లోకేష్ పాదయాత్ర చేసి ఏదో ఉద్దరిస్తాడని టీడీపీ నేతలు అనుకుంటున్నారని… లోకేష్ పై అసలు ప్రజలకు నమ్మకమే లేదు అని లక్ష్మీ పార్వతి అన్నారు. ఆమె… తిరుమల తిరుపతి దేవస్థానానికి దర్శనానికి వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆమె…చంద్రబాబు, లోకేష్ పై విమర్శలు చేశారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని.. తమ అమ్మగారి ఆరోగ్యం బాగుండాలని కోరుకున్నానని లక్ష్మీ పార్వతీ తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు జీవితం 2019 ఎన్నికలతో ముగిసిపోయిందని.. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఏం చెయ్యాలో తెలియక అయోమయంలో ఊగిసలాడుతున్నారని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో కూడా వాళ్లకు ఓటమి తప్పదని జోస్యం చెప్పారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర చేసి ఉద్దరిస్తానని అంటున్నారని.. లోకేష్‌పై ప్రజలకు నమ్మకంలేదన్నారు. చంద్రబాబు ఇక భాద్యతలు మరొకరికి ఇస్తే మంచిదని హితవు పలికారు. నారా లోకేష్ ఇచ్చి మరో తప్పు చెయ్యవద్దని.. నందమూరి కుటుంబంలో ఎవరికి హక్కు ఉందో వారే ముందుకు రావాలని కోరారు. ఎవరనేది వారే నిర్ణయించుకుంటారన్నారు.
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో జరిగిన ముఖ్యమంత్రి కార్యక్రమానికి భారీగా జన ప్రవాహం తరలి వచ్చిందన్నారు. మూడేళ్ల తర్వాత కూడా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోసం ప్రజలు ఎంతగానో పరితపిస్తున్నారో అర్ధమవుతుందన్నారు. వైఎస్ జగన్‌ను మళ్లి ముఖ్యమంత్రిని చెయ్యడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారన్నారు. మరోసారి వైఎస్సార్సీపీ విజయం ఖాయమని ధీమాను వ్యక్తం చేశారు.