ASF: రెబ్బెన మండలంలో మంగళవారం నిర్వహించిన వాహనాల తనిఖీల్లో అక్రమ ఇసుక రవాణా బయటపడింది. పాసిగాం నుంచి రెబ్బెనకు అనుమతి లేకుండా ఇసుక లోడ్‌తో వెళ్తున్న ట్రాక్టర్‌ను పోలీసులు పట్టుకున్నారు. డ్రైవర్, ఓనర్ నీకోడే తిరుపతిపై కేసు నమోదు చేసినట్లు SI వెంకట కృష్ణ తెలిపారు. అక్రమ రవాణాపై కఠిన చర్యలు కొనసాగుతాయని హెచ్చరించారు.