి నాగార్జున మంగళవారం పాల్గొన్నారు. ఈ సందర్బంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ సిబ్బంది అమ్మవారి చిత్రపటాన్ని ఆయనకు అందజేశారు.

February 24, 2026 / 03:39 PM IST