నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబోలో వస్తున్న ‘ది ప్యారడైజ్’ మూవీ నుంచి హీరోయిన్ కయాదు లోహర్ ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. సుబ్బలక్ష్మిగా ఆమె క్లాసీ లుక్ ఆకట్టుకుంటోంది. హీరో ప్రయాణంలో కీలకమైన ఈ పాత్ర పోస్టర్ మీద ‘వెండితెరపై వెలగని తార’ అనే క్యాప్షన్ ఆసక్తి రేపుతోంది. మోహన్ బాబు విలన్గా నటిస్తున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఆగస్టు 21న థియేటర్లలో సందడి చేయనుంది.